పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మళ్ళీ దేశంలో బౌద్ధ సంప్రదాయం విజృంభిస్తుంది. పిమ్మట నెమ్మది నెమ్మదిగా ఆర్షధర్మంలో కలిసి దానికి నూతన జీవంపోస్తుంది. శాంతిమూల ప్రభూ! నీ కొమరితను నేను పెట్టిన ముహూర్తాన అడవి స్కంద విశాఖాయన బ్రహ్మదత్త ధనకప్రభువునకు ఇచ్చి వివాహం చేయండి. ఈ బాలిక బౌద్ధధర్మానికి చేసేసేవ శాశ్వతమౌతుంది. దేవదత్త మహార్షీ! నీ కొమరుని భాష్యగ్రంథాలు లోకానికి ఆర్షధర్మాన్ని తెలియజెప్పే వెలుగులవుతవి. నాకు మీరందరు ఇక అనుజ్ఞ ఇప్పించండి. త్రిరత్నములు మిమ్ము కాపాడుగాక” అంటూ దివ్వగంభీర స్వరాలతో పలికినారు.

అనేకులకు కన్నులనీరు తిరిగినది. అందరు మహర్షికి తుదిమారు మ్రొక్కి సంభ్రమాశ్చర్యములతో ఆ మందిరం వీడి వచ్చినారు.

ఇదివరకే భిక్షులు, అర్హతులు, ఆచార్యులు ఆ దేవునికడ ఆశీర్వాదాలు పొందినారు. భిక్షుకులు నిర్వికారభావంతో ఆ మందిరానికి కవాటాలు బిగించినారు. మందిరం చుట్టూ ధూపములు వెలిగించినారు. వేయి ఆవునేతి దీపాలు వెలిగిపోతున్నవి.

“ఓం మణి పద్మిహం. బుద్ధం శరణం గచ్ఛామి
 సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి

అని భిక్షులు కోటితుమ్మెదల ఝూంకారముతో పాడజొచ్చిరి. కొంతసేపటికి తలుపులు తెరచినారు. ఆ మందిరంలో ఏదో పరమశాంతి పాల సముద్రం వలె ప్రవహించి ఉన్నది. ఒక పరమపవిత్ర కాంతిన్ని నాగార్జునదేవుని పీఠముమీద వెలుగుతున్నది. నాగార్జునదేవులు లేరు. లోనికి వచ్చిన శాంతిమూల చక్రవర్తి మొదలగువారికి భక్తిభావము ముసురుకు వచ్చింది. వారందరా పీఠానికి సాష్టాంగమై నాగార్జునావతారాన్ని హృదయంలో కొలిచినారు.

మూడు దినాలకు నాగార్జునదేవుడు బుద్ధగయలో ప్రత్యక్షమై బౌద్ద దేవాలయంలో మూడు దినాలున్నారన్నారు. ఆ వెనుక మూడుదినాలకు ఆ భగవంతుడు మృగవనంలో, ఆ వెనుక వేణువనంలో, ఆ వెనుక లుంబినీ వనంలో ప్రత్యక్షమై మూడేసి దినాలున్నారట. నాగార్జునదేవుడు పెట్టిన శుభముహూర్తంలో ఇక్ష్వాకు శాంతిశ్రీ రాజకుమారికకు ధనకస్కంద విశాఖా యనక ప్రభువునకూ వివాహం అయినది. ఆ సాయంకాలమే పూంగీయ యనక ప్రభువునకూ వివాహం అయినది. ఆ సాయంకాలమే పూంగీయ శాంతశ్రీ రాకుమారికీ మాఠరీపుత్ర వీరపురుషదత్త యువమహారాజుకూ వివాహమైనది. ఇక్ష్వాకు శాంతిశ్రీ “అడవి శాంతిశ్రీ' అని బిరుదము వహించింది. స్కందవిశాఖ శాంతిశ్రీ దంపతులు ఇరువురు మహాతలవరులు, మహాదండనాయకులు మహాసేనాధికారులు, మహాసామంతులయ్యారు. యువరాజుకు పూంగీయ శాంతిశ్రీ రెండవ యువరాణి అయినది.

తాను చక్రవర్తికాగానే ఇక్ష్వాకు శాంతమూల మహారాజు చూటశాత కర్ణులను, ముసికదేశ శాతవాహనులను ప్రతిష్ఠానపతులను పూర్తిగా లోబరచుకొనినాడు. మహారాజ్యమంతా రాష్ట్రములూ ఆహారములుగా విభజంపబడినది. ఆహారపతులను

అమాత్యపతులనేవారు. మహాతారకుడు చక్రవర్తి కడనుండే ముఖ్యోద్యోగి. మహామాత్యుని తరువాతివాడు. అతని వెనుక మహాఅధ్యక్షుడు, మతధర్మాధికారులు, ఆ వెనుక భాండాగారికుడు చక్రవర్తి సర్వసంపదలు చూచేవాడు. హిరణ్యకుడు ధనకోశాధిపతి,

అడవి బాపిరాజు రచనలు - 6

222

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)