పుట:Anandam Manishainavadu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలెక్టర్: మరైతే ఈ నాలుగోవైపు దడి ఏమిటి?

ఎం. ఇ. ఓ. అవునండీ మూడు వైపులే పక్కాగోడ ఉంది అన్నారు.

వెంటనే కలెక్టర్‌గారు ఆ నాలుగో వైపు గోడ నిర్మించమని, ఈ రకంగా తన దృష్టికి సమస్యను తీసుకువచ్చినందుకు మమ్మల్ని అభినందించారు. ఆ సమయంలోనే స్కూలు అభివృద్ధికి మరికొన్ని అడిగితే అవీ వెంటనే చెయ్యమని ఆదేశించారు. ఆ విధంగా కరెంటు కూడా తెచ్చారు. ఇంతకీ ఈ రమణ మాస్టారు ఇచ్చిన సూచన ఏమిటంటే, ఈ మోడలు తయారుచేసి, నాలుగోవైపు కొబ్బరిఈను పల్లలతో దడిలా కట్టించారు మోడల్లో. అంతే ఫలించింది

గొల్లగూడెం పాఠాశాలకు ప్రభుత్వ నిధులు కాక కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టిం మాణిక్యాలరావుగారి సహకారంతో బేబీ కుర్చీలు, వట్టికూటి గుర్రాజుగారి సాయంతో జారేబల్ల, లయన్స్‌క్లబ్ వాళ్ల సహకారంతో నీళ్ళడ్రమ్ము వంటివి ఏర్పాటుచేశాం. లింగారాయుడుగూడెం పాఠశాలకు గండికోట రాజేంద్రగారి సహకారంతో కంప్యూటర్, ఆటవస్తువులు, బ్యాగులు, వాసవీక్లబ్‌వారి సహాయంతో చెప్పులు, పుస్తకాలు, నేర్పరి సేవాసంస్థ ద్వారా మొక్కలు, వాసవీక్లబ్ సాయంతో గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలు, గ్రామస్తులు, ఇతర దాతల సహాయంతో వార్షికోత్సవాలు, ఇతర కార్యక్రమాల కోసం స్టేజి నిర్మాణం వంటివి ఎన్నో చేశారు.

ప్రకృతి ఆరాధకుడు : - రమణ మాస్టారు నిత్యం తనచుట్టు ఉన్న పరిసరాలను చాలా లోతుగా పరిశీలించే తత్త్వం కలవారు. ఆయన అంత ఖాళీలేని నిత్య సంఘర్షణమయమైన జీవితం గడుపుతూన్నా చిన్న చిన్న విషయాల్లోనే ఆనందం వెతుక్కుంటారు. ఇద్దరం బండిమీద స్కూలుకు వెళ్ళివస్తూంటే దారిలో పక్షుల వరుస చూసి ఆనందభరితులవుతుంటారు. ఆ సంబరం నాకూ చూపించి పంచుకునేవారు. ఆకాశంలో మారే రంగులు, కాలానుగుణంగా ఏర్పడే రకరకాల మబ్బులు, వర్షపు నీటిగుంతలు, ప్రవహించే పిల్ల కాలువలు, పచ్చని చేలు ఇలా ప్రతీ చిన్న వివరం గమనిస్తూ వాటిలోని అందాలను ముచ్చటిస్తారు. వినాయకచవితి సమయంలో గణపతికి ఇష్టమైన పత్రి ఆయనతోపాటుగా సేకరించడం ఒక చక్కని అనుభూతి. ప్రతి మొక్కనీ పేర్లు చెప్పి, చిన్నతనంలో