పుట:Anandam Manishainavadu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తన సొంతూరు కంచుమర్రులో ఆయా మొక్కలు, చెట్లతో ఉండే అనబంధం మాట్లాడుతూ, వృక్షాలకు సంబంధించిన ఎన్నో వివరాలు చెప్తూ చాలా ఆసక్తికరమైన అనుభవం చెప్పేవారు. ఇద్దరం ఎన్నో రకాల పత్రులు

సేకరించేవాళ్లం. పక్షులు, జంతువుల అంటే ఆయనకు ఎంతో ప్రేమ, అంతకన్నా దయ. ఎప్పుడైనా వర్షం పడితే ఆ వర్షాన్ని ఆస్వాదిస్తూనే, పాపం కాకులు, పిచ్చుకలు గూళ్ళు లేకుండా అయిపోతాయని బాధపడేవారు. రోజూ తాను తినగా కొంత అన్నం, కూర మిగిల్చి గోడలపై వేసి ముందుగా పెట్టుకున్న ఓ బుల్లి గిన్నెలో నీళ్లుపోసి వచ్చేవారు. కాకులు, ఇతర పక్షులు తింటే ఆనందించేవారు. ఉడతలు, పిచ్చుకలు ఏం తింటాయో ఆయనకు తెలుసు. అటువంటి దినుసులే వేసి అవి తింటూంటే చూసి సంబరపడేవారు. ఆయన చేసే కొన్ని పనులు చూస్తే ఇంత సున్నితమైన ఆలోచన చేయవచ్చా అని ఆశ్చర్యపరిచేవారు. మొన్నామధ్య ఓ పూర్వ విద్యార్ధి కనిపిస్తే మాటల సందర్భంలో హెడ్‌మాష్టారు పక్షులకి, జంతువులకి కూడా అన్నం వేసేవారు కదండీ అంటూ గుర్తుచేసుకున్నాడంటే ఆయన ప్రభావం అలాంటిది. ఏ స్కూలుకు వెళ్ళినా ఆ