బొబ్బిలిరాజా. పలు విషయా లలో ఆయనతో విభేదించిన పిఠాపురం రాజా ఎన్నికల ప్రచారం కోసం 1936లో ఇంగ్లీషు, తమిళం, తెలుగు భాషల్లో దినపత్రికలను ప్రారంభించారు.
తెలుగు పత్రికకు 'జనవాణి' అని పేరుపెట్టారు. అంతకుముందు 'సమదర్శనికి సంపాదకులుగా పనిచేసిన అనుభవాన్ని, ఆయన సాహితీ ప్రతిభను దృష్టిలో పెట్టుకుని ధర్మారావుగారినే ఆ పత్రికకు సంపాదకులుగా ఎంపిక చేశారు. (ఆధారం - తాపీ ధర్మారావు జీవిత సంగ్రహం, పేజీ 39) "ధర్మారావుగారికీ ఆనాడు ఆ పత్రికలో పనిచేసిన వారెవరికీ పీపుల్స్పర్టీ రాజకీయాలుండేవి కావు. అందరివీ జాతీయవాద భావాలే" అని బోయి భీమన్న తెలిపారు. సుప్రసిద్ధ కవి, రచయిత బోయి భీమన్న అప్పటికి 'జనవాణి' పత్రికలో సంపాదకేతర విభాగంలో గుమాస్తాగా పనిచేస్తూ ఉన్నారు. భీమన్న ప్రతిభను గుర్తించి తాపీ ఆయనను సంపాదక వర్గంలో చేర్చుకున్నారు. జానపదుడు అనే కలం పేరుతో తన చేత పత్రికలో రాయించింది ధర్మారావుగారేనని భీమన్న చెప్పుకున్నారు. 'జనవాణి'లో ధర్మారావుగారి సంపాదకత్వంలో నార్ల వెంకటేశ్వరరావు, పి. శ్రీరాములు, పండితారాధ్యుల నాగేశ్వరరావు వంటి ప్రతిభావంతులు పనిచేశారు. సాధారణ పాఠకలోకం చదివి సులభంగా అర్ధం చేసుకోవా లంటే 'జనవాణి'లోని వార్తలు, వ్యాఖ్యలు వాడుకభాషలోనే ఉండాలన్న నిబంధనను తావీ కచ్చితంగా అమలు జరిపారు. సంపాదకీయాలు వీడిత జనపక్షపాత మందుపాతరలు, యలమర్రు, కాటూరు గ్రామాల్లో 1949 జూలై 14,15 తేదీలలో పోలీసులు సాగించిన అమానుషాన్ని దారుణ దురాగతాన్ని ఖండిస్తూ "జలియన్ వాలాబాగ్ ను దిగదుడిచిన ఘట్టంగా పేర్కొన్నారు. ఆ ఒడ్యర్, జనరల్ డయ్యర్ మేకపిల్లలైపోయారే వీరిముందు" అని సునిశితంగా ఖండించారు. 'కాగడా' పత్రికలో ఆనాటి ఆజ్ఞాతంలోని కమ్యూనిస్టు వీరుల క్షేమ సమాచారాలందించి. వారే కుటుంబాల, అభిమానుల ఆందోళనను చల్లార్చిన నిజమైన జనమానస మిత్రుడు తాపీ. ఈ విషయంలో తాపీది నార్లకు భిన్నమైన దారి. అందుకే ఆనాటి ఘనమైన ప్రజాపోరాట చరిత్ర కలిగిన కమ్యూనిస్టులు ఇప్పటికీ తాపీని స్మరించుకుంటారు.
"సమాజంలో కొత్త జీవకళను ప్రకాశింపచేసేందుకు పత్రికా ముఖంగా సాయపడడమూ, సమాజంలోని వివిధ అంశాలను, దానిలోని వివిధ పరిణామాలనూ సహేతుకంగా విశదీకరించి పత్రికా ప్రపంచంలో ఒక కొత్తయుగాన్ని స్థాపించడము' 'కాగడా' పత్రిక ఆశయాలుగా ధర్మారావుగారు ప్రకటించారు.
నార్లను నార్లవారు అని సంబోధించేవారు ధర్మారావుగారిని తాపీవారు అని ఎందుకు అనలేదు అనే ప్రశ్న ఉదయించక తప్పదు. అలా ఉంటే తాపీ దానిని వ్యతిరేకించి ఉండేవారు. ఎందుకంటే ఆయన మహానుభావుడుగా కాక సామాన్యుడుగా గుర్తింపు పొందడమే ఇష్టపడేవారు. "మా వంశంలో ఇప్పుడుగాని, ఇకముందుగాని, ఎవ్వరెంత ఐశ్వర్యంలో ఉన్నా దీనికంతటికీ మూలం తాపీ పని అని మరిచిపోరు. మాదీ ఒక కార్మిక వంశమన్నమాట జ్ఞాపకముంచు కుంటారు. ఎప్పుడైనా ఒళ్లువంచి కష్టపడవలసి వచ్చినప్పుడు అది ఒక చిన్నతనంగా భావించడానికి జంకుతారు” అని ధర్మారావు తన ఆత్మకథ పుస్తకంలో రాసుకున్నారు.
