పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హిమాలయాలలోని విద్యాధరులు, మధ్య హిమాలయాలలోని సిద్ధులు సాధ్యులుకూడ దక్షిణానికి వలస వచ్చినారు. వీరందరూ నాగరికత గలవారు. గరుడులు, కిన్నరులు, కింపురుషులు మధ్యరకం నాగరికత కలవారు.

నాగగరుడాది గంధర్వజాతులవారికీ రాక్షసాది నరమాంసాశన జాతివారికీ యుద్ధాలు జరిగినంతట దండకారణ్య మధ్యప్రదేశాలకు రాక్షసులను గంధర్వజాతులవారు . తరిమివేశారు. ఈ నాగాదిజాతులకు గోండులు, నాగులు, వానరులు, కోదులు, శబరులు, చెంచులు, కోయలు, భిల్లులు, థోంబీలు, సంతాలులు, వేప్చాలు, ఘార్కులు, భూతాలు అనే పేర్లు అనేకం వచ్చాయి.

అసురులు బాగా నాగరికత కలవారు. వారు నదీముఖాల వలసలేర్పరచుకుంటోంటే, వారికీ ఈ గంధర్వజాతులవారికీ ఘోరయుద్ధాలు జరిగి అసురులు గంధర్వ జాతులను అడవులలోకి తరిమివేశారు. వారంతా శాంతిమూలుని కాలంనాటికి దండకాటవి సరిహద్దులలో నివసిస్తున్నారు.

అసురాంధ్రుల ముఖ్యపట్టణాలు శ్రీకాకుళం, పాదగయ, శంబరదీవి, మహాబలిపురం మొదలైనవి ఆర్యులు శ్రీకాకుళం పట్టుకొని ప్రతిపాలపురం మొదలైనవి జయించిరి. రానురాను ఆంధ్రవిష్ణువు వంశస్థులైన శాతవాహనులు అటు నాగులనూ, అడవులలోని రానురాను ఆంధ్రవిష్ణువు వంశస్థులైన శాతవాహనులు అటు నాగులనూ, అడవులలోని రాక్షసజాతులనూ, అసురజాతులనూ ఏకంచేసి ఆంధ్రసామ్రాజ్యం మహాభివృద్ధి కావించారు. అప్పుడే శ్రీకాకుళం నుంచి కృష్ణవేణ్ణకు ముప్పఅయిదు గోరుతాలు ఎగువకుపోయి అక్కడ ధాన్య కటకం నిర్మించారు. గోదావరి తీరంలో పశ్చిమాన అసురులు నిర్మించిన ప్రతిష్ఠానపురం పట్టుకొన్నారు. ముసికనగరం వైజయంతి మొదలైన ముప్పది మహానగరాలు నిర్మించారు.

శాంతిమూల మహారాజు ధాన్యకటకం ప్రవేశించి తాత్కాలిక నివాసం ఏర్పరచుకొన్న కారణం - మేనల్లుని చక్రవర్తిత్వం సురక్షితం చేయడానికీ. శాంతిమూలుని మహాభవనం కోటకి ఎగువను ఆర్ధగోరుతం దూరంలో ఉన్నది. చక్రవర్తి చంద్రశ్రీ మేనత్తభర్త శాంతిమూలుని బలవంతం వల్ల అప్పుడప్పుడు మహాసలికు వస్తూ ఉండినా, మధువుల మత్తువల్ల. సభలో ఏమి జరుగుతున్నదో ఆయనకు తెలియదు. సభాకార్యక్రమం నడిపించేదంతా మహామంత్రి..

శాంతిమూలుడు చంద్రశ్రీ సార్వభౌముని సన్మార్గంలోనికి దింపాలని ప్రయత్నం చేసెను. ఏమి లాభం లేకపోయింది. హీనమతులైన అంతఃపుర వనితలను శాంతిమూలుడు వెలుపలికి పంపించివేసెను. అంతఃపురవాసం వదిలించేందుకు - వేటకనీ, దేశం చూడడానికనీ, తీర్థాలలో క్రుంకులిడడానికనీ - చంద్రశ్రీని శాంతిమూలుడు దేశం నలుమూలలా త్రిప్పుతూ ఉండేవాడు. కాని చంద్రశ్రీ పురుషకారహీనుడై మరల ధాన్యకటకం చేరుతూ ఉండేవాడు.

శాంతిమూలుడు బ్రహ్మదత్తుని చంద్రశ్రీ చక్రవర్తికి గురువుగా నియమించి “ఏలాగయినా సార్వభౌముని మనుష్యునిగా చెయ్యాలి ధనకప్రభూ!” అని కోరినాడు.

అడివి బాపిరాజు రచనలు - 6

167

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)