Jump to content

పుట:Ammanudi july 2018.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగుజాతి (ట్రస్టు)

20 ఏళ్లపాటు తెలుగు ప్రజల అభ్యున్నతికి అంకితమై అందరి అభినందనలను పొందిన 'నడుస్తున్న చరిత్ర' మాసపత్రిక 2013 నవంబరు నుండి అనివార్య కారణాలవల్ల ఆగిపోయింది. ఆ పరిస్థితుల్లో - పత్రికను తిరిగి కొనసాగించాలనీ, దానితోపాటు తెలుగు భాషా వికాసం కోసం, భాషోద్యమ చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించడం కోసం సరికొత్త పుస్తకాలను వెలువరించాలనీ, ప్రచార సేవా కార్యక్రమాలను చేపట్టాలని సంకల్పించాము. అందుకొరకై - 2014లో 'తెలుగుజాతి' ట్రస్టు (92 / 2014) ను స్థాపించాము. దీనికి డా॥ సామల రమేష్ బాబు వ్యవస్థాపక ట్రస్టీగా ఉన్నారు.

2015 మార్చి నుండి 'అమ్మనుడి' పేరుతో పత్రికను మొదలుపెట్టి ఏ ఆటంకమూ లేకుండా ప్రతినెలా వెలువరిస్తున్నాము.

దేశంలో తెలుగు రాష్ట్రాలలోని తెలుగువారికి సమంగా బయటి రాష్ట్రాల్లో అంతే సంఖ్యలో వున్న తెలుగువారి భాష, చరిత్ర, సంస్కృతులను పరిశోధించి, స. వెం. రమేశ్ వ్రాసిన విలువైన వ్యాసాల సంకలనం 'ఎల్లలు లేని తెలుగు' ను ప్రచురించాము.

భాషాశాస్త్రజ్ఞుడు, హైదరాబాదు విశ్వవిద్యాలయ ఆచార్యులు డా॥ గారపాటి ఉమామహేశ్వరరావు పరిశోధనాత్మక రచనలు

1.తెలుగు రాష్ట్రాల్లో భాషా సంక్షోభం. 2. ద్రావిడ - మంగోలు భాషల జన్యు సంబంధం పుస్తకాలను ప్రచురించాము.

మరికొన్ని విశిష్ట ప్రచురణలు త్వరలో రానున్నాయి.


దాతలకు విన్నపం

ఈ ట్రస్టును బలమైన పునాదులపై, తగినన్ని వనరులతో నిర్వహించటానికి మీ అందరి చేయూత కావాలి. విరాళాలనిచ్చి తోడ్పడగోరుతున్నాము.

రాజ పోషకులు రు. 1,00,000/-
పోషకులు రూ.25,000/-
విశిష్ట పోషకులు రు. 50,000/-
ప్రోత్సాహకులు రు. 10,000/-
  • దాత ఫొటోను, క్లుప్తంగా పరిచయాన్ని 'అమ్మనుడి' పత్రికలో ప్రచురిస్తాము.
  • దాతలందరినీ శాశ్వత చందాదారులుగా పరిగణించి పత్రికను ప్రతినెలా పంపిస్తాము.
  • ట్రస్టు ప్రచురించే పుస్తకాలను కూడా వెనువెంటనే పంపిస్తాము.

సొమ్మును ఆన్లైన్లో 'TELUGUJAATHI' పేర యాక్సిస్ బ్యాంక్, సికిందరాబాదుకు పంపాలి.

అక్కౌంట్ నెం. 914020020387880
I.F.S.C.Code : UTIB0000068.

లేదా- అదే బ్యాంకు పేర బ్యాంకు డ్రాఫ్టుగా పంపాలి. డ్రాప్టును పంపుటకు, ఉత్తర ప్రత్యుత్తరాలకు చిరునామా : డా॥ సామల లక్ష్మణబాబు, ట్రస్టీ, తెలుగుజాతి (ట్రస్టు), 8-386, జీవక భవనం, అంగలకుదురు పోస్టు, తెనాలి. గుంటూరు జిల్లా - 522 (3వ అట్టపై ఇటీవలి దాతల వివరాలు చూడండి)


తెలుగువారంతా చదువవలసిన పుస్తకాలు

విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, సామాజిక కార్యకర్తలు రచయితలు, భాషోద్యమకారులు, ఆసక్తిగల వారంతా ఈ రచనలను చదివి ప్రయోజనం పొందగోరుతున్నాము

పుస్తకాల వెలను ఎం.ఒ. చేస్తే వాటిని కొరియర్ / రిజిస్టర్డ్ బుక్ పోస్టులొపంపిస్తాము.

'తెలుగుజాతి ((ట్రస్టు) - జీవక భవనం, 8-346, అంగలకుదురు పోస్టు తెనాలీ - 522211ఫోన్ : 9440448244

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి

2018