పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాంతిశ్రీ తన మందిరంలో ఆలోచించుకొనుచు కూర్చున్నది. ఆమె మేనత్త వూంగీయ మహారాణి కొమరిత శాంతశ్రీ కుమారి స్నేహితురాలిని చూడటానికి వచ్చింది.

“ఏమమ్మా శాంతిశ్రీ వదినా! ఏమిటి ఆలోచిస్తున్నావు.”

“ఏమీ ఆలోచనలేదు, మహారాజు నాకో నూతన గురువును ఏర్పాటు చేశారు.”

“వాసవదత్తకు ఉదయనుని ఏర్పాటు చేసినారా?” వూంగీయ శాంతశ్రీ చిరునవ్వు నవ్వింది.

“అంటే నీ భావం?” ఆమె చిన్న బిడ్డలా ఆ ప్రశ్న వేసింది.

“ఏముంది భావం? ఏదో బృహత్కథ జ్ఞాపకం వచ్చింది.”

“నేను ఆర్షధర్మం అభ్యసించలేదని మహారాజు....”

“అవును, వాసవదత్తా అంతే వదినా. ఆమెకు వీణపాట అంటే వల్లమాలిన ఇష్టం. మాళవంలో ఉన్న గురువులంతా నేర్పారట. కాని ఇంకా నేర్చుకోవలసిన సంగీత మహావిద్య చాలా ఉందట. అది నేర్చడానికి ఉదయన మహారాజు ఒక్కడేనట సకల ధరాతలంలోనూ ఉన్నది. అందుకని మాయా హస్తివ్యాజాన ఉదయనుని చండమహాకాళుడు అనే చండసేన మహారాజు బంధించి ఉజ్జయినికి కొనివచ్చి కొమరితకు గురువును చేసినాడు.

“నేను బృహత్కథ ఎరుగను శాంతా! మీ అమ్మగారు క్షేమంగా ఉన్నారా?”

“బహ్మదత్త ప్రభువులు నీకు గురువులు కాబోతున్నారనీ మా అమ్మ గారే చెప్పినారు.”

“నువ్వు వచ్చి ఒకపక్షం దినాలయినది కాదూ, ఇక్కడకు ఇంత వరకు రాలేదేమి?”

“మామయ్యగారిని చూచాము, అత్తయ్యగార్లను చూచినాము. నువ్వు అక్కడ లేకపోయావు. అలా మూడు పర్యాయాలయినది.”

“నేను ఈమధ్య ఆనందార్హతులకడకు పాఠానికి వెళ్ళుతూ ఉంటిని.”

“అవును. ఈ మధ్య బావగారు మా పట్టణం వచ్చారు కాదూ?”

“యువరాజుగారి విషయం నాకంత తెలియదు.”

“యువరాజు మహాదండనాయక, మహాప్రభువులు. ఆయన విషయమే నీకు తెలియదూ! మీ అన్నగారి విషయమే నీకు తెలియదంటావు వదినా!”

ఇంతలో హమ్మశ్రీదేవి పెద్దకొమరిత బాపిశ్రీరాకుమారి అచటికి వచ్చెను. హమ్మశ్రీ శాంతమూల మహారాజు రెండవ చెల్లెలు. పల్లవరాజు కోడలు.

6

బాపిశ్రీ మేనమామ కొమరితను చూచి, “వదినా! నీకు బ్రహ్మదత్త ప్రభువు చదువు చెపుతారటగా?” అని ప్రశ్నించింది.

శాంతిశ్రీ: మీ నగరులోనూ తెలిసిందీ ఈ వార్త, బాపిత్రీకుమారీ!

బాపిశ్రీ కోపం అభినయించి “మేమిద్దరమూ నిన్ను వదినా అని పిలుస్తాము. నువ్వు మమ్మల్ని పేరులుపెట్టి పిలుస్తావు! నీకు ఆపేక్షలే లేవుసుమా” అన్నది. ఇక్ష్మాకు శాంతిశ్రీ తెల్లబోయింది.

అప్పుడు పూంగీయశాంతశ్రీ “అమ్మగారి శుద్దాంతంలో తెలిసింది. బాపిశ్రీకి తెలియదా? పిన్నిగారు హమ్మశ్రీకి తెలియదా?”

అడివి బాపిరాజు రచనలు - 6

20

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)