పుట:Ammanudi july 2018.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
(పటం. 4) సింధూ నాగరకత కాలంలో క్రీ. పూ. 4150 - క్రీ. పూ. 2ఒ50

మార్పుని గమనించడం, బుద్దుని ధ్యాన విషయంలో ఆ దిక్చక్రాన్ని (కాంతి వృత్తాన్ని) ఆధారంగా స్థల ఎంపిక చేసుకోవడం గొప్ప వైజ్ఞానిక అంశం.

పరిశోధనలు:

ఇప్పటిదాకా మనం కేవలం పరిశీలనలు మాత్రమే చూశాం. అసాధ్యమైన ఆయనాంశాల పరిశీలనా చేశాం. ఇక ఖగోళ పరిశోధనలు చూద్దాం.

ఈ దేశంలో ఖగోళ పరిశీలనలు ఎప్పటి నుండో ఉన్నాయి. కానీ, పరిశోధన ప్రారంభించింది బౌద్ధులు మాత్రమే. వారిలో మొదటివాడు, ఆర్యభటే.

ఆయన పరిశోధనల గురించి తెలుసుకొందాం!

వేదాలు, బౌద్ధగ్రంథాలు ప్రక్కన పెడితే పూర్తి జ్యోతిషగ్రంథం “వేదాంగ జ్యోతిషం”. ఇది కేవలం నక్షత్రాలూ, రాశులకు సంబంధించిన గ్రంథమే. ఇది మంచి చెడుల గురించి చెప్పే ఫలిత జ్యోతిషగ్రంథం కాదు. ఇది క్రీ. పూ. 1200 సం॥ నాటిది. దీని కర్త లాగదుడు. ఇదిఇప్పుడు దొరకడం లేదు. వేదాల్లోగానీ, లాగదుని గ్రంథంలోగానీ ఖగోళ పరిశీలనలే ఉన్నాయి. ఫలిత జ్యోశ్యాలు లేవు.

జ్యోతిష నమ్మకాల పిచ్చి మొదట పుట్టింది గ్రీకులో. టాలెమీ క్రీ. శ 140లో ట్రిట్రిబ్యులస్‌ అనే గ్రంథం రాశాడు. ప్రపంచం లో తొలి ఫలిత జ్యోతిష గ్రంథం ఇదే. దీన్ని 200 లో రుద్రదాముడు గ్రీకునుండి సంస్కృ తంలోకి మార్చి ఆ పిచ్చిని ఇక్కడా అంటిం చాడు. ఆ తర్వాత స్పుజిధ్వజుడు క్రీ. శ 270లో “యవన జాతకం, క్రీ.శ 400 లో మీన రాజు 'వృద్ధ యవన జాతకం' అనే రెండు జ్యోతిష గ్రంథాలు రాశారు.

ఈ సమయంలో నలంద విశ్వవిద్యాలయ కులపతిగా ఉన్న బౌద్ధ ఆచార్యుడు అర్య భట. ఆయన చేసిన కృషి-జ్యోతిషాన్ని ప్రక్కకు నెట్టి ఖగోళ శాస్త్రానికి ప్రాణం పోసింది.

ప్రాచీన భారతీయ ఖగోళ గ్రంథాల్లో "సౌర సిద్ధాంతం” అనేది ఒకటి. దీని కర్త ఎవరో తెలీదు. మన పురాణాలు వల్లించే యుగాల లెక్కలు ఈ సౌరసిద్ధాంతం లోనివే. ఇదికాక వాశిష్ఠ సిద్ధాంతం, రోమన్‌ సిద్ధాంతం, పౌలిన సిద్ధాంతం అనే మరో మూడు ఖగోళ సిద్ధాంతాలున్నాయి. అలాగే అతి ప్రాచీన బ్రహ్మ సిద్ధాంతం ఉంది. దీన్నే పితామహా సిద్దాంతం లేదా పైతామహ సిద్ధాంతం అంటారు. ఆర్యభట్ట ఈ బ్రహ్మసిద్ధాంతాన్ని ప్రక్షాళన చేసి తనదైన నూతన ఆవిష్కరణల్ని అదే సిద్ధాంతం పేరుతో ప్రకటించాడు.

యుగాలు - కల్పాలు:

సూర్య సిద్ధాంతం ప్రకారం:యుగాలు 4.

కలియుగం: 4,32,000 సంవత్సరాలు

ద్వాపరయుగం :8, 64,000 సం॥రాలు (కలియుగం x 3)

త్రేతాయుగం : 12,96,000 సం॥ (కలియుగం x 3)

కృతయుగం : 17,28000 సం॥లు (కలియుగం x 4)

ఇవి మొత్తం = 43,20,000 సం॥రాలు, ఇది ఒక మహాయుగం.

71 యుగాలు = 1 మనువు

1000 యుగాలు = 1 కల్పం. (432 కోట్ల సంవత్సరాలు)

ఈ విభజనకి కాస్త సవరణలు చేసిన ఆర్యభట యుగ విభజన ఇలా ఉంటుంది.

10,80,000 సంవత్సరాలు = 1 చిన్న యుగం

4 చిన్న యుగాలు = 1 మహాయుగం (43,20,000 సంలు)

72 యుగాలు = 1 మనువు

1008 యుగాలు = 1 కల్పం (1 కల్పం = 435,45,60,000 సం॥రాలు.

ఆ తర్వాతి వాడైన వరాహమిహిరుని గ్రంథం “బృహత్‌ సంహిత'లో ఆర్యభటునికి పూర్వం 18మంది జ్యోతిషవేత్తలున్నట్లు ఉంది.

వారు:

1. సూర్యుడు (సౌర సిద్ధాంతం ) 2. బ్రహ్మ (బ్రహ్మ సిద్ధాంతం) 3. వశిష్టుడు (వశిష్ట సిద్ధాంతం) 4 పౌలీసుడు (పౌలస సిద్ధాంతం) 5. యవనుడు (రోమక సిద్ధాంతం) 6. వ్యాసుడు 7. అత్రి 8 పరాశరుడు 9. కశ్యపుడు 10. నారదుడు 11. గర్గుడు 12. మరాబి

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018

45