Jump to content

పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వేంకటకవి 'విజయ విలాసా'నికి ధర్మారావుగారు రాసిన హృదయోల్లాన | వ్యాఖ్యకు 1971 సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఆ సందర్భంగా ఆయనను సన్మానించిన సభలో నార్ల వెంకటేశ్వరరావుగారు ప్రసంగిస్తూ "భౌతికంగా 85 సంవత్సరాలు వచ్చినా, మానసికంగా నిత్య నూతనత్వం తొణికిస లాడుతున్న సాహితీకారుడు ధర్మారావు" అని పేర్కొన్నారు. గ్రాంధిక భాషానాది అయిన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డిగారే తనతో 'జనవాణి'ని గురించి మాట్టాడుతూ "తాపీ ధర్మారావుగారు పసగల మంచి భాష వాడుతున్నార"ని మెచ్చుకున్నట్టు నార్ల ఏటుకూరి ప్రసాద్ తో అన్నారట. ఎలా రాయాలో తాపీ నుంచి నేర్చుకున్నానని కూడా నార్ల ఒక సందర్భంలో అనడం గమనార్హం. విచిత్రమేమిటంటే బుద్ధుడిని అవతారాలలో చేర్చి ఆయనలోని బ్రాహ్మణీయ వ్యతిరేక సూనవీయ చైతన్యాన్ని గోళంపై చన్నీళ్లు చల్లడానికి దుస్సాహసించిన స్వార్ధపరవర్గమే తాపీ ధర్మారావు జరిపిన హేతుశోధనను, ముఖ్యంగా పురుషాధిపత్య సమాజ నిరంకుశ దుర్నీతిని ఎండగట్టిన ఆయనలోని మౌలిక సామాజిక విప్లవమూర్తిని కప్పిపుచ్చి ఆయనను కేవలం వాడుక భాషావాదిగా, అభ్యుదయ రచయితగా మాత్రమే చూపించడానికి పాల్పడింది. అంతమాత్రాన తాపీ తన పరిశోధనా గ్రంథాల ద్వారా కుండబద్దలు కొట్టినట్టు తేటతెల్లంచేసిన సామాజిక చేదుసత్యాలు మూధాచారయుత భష్ట సమాజాన్ని మేలుకొల్పకుండా ఉండవు. వర్తమాన, అసహజ దోపిడీ సమాజం పురోగామి పరిణామం చెందుతూ స్త్రీ జాతి తాను పోగొట్టుకొన్న తన వెన్నెముకను వెతుక్కొని తిరిగి తొడుక్కొని నిటారుగా నిలుచున్న క్షణాన తాపీ ధర్మారావుగారు లోకైక ప్రకాశకుడుగా విలసిల్లుతారు. ఆకాశమంత వెలుగయిన ఆయన ప్రకృతి సమధర్మ శోధన ప్రపంచానికి దారిదీపంగా వెలుగొందుతుంది.

పత్రికల్లో సినిమాల్లో ప్రజల భాషను ప్రవేశపెట్టిన ఘనుడు తాపీ ధర్మారావు గొప్ప పత్రికా సంపాదకుడు, కవి, రచయిత, సంస్కర్త, విప్లవకారుడు చెరగని స్పూర్తి తాపీ ధర్మారావు తాపీ ధర్మారావు (తాతాజీ) జీవితాన్ని, రచనలను విశ్లేషిస్తూ ప్రముఖులు వ్రాసిన వ్యాసాల సంపుటి ఎందరికో తెలియని సంగతులు, సమాచారం. పుటలు : 212/- వెల : రు. 150 లు పుస్తకం కావలసినవారు రూ.150 లను ఎం.ఒ గాని, బ్యాంక్ డ్రాఫ్టు గాని పంపాలి. సొమ్ము చేరిన వెంటనే పుస్తకాన్ని కొరియర్ ద్వారా గాని, రిజిస్టర్డ్ బుక్పోస్ట్ ద్వారా గాని పంపగలము. చిరునామా, ఫోన్ నెంబరుతో సహా తెలియపరచాలి. డా॥ సామల రమేష్ బాబు, ట్రస్టీ జి-2. శ్రీ వాయుపుత్ర అపార్టుమెంట్స్, హిందీ కళాశాల వీధి, మాచవరం, విజయవాడ - 520 004. ఫోన్ : 9848016136 ఇ-మెయిల్ taapivedika@gmail.com

'ఎల్లలు లేని తెలుగు' బయటి రాష్ట్రాలలోని తెలుగువారి పలుకు, బ్రతుకుల విశేషాలు ఎల్లలు లేని తెలుగు ఎందరికో తెలియని సంగతులు, సమాచారం 'తెలుగుజాతి' ట్రస్టు ప్రచురణ పుటలు: 254 వెల: రు. 200 లు పుస్తకం కావలసినవారు రు. 200 లను ఎం.ఒ గాని, బ్యాంక్ డ్రాఫ్టు గాని పంపాలి. సొమ్ము చేరిన వెంటనే పుస్తకాన్ని కొరియర్ ద్వారా గాని, రిజిష్టర్డ్ బుక్ పోస్టుగా గాని పంపగలము. చిరునామా, ఫోన్ నెంబరుతో సహా తెలియపరచాలి. డా॥ సామల లక్ష్మణబాబు, ట్రస్టీ, తెలుగుజాతి (ట్రస్టు), 8-386, జీవక భవన్, అంగలకుదురు, తెనాలి - 522 211. ఫోన్ : 9440448244. ! తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015 56