పుట:Anandam Manishainavadu.pdf/48

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సినీనటుడు బ్రహ్మానందం అత్తిలిలో ఉన్నప4డు రమణతో చాలా సన్నిహితంగా మెలిగేవారు. వారిద్దరూ దగ్గరి బంధువులా అన్నట్టు ఉండేవారు. అదే సమయంలో ఏలూరులో యువజనోత్సవాలు జరిగాయి. రమణ కళాశాల విద్యార్దిగా పాల్గొని వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రధమస్థానం పొందగా, ఉపాధ్యాయునిగా నేను పెరవలి సమితికి ప్రాతినిధ్యం వహించి ఏకపాత్రల్లో ప్రధమస్థానం పొందాను. ఇద్దరం ఒక వేదికపై బహుమతులు అందుకోవడం ఇప్పటికీ నాకు ఆనందం కలిగించిన విషయం. 'తాళి' చిత్రంలో నా పాత్ర బాగా హిట్ అయింది. అప్పుడు గణపవరం మండలం దాసుళ్ళ కుముదపల్లి గ్రామంలో రమణ ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఆయన వార్షికోత్సవం నిర్వహించి నన్ను ముఖ్య అతిధిగా పిలిచి ఘన సన్మానం చేశారు. జీవితంలో ఎన్నో సన్మానాలు పొందిన రమణ చేసిన సన్మానం మాత్రం నాకు ఆనందాన్నిచ్చింది.

అల్లుడుపోరు అమ్మాయిజోరు సినిమాలో నటించిన రమణ. చిత్రంలో

ప్రముఖ నటులు సాక్షి రంగారావు, కాస్ట్యూమ్స్ కృష్ణ.


  • వ్యాసకర్త ఉపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ చేసి, ప్రస్తుతం సినిమాలలో హాస్యపాత్రల్లో నటిస్తున్నారు. గతంలో ఉద్యోగం చేస్తూనే ఏకపాత్రలు, నాటకాలలో రాణించి, అనేక బహుమతులు, అవార్డులు అందుకొన్నవారు.