పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మహారాజకుమారి శాంతిశ్రీ తల ఊపినది. “జయము జయము, రాజ కుమారికలకు! నాకు అనుజ్ఞ దయచేయించండి' అనినంత శాంతిశ్రీ తల ఊపినది. ఆ చారిణి వెళ్ళిపోయినది.

బాపిశ్రీ: మామయ్యగారు వెంటనే ముహూర్తము పెట్టించినారే!

శాంతశ్రీ: నీకు ఈ ముహూర్త బలమువల్ల చదువు బాగా సాగుతుంది వదినా!

శాంతిశ్రీ: సాగినా, సాగకున్నా నాకు ఒకటే శాంతశ్రీ!

బాపిశ్రీ: మా వదిన ద్వంద్వాతీతురాలు. కనుకనే చుట్టాలను బొడ్డు కోసినట్లు పేరుపెట్టి పిలుస్తుందేకాని వరుసలు పెట్ట పిలువదు.

శాంతశ్రీ: వదినను హాస్యం చేయకు చెల్లీ!

బాపిశ్రీ: అయితే వదినకు చదువు సాగదని నీకు అనుమానం ఎందుకు అక్కా?

శాంతిశ్రీ: మా నాయనగారు వచ్చారని తెలుసా నీకు, చెల్లీ!

బాపిశ్రీ: తెలుసును. మామయ్యగారు తమ సైన్యాలన్నీ చేకూర్చు కుని ధాన్యకటకం రావలసిందని ధాన్యకటకంనుంచి చక్రవర్తి ఆజ్ఞ!

శాంతశ్రీ: మామయ్యగారి సైన్యాన్ని నడిపే సేనాపతి ఎవరు?

బాపిశ్రీ: సేనాపతి బ్రహ్మదత్త ప్రభువులేకదా అక్కా!

శాంతశ్రీ: వారే! వదినకు నూతన విద్యాగురువులు వారేకదా? అందుకనే వదినను నీ చదువు ఎల్లాసాగుతుంది అని అడిగాను.

బాపిశ్రీ: వదినా! మామయ్యగారు వసంతోత్సవాలైన వెనుక వెడతారు కదా, ఎప్పుడు తిరిగివస్తారు?

శాంతిశ్రీ: యుద్దయాత్రకు వెళ్ళినవారు ఎన్నాళ్ళకు వస్తారో ఎలా తెలుస్తుంది?

అక్కడికి ఒక దౌవారిక వచ్చి, “మహారాజకుమారీ, మహారాజ కుమారులు తమ్ము చూడడానికి వచ్చినారు. లోనికిరా అనుజ్ఞ కోరినారు” అని విన్నవించింది. శాంతశ్రీ, బాపిశ్రీలవైపు వారి అభిప్రాయార్ధము శాంతిశ్రీ చూచినది. వారి మొగాలు జేవురించినవి.

శాంతశ్రీ : బావగారు వస్తే భయమేమిటి?

బాపిశ్రీ: నాకు కొంచెం సిగ్గు అక్కా!

శాంతిశ్రీ : నీకు సిగ్గు ఎందుకు బాపిశ్రీకుమారీ?

శాంతశ్రీ: బాగా అన్నావు వదినా! బావగారిని ప్రవేశపెట్టుమను.

శాంతిశ్రీ: రాజకుమారులు రావచ్చునని విన్నవించు.

శాంతిశ్రీ: ఆమాటలు అనుచు శాంతిశ్రీ లేచి ఆ మందిరము గుమ్మము కడకు వెళ్ళినది. బాపిశ్రీ లేచి వీరందరూ అధివసించిన పీఠముల తావు వదలి ఆ మందిర వాతాయనాలకడ ఉన్న భూర్జర తాళపత్ర లిఖితగ్రంథ మంజూషల కడకు పోయి, ఒక్కొక్కగ్రంథము పరిశీలించుచున్నది.

వాసిష్టి శాంతశ్రీ కొమరిత హారీతి శాంతశ్రీ చిరునవ్వు నవ్వుకొనుచు బావగారిరాకకు ఎదురుచూచుచున్నది. మహారాజకుమారి మాఠరి శాంతిశ్రీ గుమ్మముదాటి తన విద్యామందిరాన్ని అందిఉన్న సభాగృహంలోనికిపోయి, అది దాటి, ఆవలనున్న మందిర

అడివి బాపిరాజు రచనలు - 6
అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)
23