Jump to content

పుట:Anandam Manishainavadu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లింగారాయుడుగూడెం జారుడుబల్ల కట్టారు. ఐతే నిర్మాణవ్యయం చాలా పెరిగింది. కానీ మాస్టారి ఆలోచన వల్ల నిర్లాణం తగ్గడంతో 10 వేలకే పూర్తయ్యింది. ఎవరినీ అభ్యర్ధించనక్కర లేకుండా సర్పంచి స్వయంగా తన నిధుల నుంచి నిర్మించేశారు. ఈ పద్ధతి కూడా ప్రభుత్వ ఉన్నతోద్యోగులకు నచ్చి దాన్ని కూడా స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగానే కాక రాష్ట్రంలోని అంతటా ఈ మోడల్‌ను ప్రచారం చేశారు. ఆయన సృజన, ఆయన సమర్ధత ఆయనకే సాధ్యం.

గ్రామస్థులతో మమేకం : - మేము లింగారాయుడుగూడెం పాఠశాలకు వెళ్ళే సరికి అక్కడి గ్రామస్థులకు పాఠశాల అన్నా, ఉపాధ్యాయుల అన్నా సానుకూల అభిప్రాయం ఉండేది కాదు. రమణ మాస్టారు వెళ్ళేసరికి గ్రామస్థులతో జాగ్రత్తగా ఉండాలి, చాలా ప్రమాదం. తాగివచ్చి గొడవ చేస్తారు. అనే మాటలు వినిపించేవి. అలాంటి పేరున్న గ్రామంలో, అదే గ్రామస్తులతో మమేకమై స్కూలుకి, ఉపాధ్యాయులకు మంచిపేరు తెచ్చారు. కొన్నాళ్ళకే పాఠశాలలో ఏ పని ప్రారంభించినా గ్రామస్తులు అందరూ ముందుకు వచ్చి సాయం చేసే స్థాయికి చేర్చారు. నిత్యం బడి రాని పిల్లలను ఇళ్ళకు వెళ్ళి మరీ తీసుకువచ్చేవారు.