Jump to content

పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దళారీతనం మునుగు తొలగించడమే. దీనికి ఈ మతం మతం ఈ దేశం ఆ దేశం అనే ఎల్లలు లేవు.

హింసాహింసల చర్చలో గాంధీజీని అహింసామూర్తిగా కీర్తిస్తారు, ఆంగ్లేయ వలస పాలకులతో పోరాటంలో హింసాయుత ప్రతిఘటనను ఎంచుకోనందుకు కావచ్చు. కాని వాస్తవంలో హింస, ఆత్మీయ అతిథి అణచివేతలను అస్త్రాలుగా చేసుకుని నేటి ప్రజాస్వామ్య రాజ్యాంగపాలిత భారతావని లోనూ విర్రవీగుతున్న కుల వ్యవస్థను, పురుష నిరంకుశాధిపత్యాన్ని చూసి చూడనట్టు వదిలివేశాడేగాని వాటి కొమ్ములు విరిచి రొమ్ము చీల్చి, వీధి, వాడ కలిసి జీవిచే సమ సామాజిక నవభారతాన్ని నిర్మించేందుకు చేయదగినంత కృషి గాంధీ చేయలేదు. మూలంలో హింస ముమ్మరించిన అగ్రవర్ణ నిరంకుశ, పురుష దురహంకార అసమ పల్లె సమాజానికి గ్రామస్వరాజ్యం' ప్రసాదించాలనడం ద్వారా అక్కడి దుర్నీతులకు అండ నిలిచి వార్తన సామాజిక జీవనంలో హింసామార్గాన్నే గాంధీ సమర్ధించారు. దళితవాడలను దర్శించి ఓదార్చడమనే పనికిరాని పసలేని అత్యంత మితవాద సంస్కరణ దృష్టితో పీడితులను కంటితుడుపుగా సంతృప్తిపరచ చూశారు. వైరుధ్యాలను తొలగించి సమత్వాన్ని సాధించి డమే నిజమైన అహింస. పులి, మేక కలిసి శాంతియుతంగా బతకాలని బోధించడం ఎంతమాత్రం అహింస కాదు.

కేవలం జంతు హింసను వ్యతిరేకించడం, శాకాహార భోజనం చేయడం అహింస కానేకాదు. మనిషి జీవన విధానంలో సాటి మనిషిపై స్వారీచేసి హింసించే అమానుషత్వాన్ని పరిహరించడమే నిజమైన అహింస. అది గౌతమబుద్ధునిలో, మహాత్మాఫూలేలో, బాబాసాహెబ్ అంబేడ్కర్లో ఉన్నది. మరో కోణంలో - అంటే స్త్రీ పురుష సంబంధాల పరంగా మళ్లీ తాపీవారే నిజమైన అహింసా మార్గాన్ని చూపించారు. మగ ఆడ మధ్య అసమానత, ఘర్షణ, దోపిడీ కొంచెమైనా ఉండని స్థితే ప్రకృతి సిద్ధమైన సహజ సామాజిక స్థితి అని పరిశోధనాత్మకంగా రుజువు చేశారు. “ఆడది నా సొత్తు అన్న బుద్ధి పుట్టింది. మగవాడు మర్కటం అయిపోయాడు. ఎన్ని అనర్థాలకు పాలుపడ్డాడో ఎంత తెలివిమాలిన తనం ప్రదర్శించాడో చెప్పలేము. ఆలోచనా పాలోచనా లేని పట్టి శుంఠ అయిపోయాడు. తన అక్క ఆడది, తల్లి ఆడది, భార్య ఆడది వీరందరి వల్ల భవాన్ని అనుభవాన్ని పొందుతున్నాడు. అయినా సుగవాడు స్త్రీని తిట్టిన తిట్లు ప్రపంచంలో ఎవరూ ఏ వస్తువునీ తిట్టలేదు. స్త్రీ అంటే యమదూత అన్నారు. కఠోర విష సర్పం అన్నారు. మృత్యుదేవతకు దగ్గర చుట్టం అన్నారు. నమ్మకూడదన్నారు. నారీ పిశాచం అన్నారు. గ్రంధాల నిండా ఈ తిల్లే, పుస్తకాలన్నింటిలోనూ ఈ ఉపన్యాసాలే. ఆడది అంటే అసహ్యం వేసేటట్టు చేయడానికి ఎన్ని ఉపాయా లున్నాయో అన్నిటినీ ఉపయోగించారు. ఎంత అన్యాయానికి ఒడిగట్టడానికి వీలుందో

