Jump to content

పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాదు. సృష్టి అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి జతకట్టడం ఉంటే చాలును. పెళ్ళి అనే పర్రాకులు వడనక్కరలేదు. (పెళ్లి దాని వుట్టు పూర్వోత్తరాలు 85వ పేజీ) "ఎలాంటి పెళ్లయినా సరే, దానిలో శాశ్వతగుణం ఏదీ లేదు అన్నమాట ముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అటువంటి స్థితిలో నుంచి ఇప్పటి పెళ్లిళ్ల అభిప్రాయా లను పుట్టించారు- నీటిలో అగ్గి పుట్టించినట్లు. కన్యాత్వం, పాతివ్రత్యం, మతం, జన్మజన్మాలకు శాశ్వతత్వం - ఇలాంటివన్నీ దీనిలో ప్రవేశ పెట్టారు. అది చిత్ర చరిత్ర" (పేజీ86). అలాగని స్త్రీ పురుషులు విచ్చలవిడి శృంగారానికి మాత్రమే పాల్పడి బాధ్యతారాహిత్యంతో మెలగాలన్నది ఆయన అభిప్రాయం ఎంతమాత్రం కాదు. పెళ్లి లేకుండా ఉభయుల ఇష్టాయిష్టాలకు లోబడి బాధ్యతాయుతంగా సహజీవనం సాగిస్తున్న స్త్రీ పురుషులు నేడు ఎంతమంది లేరు! వారివల్ల వ్యభిచారం, అసభ్యత, విచ్చలవిడి శృంగారం ప్రబలుతున్నదని చెప్పగల ధైర్యం ఎవరికి ఉంటుంది? అలా జీవించడం వల్ల స్త్రీ బానిస సంకెళ్లు బదాబదలవు తున్నాయి. అసమ సంసార బంధనాలు తెగిపడుతున్నాయి. “గర్భం వల్ల పనిపాటులకు ఆటంకం కలగడం ఇప్పటిలాగా నెలలతరబడిని కాదు. ఆ రోజులలో చాలా స్వల్పకాలం మాత్రమే అన్నమాట మరిచిపోనక్కర్లేదు. ఇప్పటికీ పాటక జనాలలో కడుపుతో ఉండటం వల్ల పనికి నాగా కలగడం చాలా తక్కువ రోజులు. అయినా, ఆడదానికి అది ఒక అవసరమే. పెద్ద అవసరం. దానిని చేసుకునే సంఘ జీవితంలో మగవాడు ఏకు-మేకైపోయాడు. ఆడదానిని పనిగొడ్డుగాను, బానిసగాను చేసిపారవేశాడు. అధికారాలన్నీ మగవారిపని అరవ చాకిరీ అంతా ఆడదానిదనీ నీతులు చెప్పాడు.... ఈ అవసరం అన్నదే ఆడదానికి లేకపోతే, ఆడదాని జీవనం ఇంత అధ్వాన్నంగా మారి ఉండదు. సృష్టికి, స్థితికి ముఖ్యకారణమైన ఈ గుణం ఎంతో గౌరవించవలసింది. ఎంతో పెద్ద స్థానం దీనివల్ల ఆడవాళ్లకు ఇవ్వవలసింది. అదంతా పోయింది. మగవాడు దీనిని సాకుగా చేసుకుని అధికారం అంతా ఆడదాని దగ్గర నుంచి గుంజుకున్నాడు. (పెల్లి - దాని పుట్టుపూర్వోత్తరాలు పేజీ 56). "ఈ అబలలను తయారుచేసినవారము మనమే. అసలు లోకంలో స్త్రీలందరికీ కచ్చడాలు బిగించినా వ్యభిచారం ఆగదు. అలాగే లోకంలో ఉన్న స్త్రీలందరినీ విచ్చలవిడిగా, స్వేచ్చగా విడిచిపెట్టినా అందరూ వ్యభిచరించరు" ("ఇనుపకచ్చడాలు' - పేజీ 5-4) "సృష్టిలో తయారైన ఆడది అబలకాదు. మగవాడితో అన్ని విధాలా సరిసమానంగా ఉండేది. వ్యత్యాసమున్నది ఏదీలేదు" (పెళ్లి - దాని పుట్టుపూర్వోత్తరాలు' పేజీ - 56) ఇక్కడ ఇంకొక విషయం గమనార్హం. స్త్రీని బందీగా చేసుకున్న మగవాడు ఆమె మరో మగవాడి ఆధీనం కాకుండా చూసుకోవడమే అనునిత్య విధిగా చేసుకొని ఆత్మవంచనకు పాల్పడుతున్నాడు. దీనిని వివరిస్తూ తాపీ ఇలా అన్నారు. "ఆడదానిలో తాను కోరిక మమూర్తి మంచితనం తనలో లేదని గ్రహించడానికి జ్ఞానం చాలింది. కాదు. తన స్త్రీకి ఒక్క కచ్చడం బిగించి తాను మరొక ఇంటికి కచ్చడం భేదించడానికి బయలు దేరుతాడు ('ఇనుప కచ్చడాలు' - పేజీ 56) “ఆడదిగూడా ఒక ఆస్తి అన్న అభిప్రాయమే అప్పుడు ఇప్పుడు గూడాను. నా ఆస్తి ఇంకొకడు అనుభవించడమా అన్న ఈసే మగవాడికి" ("పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు - పేజీ 104).

