Jump to content

పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చదివితీరవలసిన పొత్తం

సన్నిధానం నరసింహశర్మ

కడుపు తీపు

చదువతగిన పుస్తకాలు ఎన్నో వుంటాయి... కానీ చదివితీరవలసిన పుస్తకాలు కొన్నే వుంటాయి. చదివితీరవలసిన వాటిలో వర్తమానకాలానివీ వుంటాయి. అటువంటివాటిలో - ముఖ్యంగా ఖండకావ్యాలలో వేటూరి ప్రభాకరశాస్త్రి 'కడుపుతీపి' ఒకటి.

తెలుగు సాహిత్యానికి వేయేళ్ళ సేవ చేసిన ప్రక్రియ పద్యకవితా ప్రక్రియ. అన్ని ప్రక్రియల ఫలాలూ అనుభవైకవేద్యాలుగా చేసుకుంటే తెలుగు సాహిత్య వృక్ష శాఖలన్నీ తెలుస్తాయి.

2015 ఫిబ్రవరి 7వ తేదీకి ఓ ప్రత్యేకత వుంది. అది భాషా సాహిత్యాల పరిశోధకుడు, ప్రజావాఙ్మయానికి కొంత సేవ చేసిన వేటూరి ప్రభాకరశాస్త్రి గారి 127వ జయంతి రోజు. అరవై రెండు సంవత్సరాలే జీవించిన ఆయన అనేక రచనలతోపాటు 'తెలుగు మెఱుగులు' పొత్తమును తెలుగు సరస్వతి కలంకారం చేశారు. "ఒడిదొడుకులు లేని తేట తెలుగు కవితా రచన చేసినవారిగా, అచ్చుయంత్రముల వెలుగు నెఱుగక మట్టి బ్రుంగిన తాటి యాకులను బట్టుకుని కన్నులు చిల్లులుచేసికొనెడి నిరంతర (సాహితీ) వ్యవసాయము చేసినవారిగా వేటూరివారిని 'ఆంధ్ర రచయితలు' ప్రామాణిక గ్రంథంలో మధునాపంతులవారు శ్లాఘించారు. ’భాషాపరిశోధకులు, విమర్శకులు కవులుగా నగుట అరుదు. ఆ యదృష్టము ఒక్క ప్రభాకరశాస్త్రిగారికి పట్టినది' అనేది కూడా సత్యనారాయణ శాస్త్రిగారి సత్యవాక్యము.

ఆయన కేవలం కవేకాదు, ప్రత్యేకించి చెప్పుకోదగ్గ సవర్ణదీర్ఘసంధి రహిత మహాకవి కూడా. ఈ విషయాన్ని ఖండితంగా చెప్పడానికి ఆయన రాసిన నాలుగు ఖండకావ్యాల్లో 'కడుపుతీపు' 'కపోతకథ' సాక్ష్యాలు పల్కుతాయి. అందులో 'కడుపుతీపు' చదవితీరవలసిన కావ్యంగా భావించాలి. ఇప్పటికి తొంభైసంవత్సరాల క్రితం అంటే 1925లో చెన్నపురిలో ఆంధ్రపత్రికా ముద్రాలయం వారు అచ్చొత్తించిన ఖండకావ్యం కడుపుతీపు. ఇది అచ్చమైన తెలుగుదనం కల శీర్షిక. టేపటివేళ, మాపటివేళ, చీకటివేళ, ముగింపు అనే నాలుగు శీర్షికల్లో కైత బిగింపు సొంపులుంటాయి.

కథ చెప్పినట్లు సాగుతాయి పద్యాలు
కలదెగద యంధ్రవిష్ణు
స్థలమై, శ్రీకాకుళాభి ధానమ్మున బే
ర్వేలసిన పురమంధ్రావని
వెలనాటన్ గృష్ణపెంపు వెలసిన చోటన్ - అనేది మొదటి పద్యం
కొన్ని శాసనాల్లో ఆంధ్రకు ఆంధ్ర అనే వుంది.
ఆంధ్రదేశంలో నెలనాట కృష్ణానది వెలసిన చోట,

ఆంధ్రవిష్యస్థలమైన శ్రీపురం శ్రీకాకుళం అని వుంది కదా అని శ్రవణ సుభగంగా ప్రారంభం.

ఆ ఊళ్ళో ఒక ఓవర్‌సీర్ కుటుంబం వుంది. వయసులో ఉన్నవాడు. తమిళుడు, ఆయన ఇల్లాలు, నలుగురైదుగురు బిడ్డలు. అందపు గందులు, ఆ కుటుంబంలో సర్వ సౌఖ్యాలూ వున్నాయి. చక్కని సంస్కృతి కల కుటుంబం పిల్లాడు ఆ తల్లిపాలు త్రాగడం సహజంగా ఒక్క పద్యంలో

"గొబ్బున వచ్చి యొక్కలను గుడ్చుచు
నీడ్చుచు ఱైక మారుచే,
బ్రబ్బి మరొక్క సన్ దడవి పట్టుచు
రెండును బాలవంకలై
యుబ్బి స్రవింపగా జననియుం దల
మూర్కొన పొట్టనిండగా
జుబ్బనజూఱలాడెడు నినుంగు
గనుంగొన వేడుకయ్యెడున్"

అని చెప్పారు. తల్లీబిడ్డల ప్రేమపాళ్ళు సహజక్రియలూ గల ఈపద్యంలోని భావదృశ్య శిల్పం భావించి మనంకూడా బిడ్డలుగా మారుతామనిపిస్తుంది. ఈసందర్భంలో - బెద్దలకి పాలెక్కడిస్తే స్తనసౌందర్యం తగ్గిపోతుందనుకునే తల్లుల భావాలపై వేటూరివారు ఒక వేటువేస్తారు తెలుగుదనం నిండుగాగల ఓ పద్యంలో

"కుచసంపన్నత కూలిపోవుననియో క్రొవ్వారు మైసౌరు విం
త చమత్కారములంతరించునని యో స్తన్యంబులేకుండ గు
బ్బ చనుల్ దిబ్బలుగా నొనర్చుకొని ద(డ)బ్బా పాలచే నిప్డు పు
త్త్ర చయంబుం బరిమార్చు మాతలటె మాతల్! కాలదూతల్‌గదా!

కదుపుతీపు కధలో కవి వేటూరి జోక్యం కల్పించుకుని చెప్పిన పద్యంలోని భావం సువ్యక్తమే.

పదలాలిత్యం, తర్కశుద్ధి, శబ్ద స్థైర్యం, అలంకార విశేషం ఇలాంటి వెన్నో వుండి గుఱ్ఱంలా సాగాలి పద్యం అనే లక్షణాలన్నీ సలక్షణంగా ఈ ఒక్కపద్యంలోనే కాదు అన్ని పద్యాలలో ఉండడం ఈ కావ్యవిశేషం.

ఎంతటి మహాకవి పద్యరచనలోనైనా ఎక్కడో అక్కడ పదులు వదులు Loose Compostion కలయికలుండవచ్చేమోగాని, వేటూరి పద్య

తెలుగుజాతి పత్రిక

అమ్మనుడి

మార్చి 2015