పుట:Anandam Manishainavadu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యక్తులు చాలామంది పిల్లలను తమంత గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్ధడంలో ఫెయిల్ అయినవారే. కోట్లాది మందిని ప్రభావితం చేయగలిగిన నాయకులనే తన ఏకలవ్య శిష్యులుగా చేసుకున్న గాంధీజీ సొంత కొడుక్కి ఆదర్శాన్ని, దాన్ని ఆచరించడంలో ఉన్న గొప్పదనాన్ని వివరించలేకపోయారు. ఆ లోటు కూడా మా మావయ్యకు లేదు.

అన్నలు వదినలతో రమణ దంపతులు

జీవితంలో ఆటు పోట్లు ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది మూస మనుషులు అయిపోతుంటారు. తమ చిన్ననాట అనుభవించిన కలలను చిదిమేసుకుంటూ పోతారు. ఐతే మావయ్య కఠినమైన జీవితాన్ని అనుభవిస్తూ, బాధ్యతలు బంధాలు నిర్వర్తిస్తూనే చివరకు తనకు ఆసక్తి ఉన్న కళారంగాన్ని కూడా వదులుకోలేదు. పగలంతా స్కూల్లో, సాయంత్రాలు హడావుడి పనుల్లో, ఆపైన రచన వ్యాసంగంలో రోజంతా కరిగిపోయినా రాత్రి పన్నెండు గంటలకు నాటకాల రిహార్సల్స్‌కి వెళ్లి తెల్లవారుజామున ఇంటికి వచ్చేవాడు. ఐతే అదేమీ ఆయన ఇబ్బందిపడుతూ చేసినపనికాదు. ఆయన కావాలని ఆస్వాదిస్తూ చేశారు. కొందరు యోగా చేసినట్టుగా ఆయన కళలో శాంతి వెతుక్కున్నారని అనిపిస్తుంది నాకు. హాస్యంతో అందరినీ అలరించే మావయ్య తనని రీచార్జ్ చేసుకుంటాడు.