Jump to content

పుట:Anandam Manishainavadu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుబ్రహ్మ

పెదిరెడ్డి తిరుపతిరావు

ఉపాధ్యాయులు, లింగారాయుడుగూడెం

తాడేపల్లిగూడెం మండలం

సాధారణంగా ఏ స్కూల్లోనైనా హెడ్మాస్టారు వస్తున్నారంటే పిల్లలు గడగడలాడి పోతారు. ఒక పక్కన ఉన్న వాళ్లు తాము ఉండాల్సిన చోటుకోసం మరో పక్కకు పరిగెడతారు. విగ్రహాల్లా భయంలో నిలబడిపోతారు. మా స్కూల్లో మాత్రం హెడ్మాస్టారు బండి మీద వస్తున్నారంటే స్కూలు మొదలుకాక ముందు అక్కడక్కడ ఉన్న పిల్లలంతా స్కూలు గేటు దగ్గరికి పరుగులు పెట్టుకుంటూ వచ్చేవారు. ఆయన చేతులు, వేళ్ళూ పట్టుకునేవాళ్ళు కొందరు, అతుక్కుపోయేవాళ్ళు కొందరు, కబుర్లు, విశేషాలు అన్నీ ఏకరువు పెట్టేవారు. ఆయన తెచ్చిన సంచీ పట్టుకోవడానికి పోటీలు పడి వంతులు వేసుకునేవాళ్ళు. ఆ ఐదు నిమిషాలు మా స్కూల్లో ఏదో సంబరం జరిగినట్టే ఉండేది. ఆ వచ్చిన వారు రమణ మాష్టారు. అందరికీ సూరంపూడి వెంకటరమణగా తెలిసిన మా మాష్టారు.

ఒక్కరోజు మాస్టారు స్కూలుకు రాకపోతే "ఎందుకు రాలేదు", "రేపు వస్తారు కదండీ..." అంటూ స్కూలు పిల్లలు వేసే ప్రశ్నలకు అంతే ఉండేది కాదు. వాళ్ళందరి మనసులోనూ ఏదో వెలితి... ఊరుకు వెళ్ళిన తండ్రి రాకపోతే పిల్లలు బాధపడే చందంగా. ఒకసారి మాస్టారికి ప్రమాదం జరిగి ఒక్కనెలపాటు మెడికల్ లీవ్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీలున్నంత వరకూ స్కూలుకు వచ్చే ప్రయత్నం చేసినా ఆయనకు రెస్ట్ అవసరమని డాక్టర్లు గట్టిగా చెప్పి కట్టడి చేసారు. ఆ సమయంలో స్కూలు పిల్లల స్థితి చూస్తే ఆశ్చర్యం కలిగేది. దిగులుగా, ఏదో కోల్పోయిన వారిలా ఉండేవారు. ప్రతి పాఠశాలలోనూ ఇద్దరు, ముగ్గురు విద్యార్ధులు కాస్త కలివిడితనం లేకుండా ఉంటారు. అలాంటి వాళ్లకు మాత్రం ఆయన తోడిదే పాఠశాల అన్నట్టుగా ఉండేది. ఆయన రాని ఆ నెల వాళ్ళ దిగులు, బాధ చెప్పనలవి కాదు. కొన్ని రోజులు ఓపిక పట్టి ఆయనకే నేరుగా రూపాయి కాయిన్ బాక్స్ నుంచి పిల్లలంతా కలిసి ఫోన్ చేసేవారు.

7