పుట:Anandam Manishainavadu.pdf/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అద్దె ఇల్లు వెతుక్కునేటప్పుడు పెద్ద వయసు ఉన్న మనుషులు ఉంటే ఇల్లు ఇవ్వం అని కొందరు ఇంటి ఓనర్లు కండిషన్ పెట్టేవారట. ఆ మాట వింటే మాత్రం శాంతమూర్తి అయినా అగ్రహోదగ్రుడు అయి పోయేవాడట. తన తల్లిని మాట అనే అవకాశమే ఇవ్వకూడదన్న కారణంతో ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్న రోజుల్లో తెగించి ఇల్లు కొనేశాడు. ఎవరైనా పెట్టుబడిగానో, స్వంత కారణాలతోనో ఇల్లు కొంటారు. తల్లికోసం ఇబ్బందులు పడి మరీ ఇల్లు కొనడం ఎక్కడైనా ఉందా? ఆ ఇబ్బందుల్లోనే ఆయన ఏటేటా మా అమ్మమ్మ పుట్టినరోజును పెద్ద పండుగలా చేసేవాడు. తన పుట్టినరోజు ఎప్పుడూ జరుపుకోని మావయ్య తల్లి పుట్టినరోజు మాత్రం క్రమం తప్పకుండా చేసేవాడు. ఇంతకీ విచిత్రం ఏమిటంటే ఒక పుట్టినరోజు పండుగలో మా అమ్మమ్మ అనారోగ్యానికి వైద్యం చేస్తున్న హాస్పిటల్‌లో అమ్మమ్మని బాగా చూసుకున్న డాక్టరుకేకాక నర్సుకు, కాంపౌండర్‌కి సన్మానం చేసి గౌరవించారు.

కష్టనష్టాలు ఎదురైనా ఇంటిపేరు, ప్రఖ్యాతులు నిలబెట్టేలా ప్రవర్తించడం ఆయన వ్యక్తిత్వంలోని మరో ప్రధానాశం. కష్టం మనిషికి గీటురాయి. నుజంగా బంగారమేదో, కానిదేదో ఆ గీటురాయి చెప్పేసినట్టే ఈ కష్టం మనిషిని పరీక్షిస్తుంది. ఆ పరీక్షలో ప్రతీసారీ మావయ్యే నెగ్గాడు. ఎన్ని పనులు చుట్టుముట్టినా, మిన్ను విరిగి మీద పడినా తానూ చెయ్యాల్సినదేదో చేసుకుపోడమే ఆయన మూలతత్త్వం. ఎవరైనా సాయం అర్ధిస్తే తన కష్టనష్టాలు ఆయనకు