Jump to content

పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అని గిడుగును తాపీ కొనియాడారు. (రాలు - రప్పలూ - పేజీ 56) తాపీ ధర్మారావు కూడా అసమాన భాషా సంస్కర్త. ప్రతిభను సొంతం చేసుకోవడంలో, సులభసాధ్యంకాని ప్రజ్ఞను పొదిలో అమ్ముగా ధరించడంలో ఆయన బ్రాహ్మణులతో పోటీపడి ముందు పీటీన నిలిచారు. అదే సమయంలో బ్రాహ్మణీయ మతం సమాజంపై రుద్దిన స్త్రీ పురుష అసమాన భావజాలాన్ని కూకటి వేళ్ళతో పెకలించడానికి నడుం కట్టి దానిని సాధించి చూపారు. ఆయన మూడవ క్లాసు చదువుతుండగా బడి నుంచి ఇంటికి దరాగా చేతులూపుకుంటూ వచ్చారట. అప్పుడాయన తండ్రి ఎదురై స్కూల్లో ఆయనకు ఏ ర్యాంకు వచ్చిందని వాకబు చేశారట. మొదటి, రెండవ ర్యాంకుల వారు బ్రాహ్మణులే అని తెలుసుకుని "చదువు బ్రాహ్మణులకేగాని మన పిల్లలకు అబ్బుతుందా” అని భార్యతో అన్నారట. ఆ మాట చెవిన పడిన క్షణం నుంచి పట్టుదలతో చదివి అన్ని సబ్జెక్టులలోను ఫస్ట్ మార్కు తెచ్చుకుని ధర్మారావు తన చాటుకున్నారు.

మురుగుటంగరములు / ముత్యంపు సరులును / పురుషుని గైనేయ భూషణములె / అరనిమేషమునకు అన్నియు నశియించు / విద్యయొక్కటి ఎపుడు ఎడని తొడవు - అని తనను, తన వేషాన్ని గేలిచేస్తూ పద్యం చదివిన ఉపాధ్యాయుడికి తన ప్రతిభతో సమాధానం చెప్పారు.

తాపీ సమకాలికులైన నార్ల వెంకటేశ్వరరావు వంటి వారు కూడా హేతువాదానికి, బ్రాహ్మణీయ (బ్రాహ్మణ వ్యతిరేకత కాదు) వ్యతిరేక భావజాలానికి పెద్ద పీట వేసి విశేష కృషి సాగించారు. అయితే ధర్మారావుగారు ఈ విషయంలో అత్యంత మౌలికమైన పునాది కృషి చేశారు. మానవసమాజ ఆవిర్భావదశలో, అనంతరం చాలాకాలం పాటు స్త్రీ పురుషుల మధ్య సాగిన సమతూక స్థితిని చాటడానికి ఆ తరువాత పురుష నిరంకుశత్వాన్ని స్థాపించడం కోసం పుట్టిన దుష్ట ఆచార సంప్రదాయాల వికృత రూపాన్ని ఎండగట్టడానికి సాగరమధనమంతటి శోధనను విజయవంతంగా నిర్వహించారు. సృష్టిలో సగమైన స్త్రీజాతి తరతరాలుగా అనుభవిస్తున్న పీడిన మూలాలను తవ్వి చూపించారు.

