పుట:Ammanudi july 2018.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాలు, విషువత్తులు ఎలా మారుతున్నాయో అర్ధం అవుతుందిగదా!

ఇక, ఇప్పుడు అసలు విషయాని కొద్దాం!

దిక్చక్రం - బుద్ధుని ధ్యానం:

బుద్ధుడు ధ్యానానికి కూర్చొంది బుద్ధ గయలో. బుద్ధగయ భూమ్మీద 240 ఉత్తర అక్షాంశం మీద ఉంది. కర్కాటరేఖ 23 1/20 ల ఉత్తర అక్షాంశం అని మనకు తెలుసు. అంటే. బుద్దుడు దాదాపుగా కర్మటరేఖా ప్రాంతంలోనే ధ్యానానికి కూర్చొన్నాడన్న మాట. అంటే ఆయన కూర్చొన్న ప్రాంతం ఒక ఆయనరేఖా ప్రాంతం. దక్షిణాయనాంతం, ఉత్తరాయన ఆరంభం ఆ ప్రాంతం నుండే స్పష్టంగా గమనించవచ్చు. ఆయనకు జ్ఞానోదయం అయ్యింది. వైశాఖ పున్నమినాడు. అంతకు 48 రోజుల ముందు 'ఇక నేను జ్ఞానం పొందే వరకూ లేవను' అని కూర్చొన్నాడు. అంటే వైశాఖానికి రెండు నెలలు ముందు. 49 రోజులు అంటే 7 వారాలు. ఏడు ఉపోదన దినాలు. 49 వ రోజున జ్ఞానోదయం కల్గింది. దీన్ని మనం ఇప్పుడు ఇంగ్లీషు నెలల్లోకి మార్చుకుంటే జ్ఞానోదయం పొందిన 'నెల' మే నెల కాబట్టి మార్చి నెలలో ఆయన ధ్యానానికి కూర్చొన్నాడు. అంటే మేషరాశిలో వసంత విషువత్‌ జరిగి కాలంలో కూర్చొన్నాడు. విషువత్తులంటే పగలూ రాత్రీ సమానంగా ఉండే రోజులని మనం గతంలో తెలుసుకున్నాం. ఈ రోజున సూర్యుని కాంతివృత్తం లేదా దిక్‌చక్రం భూ మధ్యరేఖకు సమాంతరం గా ఉంటుంది.

అన్ని దిక్కుల్ని చూసి దిక్‌చక్రం ఏ దిశకు సమాంతరంగా ఉంటుందో చూసి, ఆకాశ రాశి చక్రం ఎటు హెచ్చుతగ్గులుగా ఉండదో గమనించి, అటు తిరిగి, బోధ వృక్షానికి పడమర వైపుకు వెళ్ళి తూర్పు దిక్కుకు ముఖం పెట్టి కూర్చొన్నాడు. ఇలా కూర్చోవడం ఎందుకంటే ఎల్లవేళలా ఆ చెట్టు నీడలోనే ఉండడానికి. ఎందుకంటే వసంత విషవత్‌ తర్వాత సూర్యుడు ఉత్తరానికొస్తూ ఉంటాడు కాబట్టి, చెట్టు నీడ దక్షిణం వైపున ఎక్కువ పడుతుంది. ఉత్తరం వైపున తగ్గిపోతుంది. తాను లేవకుండా కూర్చోవాలి అనుకున్నాడు కాబట్టి ఆ వృక్షానికి తూర్పున నదీ తీరం ఉంది. ఉదయం ఎండ పొడ పడుతుంది. అందుకనే చెట్టుకి పశ్చిమ దిశలో పూర్వ ముఖుడై కూర్చొన్నాడు. వేసవి తాపం సోకకుండా ఏ ప్రదేశంలో కూర్చోవాలో అలా కూర్చొన్నాడు.

(పటం. 3.) బుద్ధునికాలంలో క్రీ. పూ 2050 - క్రీ. శ. 100

ఒక చిన్న విషయం చెప్పుకుందాం. మనం బస్సు, రైలు, ప్రయాణాలు చేస్తూ ఉంటాం. బస్సు బస్టాండులో ఆగినప్పుడు డ్రైవర్‌ వైపున ఎండపడుతూ ఉంటే మనం కండక్టర్‌ వైపు ఉన్న సీట్లలో కూర్చొంటాం. తీరా బస్సు స్టేషన్‌ దాటి రోడ్డు మీదకి వచ్చాక కండక్టర్‌వైపు ఎండవచ్చి పడుతుంది. దీనికి కారణం? మనం వెళ్ళేదారి ఏ దిక్కుకు ఉందో మనం తెలుసుకోలేక పోవడమే!

మరి నెలల తరబడి లేవకుండా కూర్చో వాలి అనుకుంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలి ?

ఇప్పటి పంచాంగం ఇప్పటిది కాదు:

ఇక్కడ ఒక విషయం చెప్పుకుతీరాలి. మనం ఇప్పుడు పాటించే పంచాంగం అంతా క్రీ. పూ. 2050 - క్రీ. శ 100 సంవత్సరాల నాటిదే! మేషం మొదటిరాశి. అశ్విని మొదట నక్షత్రం. మన జ్యోతిష్యం అంతా ఆ నక్షత్రాలు, ఆ నక్షత్రపాదాల మీదే రూపొందించినవి. కాని ఇప్పుడు మొదటి రాశి మీనం, మొదటి నక్షత్రం పూర్వభాద్ర - ఈ లెక్కన చూస్తే ఇవ్పటి జ్యోతిష్య పంచాంగం అంతా పరమ తప్పు. ఈ తప్పిదాన్ని సవరించడం తలకు మించిన భారమేమీ కాదు. కానీ అలా మారిస్తే తరతరాలుగా నమ్ముతూ వస్తోన్న మూఢనమ్మ కాలన్నీ మారిపోతాయి. జ్యోతిష్యం మీద నమ్మకం పోతుంది. కాబట్టి, 'నమ్మకం' మీద నాలుగురాళ్ళు సంపాదించుకునేవారికి, జ్యోతిష్యాన్ని మార్చడం ఉత్త దండగ. అందుకే అ ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఈ దురదృష్టం అంతా జ్యోతిష్య ఫలాల్ని నమ్మే వాళ్ళదే!

విషువత్‌ చలనానికి భూమి మూడో చలనమే కారణం అనే విషయం నిదాన కథ రచయితకి తెలియకపోవచ్చు. కానీ, దాని

44

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018.