పుట:Ammanudi july 2018.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

rh|

13. మనువు 14. అంగీరసుడు 15. లోమశుడు 16. చ్యవనుడు 17. భృగు 18. శానకుడు.

కల్పాలు, యుగాల కాలప్రమాణాల గురించి బౌద్దుల నిదానకథలో ఉంది.

గ్రహణాల గుట్టురట్టు : -

గ్రహణాలు ఎప్పుడెప్పుడొస్తాయో అంతకు ముందే చాలామందికి తెలుసు. రాబోయే కాలంలో కొన్ని వందల సంవత్సరాల్లో ఏ రోజున గ్రహణాలు సంభవిస్తాయో రాసి పెట్టారు. ప్రతి 18 సంవత్సరాలు 11 నెలలకు గ్రహణ చక్రం తిరిగి మరలా అదే తేదీల్లో వస్తాయి. ఇది పరిశీలన.

కానీ, గ్రహణాలు ఎందుకు వస్తాయి? అనేది పరిశోధన ఈ పరిశోధన చేసిన మొదటి వ్యక్తి ఆర్యభట. గ్రహణాలకి సంబంధించిన కట్టు కథలు నమ్మని బౌద్ధాచార్యుడు ఆయన. అందుకే భౌతిక విషయాలతో ఆయన పరిశోధన సాగింది.

భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని మొట్టమొదట ప్రకటించింది ఆయనే. భూమి గుండ్రంగా ఉందని అంతకు ముందే చాలామంది భావించారు. ప్రకటించారు. 'కపిత్థాకారం భూగోళం' అని చెప్పింది బ్రహ్మ సిద్ధాంతం. ఈ వెలగపండు లాంటి భూమి, తన చుట్టూ తాను తిరుగుతుంది' అని చెప్పడమే కాక, మనకు కనిపించే, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ 'గోళాలే' అని ప్రకటించాడు ఆర్య భట. భూమి తన చుట్టూ తను తిరగడం వల్లే ఆకాశంలో సూరీడు, నక్షత్రాలు, చంద్రుడు అన్నీ భూమి తిరిగే దిశకు వ్యతిరేక దిశలో తిరుగుతున్నట్లు కనపడుతున్నాయనీ చెప్పాడు. ఐతే...ఒక్క సూర్యుడు మాత్రమే అగ్ని గోళం అనీ అది తప్ప మిగిలిన గ్రహ, నక్షత్రాలన్నీ భూమిలా నీటి ఆవరణతో నిండిన గోళాలే అని చెప్పాడు.

గ్రహణాలకి పాముగానీ, రాహుకేతువులుగానీ కారణం కాదనీ, భూమి నీడ పడడం వల్లే చంద్రగ్రహణం సంభవిస్తుందని వివరించాడు. ఐతే సూర్యగ్రహణానికి కారణం ఈయన చెప్పలేదు. అలాగే 'ఒక రోజు కాలగణనని సూర్యోదయం నుండి కాకుండా, అర్థరాత్రి నుండి కొలవాలి. ఇలా కొలిస్తే సూర్యోదయ సమయాల్లోని వ్యత్యాసాల వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి' అని తన 'ఆర్యభట సిద్ధాంతం' లో ప్రకటించాడు. దీనికి మంచి ఉదాహరణగా శ్రీలంకలోని కాలమానాన్ని సూచించాడు. శ్రీలంక భూమధ్యరేఖా ప్రాంతం. కాబట్టి మనకు లాగా పగలూ రాత్రి సమయాల్లో వ్యత్యాసాలు అక్కడ అంతగా ఉండవు. అయినా వారు రాత్రినుండి సమయాన్ని గుణించేవారు. బహుశ ఆయన ఈ విష యాన్ని తన తోటి సహాధ్యాయులనుండో, శ్రీలంక విద్యార్థుల నుండో తెలుసుకుని ఉంటాడు.

ఎందుకంటే... ఆయన ఒక విశ్వవిద్యాలయ కులపతి. అక్కడికి శ్రీలంక, గ్రీకు, చైనా, ఇంకా అనేక [ప్రాంతాలనుండి విద్యార్థులు వచ్చేవారు. 10వేల మంది విద్యా ర్థులు అక్కడ విద్యనభ్యసించేవారు.

అంతేకాదు... ఆయన రకరకాల ఖగోళ పరికరాల నిర్మాణం గురించి ఆయన రాశాడు. వాటిలో నక్షత్రాల దూరాల్ని కొలిచే పరికరాలు, రకరకాల గడియారాలూ ఉన్నాయి. గ్రహగమనాల్ని కొలిచే సాధనాలూ ఉన్నాయి.

