Jump to content

పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

United Nations Educational, Scientific and Cultural Organization అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా యునెస్కో డైరెక్టర్ జనరల్ శ్రీమతి ఇదీనా బొకోవా సందేశం

భాష ద్వారా, భాషతోనే అంతరీకరణ విద్య

పదిహేనవ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని 2015వ సంవత్సరంలో జరుపుకోబోతున్నాము. అంతర్జాతీయ సమాజానికి ఇది ఒక మలుపు వంటి సంవత్సరం కూడా. కారణం సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలకు ఇదే చివరి సంవత్సరం. అంతేకాకుండా ప్రపంచవ్యాప్త నిరంతర అభివృద్ధికి దేశాలు ప్రణాళికలని నిర్వచించుకుంటున్న కాలం కూడా ఇదే.

2015 తర్వాత వచ్చే కాలానికి అభివృద్ధి ప్రణాళికలో అందరికీ నాణ్యమైన విద్య అనే అంశం ప్రధానాంశం కావాలి. విద్య అందుబాటును విస్తృతపరచడం. నాణ్యతని పక్కాగా చూచుకోవడం ఇప్పటిదాకా విద్య అందని వారిని విద్య బోధనలోనికి చేర్చుకోవడం, ప్రపంచంలోని అందరికీ విద్య అందుబాటులోనికి తేవడం అనేవి నిరంతర అభివృద్ధి ప్రణాళికలో ప్రాధాన్యాన్ని సంతరించుకోవాలి. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి విద్యాబోధన అనేది మాతృభాషలోనే జరగడం అన్నది తప్పకుండా జరగాలి. నేర్చుకునే ప్రక్రియ, నేర్చుకునే ప్రక్రియకు దన్ను, గణితం, చదవడం, రాయడం అన్నీ మాతృభాషలో జరగాలి. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి విద్యాబోధన, శిక్షణ, విద్యా కార్యక్రమాలు, సరైన శిక్షణ వాతావరణాన్ని కల్పించుకోవాలి.

ఈ లక్ష్యాలను యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకుపోతుంది. అంతరీకరణ విద్య (ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్)లో భాగంగా లాటిన్ అమెరికాలో యునెస్కో చిల్డ్రన్స్ ఫండ్ (యునెస్కో బాలలనిధి)తో ద్విభాషా విధానంతో ద్విసంస్కృతి విధానంతో అంతరీకరణ విద్యను అమలుచేయడం జరుగుతూ వుంది. దేశీయమైన సంస్కృతిని ఇతరేతర సంస్కృతిని కలగలిపేందుకు ఈ విధానాన్ని అనుసరించడం జరుగుతూ వుంది. యునెస్కో ప్రాంతీయసంస్థ, ఆసియాలో, బాంకాక్, థాయ్లాండులలో (పసిఫిక్ ప్రాంత) మాతృభాష విస్తృతపరిచే ప్రయత్నం చేస్తూ వుంది. నేర్చుకునే ప్రక్రియ బాగా నాణ్యంగా ఉండడానికి మాతృభాషలో విద్యాబోధన చాలా బలమైన శక్తి. బహుభాషా విధానానికి దన్ను కావాలన్నా ఈ శక్తి చాలా అవసరం. భాషాపరమైన, సంస్కృతిపరమైన వైవిధ్యాలను గౌరవించడానికి కూడా ఈ మాతృభాషా శక్తి చాలా అవసరం. త్వరత్వరగా పరిణామాలు జరుగుతున్న సమాజాలలో ఈ విధమైన మాతృభాషా విద్య చాలా అవసరం.

అందరికీ విద్య అనే లక్ష్యాన్ని చేరడానికి 2000 సంవత్సరం నుండి చాలా విరివిగా కృషి జరుగుతూ వుంది. ఇంకా పూర్తి కాని లక్ష్యాల దిశగా, కొత్త సవాళ్ళను ఎదుర్కొనేందుకు మనం ఇంకా విశేషంగా కృషిచేయాలి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అనేది లక్ష్యసాధన దిశగా పనిచేసే మంచివేదిక అన్నిరకాల విద్య అవసరాలకు మాతృభాష ప్రాధాన్యాన్ని గుర్తించడానికి నాణ్యమైన పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పటిదాకా విద్య చేరని వారిని చేరడానికి మనం మాతృభాష జెండాను మోసుకొని ముందుకు పోవాలి. ప్రతి బాలిక, బాలుడు, ఆడ, మగా వారి వారి సమాజాలలో ఈ లక్ష్యాల కోసం పనిచేయడానికి వారికి అవసరమైన పరికరాలు సమకూర్చుకోవాలి. మాతృభాషలో విద్యాబోధన అన్నది ప్రాథమిక మానవహక్కు. అన్ని రకాల నిరంతర అభివృద్ధికి బలమైన శక్తి.

ఇతర భాషల నుండి మాటల్ని తీసుకొంటే లాభమా, నష్టమా?

2013 నవంబరు 29న చెన్నపట్నం (చెన్నై)లోని కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజి ఎసెస్మెంట్ డిపార్టుమెంటులో ఒక సదస్సు జరిగింది. ఇందులో దాని ప్రధాన అధికారి మైకేల్ మిలనోవిక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన అన్నమాటలివి :

"ఆంగ్లభాషలోకి ఇతరభాషల నుండి వచ్చిచేరిన మాటల వలన ఆంగ్లభాష సుసంపన్న మయింది అనడం కొంతమేరకే వాస్తవం. అవి ఆంగ్లాన్ని మరింత సంక్లిష్టంగా మార్చాయన్నది పూర్తినిజం. ఇప్పటి ఆంగ్లానికి షేక్స్పియర్ నాటి ఆంగ్లానికి తేడా ఉన్నమాట నిజమే అయినా ఆ మార్పు సహజంగా ఏర్పడింది. గత కొన్ని ఏళ్లుగా ప్రపంచ నలుమూలలనుండి వచ్చి పడుతున్న ఇతర భాషాపదాలను చేర్చుకుంటూపోతున్నకొద్దీ ఆధునిక ఆంగ్లం చాలా చాలా కటువుగా మారిపోతున్నది.”

వేరే నుడుల నుండి కొత్తగా వస్తున్న వేరే మాటలను ఉన్నవి ఉన్నట్లుగా కలిపేసుకోవడం అన్నది తెలుగునుడి గొప్పదనంగా మన తెలివిపరులు (మేధావులు) మొదటినుండీ చెప్తూ ఉన్నారు. అది తప్పు అని ఇంగ్లీషు తెలివివరులే ఇప్పుడు మొత్తుకుంటున్నారు. పెరనుడి మాటలను పలుకుతీరుతో సహా దిగుమతి చేసుకోవడం లేదా... ఒక పెరనుడి మాటకు మాటగా ఇంకొక పెరనుడి మాటలు వాడటం (ఇంగ్లీషుకు ముందుగా సంస్కృతాన్నో, ఉర్దూనో) నరి తీరుకాదు. ఎన్ని కొంగొత్త మాటలు వచ్చినా తన కుదుర్ల నుండి మాటలు పుట్టించి వాడుకలోకి తెచ్చుకోవడమే సరియైన తీరు.’ ప్రపంచవ్యాప్తంగా తెలివిపరులు ఇదే చెప్తున్నారు. కొంక్రొత్త ఆరయికలు (పరిశోధనలు) అదే తెలుపుతున్నాయి. తెలుగుజాతి ఈ విధంగా ముందుకు అడుగులు వేయాలి. తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015 8