పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“గురుదేవా! ఈనాటి కమ్మాయి హృదయ మార్థ్రత నందినది. చాళుక్య యువమహారాజు ననుచరుడైన యొక సామంత యువకు నమ్మాయి వరించినదట. నాయాశలు భగ్నము లైన”వని దీనదృష్ణుల జూచుచు మహారాజు పలికెను.

నారసింహభట్టు పండితు లాశ్చర్యము వెలిబుచ్చుచు “ఇదేమి ప్రభూ! ఈ సంఘటన యెట్లు ఘటిల్లినది?”

“అమ్మాయిని దుర్మార్గు లెత్తుకొనిపోవుట. గోవూరు నందున్న తా మెఱుగుదురు గదా! వారు గాంగులై యుండవలెను. కళింగగాంగ యువరాజుపై నాకు బూర్తిగ ననుమాన మున్నది. పిష్టపురమునుండి గాంగుల దరిమి, యా నగరమును చాళుక్య విష్ణువర్ధన మహారాజు స్వాధీన మొనర్చుకొన్నప్పుడు, అమ్మాయిని జెర విడిపించిన కొలది దినములకు నామే చాళుక్య సామంతుడైన యువకు నొకని జూచినదట. ఆ ముహూర్తముననే యాతడే తనకు గాబోవు భర్త యని నిర్ణయించుకొన్నదట. తాము దక్క యితరు లెవ్వరును మాకు సరియగు నాలోచన సెప్పువారు లేరు.”

“మహాప్రభూ! మీరు నన్ను ప్రశ్నించిన యీ సమయమే మిక్కిలి యుత్తమము. రాజకుమారికి ఆ యువకుడే భర్త యగును. ఆతడే భావి యాంధ్రసామ్రాట్టు.

“చాళుక్య విష్ణువర్ధన యువమహారాజు కళింగాధిపులను బూర్ణముగ నోడించి వారి నుండి ప్రాభృతము గైకొని యతివేగమున వేంగీరాష్ట్రముపై నెత్తి వచ్చుచున్నాడట.”

“మహాప్రభూ! నేను మంత్రాంగమున నాలోచించినను జ్యోతిష పరముగ విచారించినను దమ రాజ్యములో యుద్దము పొసగనేరదు. పులకేశి మహారాజు వచ్చినప్పుడును దాము వారితో యుద్దము సేయరైరి. మి మ్మా ప్రభువు పదచ్యుతిని జేయలేదు. సరిగదా, మీ రాజ్యమును సుస్థిరము సేయుటయే తన తలంపనియు మీ సహాయార్ధము మాత్రమే తాను తన సేనాపతియగు పధ్వీరాజేంద్రవర్మ నిచ్చట నుంచితి ననియు దెలిపిరిగదా! ఆ భావమునకు నేడేమియు భంగము జరుగదు.”

“ఏ దెట్లు జరుగునో చిత్రరథస్వామి యిచ్ఛ.”

14

వేంగీనగర మారు గోరుతముల పొడవును, నాలుగు గోరుతముల వెడల్పును గలిగిన మహానగరము. ఈ నగరమును నిర్మించినవారు సాలంకాయన ప్రభువులు. సాలంకాయనులు శాతవాహనులలో నొక శాఖవారు. సాతవాహన శ్రీముఖ చక్రవర్తి, రాజబంధువగు కాన్హసాలం కాయనుని ఆంధ్ర కళింగరాజ్యపు టెల్లల కాపాడ, రాజ ప్రతినిధిగా నియమించి,గోదావరీతీరమున నొక దుర్గము నిర్మించుకొని, గోదావరీ తీరమును సంరక్షింప నాజ్ఞాపించెను.

గృధ్రవాడ విషయములో నాలుగు యోజనముల పొడవు మూడు యోజనముల వెడల్పు కలిగిన మహాసరస్సొకటి సొంపారి యున్నది. ఆ సరస్సులో ననేక చిన్న చిన్న నదులు సంగమించుచున్నవి. వేయి జల శకుంత సంతానజాతు లా కొలనులో నివసించుచు నిత్యకలకలారావ సంగీత మాలపించుచుండును. షోడశ పత్రములు, ద్వాత్రింశత్

అడివి బాపిరాజు రచనలు - 6

• 261 •

అంశుమతి (చారిత్రాత్మక నవల)