ఆ విశ్వవిద్యాలయంలో బోధించే ఏడు ప్రధాన శాస్త్రాల్లో ఖగోళ శాస్త్రం ఒకటి.

అర్యభట - అల్‌ జహీర్‌:

ఆర్యభట ఆవిష్కరించిన గణిత, ఖగోళ విషయాలన్నింటినీ అల్‌ బెరూనీ అనే అరబ్‌ పండితుడు పారశీక భాషలోకి అనువదించాడు.

ఆయన ఆర్యభటను వేనోళ్ల కొనియాడాడు. అరబ్‌లు ఆర్భభటను “అల్‌-జహీర్‌' అనేవారు. అరబ్‌ నుండి ఆర్యభట సిద్ధాంతాలు గ్రీకు, రోములకు వెళ్ళాయి. ఆర్యభట అరబిక్‌ పేరైన 'అల్‌ - జహీర్‌' నుండే 'సున్న'కు...జహీర్‌, జహర్‌, దాన్నుండి చివరకు 'జీరో అనే పేరు వచ్చింది. సున్నను ఆవిష్కరించినవాడు ఆర్యభటే కాబట్టి 'సున్న' కు వారు ఆయన పేరే పెట్టుకున్నారు. ఆయన పేరు నుండే “అనిర్ధారక సమీకరణాలకి 'అల్‌ - జీబ్రా' అనే నామకరణం కూడా జరిగింది. ఇందుకు అరబ్బులకి ఎంతో రుణపడి ఉండాలి.

ఇక, మనదేశం 1975 లో ఏప్రిల్‌ 19న అంతరిక్షంలోకి మొదటి కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. దానిపేరు 'ఆర్యభట'. అలాగే ఆ తర్వాత ప్రవేశ పెట్టిన రెండో ఉపగ్రహానికి 'భాస్మర' అనే పేరుపెట్టింది. 1వ భాస్కరుడు కూడా బౌద్ధ గణిత, ఖగోళ విద్వాంసుడే! - తన 'మహా భాస్మరీయం' లో ఆయన ఎన్నో ఖగోళ విషయాలు చర్చించాడు.

విచారం ఏమిటంటే...

“అరబ్బుల ద్వారా పాశ్చాత్య ప్రపంచానికి ఆర్యభటుని ఖగోళ విజ్ఞానం అందింది. అది ఒక ప్రక్కన జరిగితే... ఆర్యభట అనంతరం. 'బృహజ్జాతకం, బృహత్‌ సంహిత, హోర'-అనే ఫలిత జ్యోతిష గ్రంథాలను వరాహ మిహిరుడు రచించాడు. ఈ ఫలిత జ్యోతిష గ్రంథాలకి ఆధారం గ్రీకు రచయిత టాలెమీ గ్రంథం 'ట్రిట్రిబ్యులస్‌'.

అందుకే... _ వివేకానందుడు ఇలా అన్నాడు - “మనం మన గణిత ఖగోళ శాస్త్రాల్ని గ్రీకులకు ఇచ్చి, వారి నుండి జ్యోతిషాన్ని తెచ్చుకున్నాం. మూఢనమ్మకాల్లో బ్రతుకీడుస్తున్నాం' అని.

(బౌద్భుల రసాయన శాస్త్ర విజ్ఞానం, సృష్టి భావనలు - వచ్చే సంచికలో చూద్దాం).

మాతృభాషంటే...?

ఎందుకు మాతృభాషపట్ల ఇంత ఆందోళన? ఎందుకంటె, అది ఒక భాషీయుడి సంప్రదాయ, సంస్కార మూలాల్ని నిత్యం తడుపుతూ, శుభ్రపరుస్తూ నవనవోన్మేషంగా పల్లవింపచేసే అంతఃస్రోతస్విని. అది జలజలా నిత్యం పారుతుండకపోతే, ఆ భాషీయుడి జీవనం శుష్కించి పోవటమే కాదు, ఏ చిన్న జీవన విషాదానికైనా గజగజవణికి కుప్ప కూలుతుంది. అట్లాంటి అంతశ్శక్తినిచ్చే సహజ పౌష్టికాహారం తల్లిభాష!

- సి. ధర్మారావు

పరభాషా ద్వేషం, పరభాషా దాస్యం - రెండూ తప్పే

46

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018