పుట:Anandam Manishainavadu.pdf/25

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మొత్తానికి తన పట్టుదలతో తోటి టీచర్లనే కాక ఊరివాళ్లను కూడా కదిలించి విజయవంతంగా, పటిష్టంగా నిర్మించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు దానితో సంతృప్తిచెంది రాష్ట్రవ్యాప్తంగా ఆ పథకాన్ని అమలుచేశారు. ఆ తర్వాత మేమిద్దరం పనిచేసిన లింగారాయడుగూడెంలో మరో పరిస్థితి. పాఠశాలకు రెండో అంతస్థు ఉండడంతో రమణగారి సృజన మరోలా పనిచేసింది. సాధారణంగా సిమెంటు జారుడుబల్లకు మధ్యలో నిర్మించే స్థంభం ఒకవైపు ఎక్కేందుకు మెట్లు, మరోవైపు జారేందుకు జారుడుబల్ల ఉంటాయి కదా. లింగారాయడు గూడెంలో ఉన్న రెండో అంతస్థుకు వెళ్ళే మెట్లు మలుపుతిరిగే చోట సైడ్‌వాల్‌కు అనుబంధంగా జారుడుబల్ల నిర్మించారు. దీనివల్ల ఎక్కేందుకు కట్టాల్సిన మెట్లు, మధ్యలో నిలువునా ఉండే స్థంభాలుగా సహజంగా రెండో అంతస్థుకు వెళ్ళే మెట్లు ఉపయోగపడ్డాయి. పిల్లలకు కూడా ఈ మోడల్ విపరీతంగా నచ్చింది. వాళ్ళు నేరుగా పై అంతస్థునుంచి వెళ్తూనే సగం మెట్లు దిగి మలుపులో ఈ జారుడుబల్ల ద్వారా కిందికి వెళ్ళిపోయేవారు. లింగారాయుడుగూడెంలో సర్పంచి స్వంత నిధులతో కట్టారు. గొల్లగూడెంలో జారుడుబల్ల నిర్మించిన నాలుగైదేళ్ళకు