అంతా చేశారు. ఇంకా తనివి తీరక ఈ కచ్చడాలు వంటి క్రూర పరికరాలకు కూడా దిగారు. ఇంతకన్నా మగవారి తెలివి తక్కువతనానికి నిదర్శనం. ఏమి కావాలి. ఇంతకన్నా అసూయ, చూపోపమి ఇంకేమి ఉంటుంది. అయినా పెద్దవార మని తట్టపాగాలు పెట్టుకుని మాట్టాడతారు. గంటాలు, కలాలు పట్టుకుని రాస్తారు. స్త్రీ బుద్ధి: ప్రళయాంతకః" అని ధర్మారావుగారు తన ఇనుప కచ్చడాలు' (పేజీ 52) పరిశోధన గ్రంథంలో తేటపరిచిన పండితమ్మన్యుల స్త్రీ వ్యతిరేక దృష్టిని గురించిన అభిప్రాయమే ఆయనలోని మానవీయ మహోన్నతికి, బాధిత స్త్రీజాతి పక్షపాతానికి తిరుగులేని ఉదాహరణ. ఆయన మౌలిక సామాజిక విప్లవకారుడు. బహుశ అందుకేనేమో బుధలోకం అనే స్వార్ధపరుల మూక ఆయనను తగినంతగా గుర్తించలేదు.

"ఎన్ని పూవులన్ వాలదు తేటి, అట్ల మగవాడనువానికి దోషమేమున్నది? అలాంటి సూత్రాలతో ఆడవారిని వలలో వేశాం" (ఇనుప కచ్చడాలు పేజీ 53) అని ధర్మారావుగారు పురుషపక్షపాత, స్త్రీ వ్యతిరేక సాహిత్యాన్ని ఎండగట్టారు. పూవు మకరందాన్ని దాల్చడం. తుమ్మెద కోసమేనంటూ ఆ రెంటిని లైంగిక భాగస్వాములుగా చూడడంలోని అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. పూవు పిందె కాయై ఫలదీకరణం చెందడానికి పరాగసంపర్కమే కారణమవుతుంది, కాని పువ్వుల తుమ్మెదల మకరందసంగమం కాదు. తుమ్మెదసాగించే పూదేనె వేట వల్ల పరపరాగసంపర్కం చోటు చేసుకోవడం వాస్తవం. అయితే అది కాకతాళీయమే. తుమ్మెద పరాగ వాహనం మాత్రమే. ఇతర దారుల్లోనూ మొక్క నుంచి మొక్కకు, పూర్వ నుంచి పూవుకు పరాంగం చేరవేత జరుగుతుంది.

తాపీ ప్రకృతి ధర్మశోధన మానవాళి ముంగిట వాలిన స్వేచ్ఛా విహంగం వంటిది. పురుష బానిసత్వం నుంచి స్త్రీ పరిపూర్ణ విమోచన పొందినప్పుడే మానవ ప్రపంచానికి నిజమైన స్వేచ్చ అని, అందుకు పెళ్లి అనే నిర్బంధ తంతును విడనాడవలసి ఉన్నది అని ఆయన సమూల పరిశోధనతో చేసిన నిర్ధారణే అందుకు తార్కాణం. "రంకున పుట్టిననాడూ కొడుకే, దంపతులకు పుట్టినవాడూ కొడుకే, వ్యత్యాసం రసంతైనా లేదు. అంత సులభంగా సంతృప్తిపడే సృష్టికి పెళ్లి నిబంధన అక్కర్లేదు - తాపీ ఇంత నగ్నంగా 'కటువు'గా చేసిన స్పష్టీకరణ వెనక ఉన్నది స్త్రీ పురుషులు సమాన స్వేచ్ఛతో సమ భాగస్వామ్యంతో సరిసమాన బాధ్యతతో ఒక బండికి పూన్చిన రెండు ఎద్దుల మాదిరిగా ప్రకృతిని ముందుకు తీసుకు పోవలసి ఉన్నదని చెప్పడమే. అందుకు పెళ్లి అనే ప్రత్యేక వ్యవస్థ, దానిమాటున గల పౌరోహిత్య దోపిడీ అనవసరమని వివరించడమే.

తాపీ ఇంకా ఏమన్నారో చూడండి. "ఈ విషయంలో ఒక్క సత్యం గ్రహించాలి. ఏమిటంటే, పెళ్ళి అన్నది సృష్టికి కావలసిన ఆవశ్యకత తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015