పద్యరచనలో ఎంతో సారళ్యాన్ని ప్రతిభను కనపరచిన ధర్మారావు తరువాత కాలంలో నవనవ్య మానవీయ దృష్టితో అమోఘమైన పరిశోధనలు సాగించి సరళ సుందరమైన వాడుకభాషలో విశిష్ట రచనలు చేశారు. ఆయన సొంత చరిత్ర "రాలూ-రప్పలూ” ఇందుకు ప్రత్యేక ఉదాహరణ. "ఎంత ఆచార్యుడనండి, పురోహితుడవండి, ప్రేస్టు ఆనండి ఏమన్నాసరే ఈ వ్యక్తి అసాధ్యుడు. ఏకై వచ్చాడు సంఘంలోనికి. మేక కూర్చున్నాడు." ('పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు' పేజి 111). ఈ ఒక్క మచ్చు చాలు తాపీవారి సులభశైలికి. 'జనవాణి'లో తాను ప్రవేశపెట్టిన జనభాషను గురించి ధర్మారావుగారే 1969లో తెలుగు | తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015 | - అకాడెమీకిచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. "తక్కున పదాలతో బాక్యాలు రాసేవాణ్ణి. సుమారు మూడే పదాలుంటాయి వాక్యంలో. అందువల్ల వ్యావహారిక మనిపిస్తుంది. క్రియా పదాలను వ్యావహారికం చేయడమే వ్యావహారికం కాదు. అదో టెక్నిక్ కనిపెట్టాను. గ్రాంధిక భాషావాదులకు కూడా ఆ రోజుల్లో దాన్ని కాదనగల ధైర్యం ఉండేది డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు కాదు. నా శత్రువర్గం వాళ్ల విశిష్ట అతిథి పత్రికకు (ఆంధ్రప్రభ) సంపాదకుడుగా న్యాపతి నారాయణమూర్తి ఉండేవారు. అతడొచ్చి నా టెక్నిక్ని బాగా ప్రశంసించాడు". మూఢనమ్మకాలను స్వార్థపర వర్గాల పన్నాగాలను చీల్చిచెండాడి మానవీయ ప్రాంగణాన మంగళధ్వానంగా భాసించారు తాపీ. అందుకే ధర్మారావుగారిని కేవలం విమర్శకుడు, రచయిత, కవిగానేగాక మార్చ్ వంటి మహానుభావుల కోవలోని సామాజిక సత్యశోధకుడుగా పరిగణించవలసి ఉన్నది. ఇలా అంటే గాంధీ జయంతినాడు కోడికూర తిన్నావని బ్రాహ్మణీయ మీడియా ఎద్దేవా చేయగానే తొంభై శాతం జనం, ముఖ్యంగా శ్రామిక జనం ముఖ్య ఆహారమైన మాంసాన్ని ఏడాదిపాటు ముట్టకుండా చాంద్రాయణ వ్రతం వంటి శాకాహార దీక్ష పూనిన కమ్యూనిస్టు నాయకులు అభ్యంతరం చెప్పవచ్చు. బయటకు కనిపించని పిలకలు తలలో ధరించి లెఫ్టిస్టు మీడియాను ఏలుతున్న బ్రాహ్మణీయ సూరిస్టులకు రుచించకపోవచ్చు. ఎర్ర దళితగోవింద దాశరధుల తలకు ఎక్కకపోవచ్చు. కాని ఇది కాదనలేని వాస్తవం. నికార్సయిన నిజం. సామాజిక శోధనలో తానీ సూర్సును తలపించేవారే. స్త్రీ పురుష నిజస్థితిపై, వారిద్దరి సంబంధాల మూలాలపై గాఢమైన పరిశోధన చేసి ఆధ్యాత్మిక ఐతిహాసిక జీవనం ముసుగులో ఇప్పటికీ బలవంతంగా అమలుచేస్తున్న పెడతోవలపై, దోపిడి దారుల పై పిడుగులు కురిపించిన ధర్మారావు మానవీయమూర్తి, - "సరిసమానంగా ఉండే ఆడదానిని స్వాధీనం చేసుకొని బానిసగా చేశారు సుగవారు, ఆడదాని అధికారాన్ని అంతటినీ తనది చేసుకున్నారు. ఆడదానికి అధికారం ఉండకూడదని శాసనాలు చెక్కించాడు మగవాడు. ఆ దోషానికి ఫలితమా అన్నట్లు జరిగింది. ఆ మగవాడికి మగడుగా వచ్చాడు మన పురోహితుడు. టటి పనికిరాదు. నేను చెప్పినట్టంతా నువ్వు చేయాలి! లేకపోతే శపిస్తానవి గుడ్లురిమాడు. పనికిమాలిన కోతిలాగా అనుకరణ చేష్టలన్నిటినీ చేయించాడు. అప్పటకీ ఇప్పటికీ నేను అధికారిని అని డబ్బా వాయించాడు. కాదు అన్నవాడిని కడజాతి వాడన్నారు. అవును అన్నవాడిని అందలం ఎక్కించాడు". ("పెళ్లి - దాని పుట్టుపూర్వోత్తరాలు' పేజీ 100) తాపీ వారి ఈ శోధనను బట్టి బ్రాహ్మణీయ నిరంకుశత్వాన్ని ఎదిరించి వెలికి గురిఅయిన సామాజిక పోరాట యోధులే మన దళితులని అర్ధమవుతుంది. ధర్మారావుగారిది Anti - Priestism మూఢాచారాలు కర్మసిద్ధాంతయుతమైన ఆధ్యాత్మిక 52