పుట:Anandam Manishainavadu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాయిలక్ష్మిని సహధర్మచారిణిగా స్వీకరించి, చక్కని సంతానాన్ని కుమారుడు పవన్ సంతోష్, కుమార్తెలు శ్రీ నాగవల్లి, మీనా గాయిత్రిలను పొందారు.

మానవతా వాదిగా సమాజంలో జరిగే అనేక విషయాలకు స్పందించి వాటికి స్వచ్చంద సంస్థల, దాతల, రాజకీయ ప్రముఖుల దృష్టికి తీసుకొని వచ్చి, వారి సహకారంతో పేదవారి కష్టాలను తీర్చడానికి అన్నివిదాల ప్రయత్నించేవారు. పేద కళాకారులకు ఆర్ధిక సత్కారాలను ఏర్పాటుచేయించే వారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారంగా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా అధ్యాత్మిక పీఠం, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్, బి.వి.ఆర్. కళాకేంద్రం, నటరాజ కళాపీఠం, రంగస్థల వృత్తి కళాకారుల సంక్షేమసంఘం, పాదచారుల సంఘం, యువకళామిత్రమండలి, దవళసత్యం కళామిత్ర మండలి, తులసీరాం, కె. కె. డి. ప్రసాద్ మిత్రమండలి, చైతన్య కల్చరల్‌యూనిట్, చిరుగులాబి, ఘంటసాల గానసభ, త్యాగరాజగాన సభకు వివిధ హోదాలలో తమ సేవలందించారు. కులమతాలకు, వర్గాలకతీతంగా సేవలందిస్తున్న సేవాపరాయణుడు.

తోటి ఉపాధ్యాయులపట్ల స్నేహధర్మంతో మెలగి, వారి కష్ట సుఖాలలో పాలు పంచుకొని, వారికి అవసరమైన సలహాలు, సూచనలు సహకారాన్ని అందించేవారుగా అధికార, అనధికారులకు తలలో నాలుకగా రమణ మెలుగుతుంటారు.

వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జరిగే అనేక వైద్య ఆరోగ్య రక్తదాన శిబిరాలలో పాల్గొని సేవలందించారు. తనకున్న బాధలను తనలోనే దాచుకుని, ఇతరుల సంతోషానికి అహర్నిశం శ్రమించే సౌజన్యమూర్తి వెంకటరమణ. ఆయనను ఎంత కీర్తించినా తక్కువే. ఆయనో బాధ్యతగల కుమారుడు. ఆదర్శప్రాయుడైన సోదరుడు. ఆయనో గొప్ప భర్త. సత్ససంతానానికి తండ్రి. కుటుంబ శ్రవణుడు, లక్ష్మణ ఏకలవ్యుడు, నిరంతరాన్వేషి, నిత్యవిద్యార్థి. ఆయన శాంతమూర్తి, చిద్విలాసి, చిదానందమూర్తి. ఆయనో ఉత్తమ ఉపాధ్యాయుడు. ఆయనో గొప్ప సాహిత్యాభిలాషి. ఆయనో

4