కాళ్ళ మీద తానూ నిలబడి, ఉమ్మడి కుటుంబం ఎవరి దారి వారిది అయిపోయాకా కూడా కుటుంబంలో అందరికీ అండగా నిలబడిన దగ్గర నుంచీ నాకు తెలుసు. ఎవరు ఏం అన్నారు, ఏమనుకున్నారు లాంటివి ఆయనకు చాలా చిన్న విషయాలు. ఎవరికీ ఏం కావాలి, వారికి తాను ఏం చెయ్యాలి అనేది తనకి ముఖ్యమైన విషయం. తనకన్నా పెద్దవాళ్ళు అందరినీ కొడుకులా చూసుకునేవాడు, తనకాన్నా చిన్నవాళ్ళని సొంత తండ్రిలా చూసేవాడు.
రోజురోజుకూ అరుదైపోతున్న ఆత్మీయతానురాగాలకు ఆయన నిలువెత్తు రూపం. చెల్లెలి పిల్లలా, అన్నయ్య పిల్లలా, అక్క పిల్లలా, సొంత పిల్లలా అన్న తేడా ఎక్కడా మచ్చుకైనా కనిపించేది కాదు. పిల్లలు ఎవరైనా పిల్లలే. మరీ మాట్లాడితే చెల్లెళ్ళు కూడా పిల్లలే అన్నట్టుగా ఉంటుంది ఆయన వ్యవహారం. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆయన తన తల్లిని చూసుకున్న పద్దతి. మావయ్య వాళ్ళ అమ్మని ప్రేమించి చూసుకున్న పద్ధతిలోనే ఆయన వ్యక్తిత్వం తెలుస్తుంది. మా అమ్మమ్మ ప్రారంభంలో ధనవంతులే అయినా జీవితమంతా కష్టాలు, పేదరికం అనుభవిస్తూ, వృద్ధాప్యంలో మాత్రం మావయ్య దగ్గర చాలా సంతోషం అనుభవించింది. విలువనివ్వడం, ఆరోగ్యం చూసుకోవడం, ప్రేమగా మాట్లాడడం ఇలా ఏం చూసినా ఆవిడకి జీవితం స్వర్గంగా చేసాడు. వాళ్ళు