పుట:Ammanudi july 2018.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
క్ర్రీ. పూ 2050 - క్రీ. శ 100 కాలం నాటి దిక్చక్రం


అలాగే...శరత్‌ విషువత్తు కన్యరాశిలో జరుగుతుంది. ఇక ఉత్తరాయణాంతం మిధున రాశిలో దక్షిణాయనాంతం ధనుర్రాశిలో జరుగుతున్నాయి.

నిజానికి కర్కటరేఖ మీద ఆకాశంలో కనిపించే కర్కాటక రాశిలో కాకుండా దాని వెనుకదైన మిధునంలో ఉత్తరాయణాంతం జరుగుతుంది. అంటే ఉత్తరాయణాంతం ఒక రాశి వెనక్కి పోయిందన్నమాట!

అలాగే మకర రాశిలో జరగాల్సిన దక్షిణాయనాంతం ధనుర్రాశిలో జరుగుతుంది

ఈ ప్రక్కనున్న రెండవ బొమ్మను చూస్తే ఈ నాలుగు అంశాలు ఏఏ రాశుల్లో జరుగుతున్నాయో తెలుస్తుంది.

ఇక 2 వేల సంవత్సరాల వెనక్కిపోదాం - క్రీ.పూ. 2050 నుండి క్రీ.శ 100వరకూ ఉన్న కాలం. రుగ్‌ యజుర్వేదకాలం. బుద్ధుని కాలం. అశోకుడు, ఉపనిషత్తులు, అధర్వణ వేదం, శాతవాహనుల కాలం వరకూ ఉన్నదంతా ఈ కాలంలోనే.

ఈ కాలంలో చూడండి. వసంత విషువత్‌ మేషంలో జరిగింది. శరద్‌ విషవత్‌ తులలో జరిగింది. ఉత్తరాయణాంతం కర్కాటకరాశిలో, దక్షిణాయనాంతం మకర రాశిలో జరిగాయి.

పటం..3. (బుద్దుని కాలంలో)

ఈనాడు మనం నక్షత్రాల క్రమాన్ని “అశ్వని, భరణి, కృత్తిక అనే క్రమంలో చెప్తాం. ఈ క్రమం అప్పటిదే. ఈ మూడు నక్ష త్రాలతో ఏర్పడ్డరాశి మేషం. ఇక అంతకంటే పూర్వపు స్థితి చూద్దాం. ఆపైన 2150 ఏళ్ల వెనక్కిపోతే క్రీ.పూ. 4200 - క్రీపూ. 2050 మధ్యకాలం వస్తుంది. ఈ కాలంలో వసంత విషువత్‌ వృషభంలో, శరత్‌ విషువత్‌ వృశ్చి కంలో, ఉత్తరాయణాతం సింహంలో, దక్షిణాయనాంతం కుంభరాశితో సంభవించాయి.

పటం. 4 (సింధూనాగరికత కాలం)

రుగ్‌ యజుర్వేదాల్లో నక్షత్రాల పేర్లు వున్నాయి. కాని, మొదటి నక్షత్రం అశ్విని కాదు. కృత్తిక. కృత్తికతో నక్షత్రాల లెక్కింపు మొదలవుతుంది. ఎందుకంటే కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాల కూడికే వృషభ రాశి. అప్పుడు మొదటిరాశి వృషభం. మొదట నక్షత్రం కృత్తిక. అశ్విని ఇరవై ఆరో నక్షత్రం.

పై మూడు బొమ్మలు చూస్తే ఆయనాం

పటం 2. ప్రస్తుత కాలంలో క్రీ. శ. 100 - క్రీ. శ. 2200

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి జూలై 2018

43