మోసకారి పవిత్రతను ప్రయోగించి గుడిని పురోహిత వర్గ బందీగా చేసి సృష్టికార్యాన్ని బూతుగా ప్రచారం చేసిన హైందవ సామాజిక దొరతనం కుట్రను 'దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు' అన్న అపూర్వ అసాధారణ పరిశోధనా వ్యాసంతో దునుమాడిన తాపీ, మానవతా తాత్విక పతాకగా రెపరెపలాడారు. ఇంత చక్కని సామాజిక చైతన్యాన్ని అక్షరీకరించి అందించిన తాపీని అధ్యయనం చేసి ఆ వెలుగులో తనను తాను సంస్కరించుకొనని సమాజానికి భవిష్యత్తు ఉండదు.

పాత్రికేయ వృత్తి ఎంతటి అసిధారావ్రతమో తెలిసిందే. ఆ అగ్నిపరీక్షలో నెగ్గి జనహిత జర్నలిస్టుగా నిరూపించుకున్న అరుదైన అక్షరసేనాని తాపీ ధర్మారావు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాకు పెట్టుబడి శరీరమైతే ప్రజాహిత లక్షణం ప్రాణం కావాలి. కాని దురదృష్టవశాత్తు నేటి మీడియా తనకు నిజమైన యజమాని అయిన ప్రజాస్వామిని పూర్తిగా నిర్లక్ష్యం చేసే పెట్టుబడి యజమాని దాస్యంలో తలములకలవుతున్నది. Noam Chomsky చెప్పినట్లు Manufac- turing Consent ప్రాధాన్యమిచ్చి ప్రజల కళ్ళకు గంతలు కడుతున్నది. అందుచేతనే ప్రజలను మెప్పించడం కంటె మీడియా చేత మెప్పులు పొందడమే లక్ష్యంగా పాలించే దుర్విధానాన్ని నేటి పాలకులు పాటిస్తున్నారు. మీడియాను జేబులో బొమ్మగా చేసుకునేందుడే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకోసం కార్పోరేట్ల చేత మీడియా సంస్థలు నెలకొల్పింపచేసి వాటి ప్రచార సమాచార గారడీతో ఎన్నికలలో విజయాలు సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత బడా పెట్టుబడిదారీ సంస్థల ప్రయోజనాలకు పల్లకీ మోస్తున్నారు. ఇక్కడే ధర్మారావుగారి పాత్రికేయ నిబద్ధతను గురించి చెప్పుకోవలసి ఉన్నది. ఇప్పటిమాదిరిగానే అప్పుడు కూడా రాజకీయపార్టీలు స్వీయప్రచారం కోసం పత్రికలు నెలకొల్పడం లేదా పత్రికలకు దన్నుగా ఉండటం ఉండిందని 'జనవాణి' దినపత్రిక చరిత్రే చెబుతుంది. అప్పటికి 'ప్రజామిత్ర' పత్రిక (దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు?", "కొత్తపాళీ వ్యాసాలను 1936వ సంవత్స రంలో ప్రజామిత్ర' ధారావాహికంగా ప్రచురించింది)తో ధర్మారావు గారికి సన్నిహిత సంబంధాలుండేవి. ఆ రోజుల్లో 1937 ఎన్నికలు దగ్గరపడ్డాయి. అప్పుడు మద్రాసు రాష్ట్ర జస్టిస్పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015 54