డ్రెడ్జరి తవ్వోడ అని, అటువంటి ఇతర మంచి తెలుగుపదాలను ఉపయోగించినందుకు నార్లను ఇప్పటికీ, ఎప్పటికీ ప్రగతిశీల పాత్రికేయుడుగా, తెలుగు పత్రికాభాషలో కొత్తపద సృష్టికర్తగా చెప్పుకుంటాము. అందులో అతిశయోక్తి లేదు. అలాగే ఎ బర్డ్స్ ఐ వ్యూ ఖగేక్షణానికి చూపు అని అచ్చతెలుగు చేసిన తాపీ ధర్మారావుగారిని పత్రికాభాష కంఠాన ఆణిముత్యాలవంటి తెలుగు పదాలను అలంకరించినవారుగా చెప్పుకోవలసి ఉన్నది. పొల్లు-నెల్లు, కర్ణపిశాచం, పేలుడు గాయాలు అనే తలపేరులను తన సొంత యాజమాన్యంలో నడిచిన 'జనవాణి' మాసపత్రికలో తాపీ ప్రయోగిం చారు. నెల్లు అంటే ధాన్యమని ఆయన 'జనవాణి' తొలిసంచికలోనే తెలియచేశారు. 'జనవాణి'ని ఆయన స్వయంగా నడిపినపుడు నాటి 'జనవాణి' పరతంత్ర, నేటి 'జనవాణి' స్వతంత్ర అని చెప్పుకొన్నారు. ప్రజా ఉద్యమాల వార్తలకు 'కదలికా' అని పేరుపెట్టడంలోనే ఆయన చైతన్యం వెల్లడవుతున్నది. తదారా అన్నది. మరొక జనభాషా ప్రయోగం. ఇప్పుడు అత్యధిక సర్క్యులేషన్ గల తెలుగు దినపత్రికల్ పిల్లిని మార్గాలం అని పేర్కొన్న మాదిరిగా సంస్కృతాంధ్ర పదాలతో కూడిన మర తర్జుమాలతో పత్రికాభాషను భ్రష్టుపట్టిస్తున్న తీరు తాపీ, నార్ల వారి జనభాషా స్ఫూర్తికి కళంకం తెస్తున్నది. "తొలి నుంచీ . కొత్తదారుల కోసం నెమకినవారు. అటు పాశ్చాత్య సాహితీసంస్కృతులను, ఇటు జాతీయ సారస్వత సభ్యతలను చక్కగా జీర్ణించుకొని ఆధునిక దృక్పథంతో అపూర్వ రచనా సంవిధానంతో తన తావు తాను చూసుకొని తన గొంతు తాను వినిపిస్తూ విశిష్ట వ్యక్తిత్వం వెలార్చిన మనిషి ఆయన. నవ్యాతి సవ్య దృష్టితో సమాలోచించగల ధీశాలి. తెలుగు దినపత్రికలలో తొలిసారిగా వ్యావహారిక భాషను ప్రవేశపెట్టిన సాహసి కూడా ఆయన” అని తాపీ ధర్మారావు చనిపోయినపుడు విద్వాన్విశ్వం 'ఆంధ్రప్రభ'లో సంపాదకీయ నివాళి అర్పించారు. అలాగే “మన తెలుగు సినిమాలలో వ్యావహారిక భాష ఆయన పెట్టిన భిక్షే" అని ఆరుద్ర 'వనిత' మాసపత్రికలో కొనియాడారు. ఇటు పత్రికలలో అటు చలనచిత్రాలలో ఒకేసారి వాడుక తెలుగుకు పట్టంకట్టిన అసాధారణ జనాక్షరమూర్తి తాపీ. "మనకున్న ఉద్దేశాన్ని ఎలాగ చెప్పితే సులభంగా అవతలి వాళ్లకు బోధపడుతుందో అలాగ చెప్పేదే భాష. ఆ బోధపడటం ఎంత చక్కగా ఉంటే అంత చక్కని భాష అనాలి" అని తాపీ తన 'కొత్తపాళీ'కి ఇచ్చిన నిర్వచనమే జనభావ పరిపుష్టం. విశాఖపట్టణం అనే దీపం కింద నీడలా ఇప్పటికీ అనామకంగా మిగిలిపోయిన శ్రీకాకుళం తాపీవారి స్వస్థలం కావడం నాబోటి ఆ జిల్లావారికి గర్వకారణం.
పాత్రికేయుడుగా, పత్రికా సంపాదకుడుగా మానవాళి ప్రగతికి తోడుపడడమే పరమావధిగా తాపీవారు కృషిచేశారు. చామకూర
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015 55