క్వారీ కార్మికులు నేలకొరిగిన సంఘటన జిల్లాలో గ్రానైట్ మాఫియా ఆగడాలను వెలికి తెచ్చినట్లయింది. జిల్లాలోని ములంగూర్ జిల్లా, హుజూరాబాద్ ప్రాంతంలోని రాకాసిగుండ్లు, ఎలగందుల ఖిల్లా గ్రానైట్ మాఫియా చేతిలో విధ్వంస రచనలో భాగమయ్యాయి. ఎలగందుల ఖిల్లా చుట్టువున్న ఇరవై గుట్టలను గ్రానైట్ కు ఇచ్చిన విషయం తెలిసిందే. సైదాపూర్ మండలంలోని సర్వాయి పాపన్న గుట్టలను, హుస్నాబాద్ ప్రాంతంలోని పొట్లపల్లి ఎల్లమ్మగుట్టలను విధ్వంసం చేయడానికి గ్రానైట్ మాఫియా పెద్ద ఎత్తున ప్రయాత్నాలు సాగిస్తోంది. ఇక్కడి గుట్టలను గ్రానైట్ పరం చేయడానికి ఆర్డివోలు, ఇతర రెవిన్యూ, మైనింగ్ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కోసం పర్యటించి వెళ్లారు. అంతేకాక పొట్లపల్లిలోని ఎల్లమ్మగుట్టలను గ్రానైట్ పర్మిషన్‌పై మైనింగ్ శాఖకు 20కి పైగా అర్జీలు వచ్చినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఎనిమిది వందల ఎకరాలలో విస్తరించివున్న ఎల్లమ్మగుట్టల విధ్వంసానికి బడాబాబులు తీవ్రంగా తెలంగాణా సర్కార్ పై వత్తిడి తెస్తున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఇక్కడ సుమారు రెండువేల సంవత్సరాల పూర్వంకు చెందిన చరిత్ర దాగి వుందని, ఇక్కడ ఆదిమానవుల బృహత్ శిలా సమాధులు, ఎల్లమ్మగుట్ట వద్ద బయల్పడిన ఎల్లమ్మ, నాగ విగ్రహాలు వున్నాయని, మరో నాగపట్నమని, ఎల్లమ్మగుట్టపైన అపూర్వ సారంగం వుందని, ఎందరెందరో విదేశీ చరిత్రకారులు సైతం ఎల్లమ్మగుట్టపైన పరిశోధనలు చేశారని ఈ గుట్ట ప్రాంతాన్ని జనవరి 13న సందర్శించిన పరిశోధకులు జయధీర్ తిరుమలరావు, సూరేపల్లి సుజాత, పర్యావరణవేత్తలు తోటపల్లి జగన్మోహనరావు, మాదన కుమారస్వామి, మార్వాడి సుదర్శన్ తదితరులు అభిప్రాయపడ్డారు. తెలంగాణా బహుజన పోరాటయోధుడు సర్వాయి పాపన్న 16-17 శతాబ్దాలలో స్థావరంగా ఏర్పరచుకొని, గుట్టపై ఖిల్లాను నిర్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గుట్టలను కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందని వీరన్నారు. తెలంగాణా ఉద్యమ తొలి పోరాట యోధుడు అనభేరి ప్రభాకరరావు నిజాం సర్కార్ కాలంలో జరిగిన తొలి ఎన్కౌంటర్లో ఈగుట్టల్లోనే అమరుడయ్యారు. మాజీ ప్రధాని పి.వి. జన్మస్థలమైన భీమదేవరపల్లి ప్రాంతంలోని వంగర ఈ గుట్టల సమీపంలోనే వుంది. ఇంతటి చారిత్రాత్మక ప్రాధాన్యం వున్న పొట్లపల్లి ఎల్లమ్మ, సర్వాయి పాపన్న గుట్టలను పరిరక్షించాలని, గ్రానైట్ మాఫియా ప్రమాదం నుండి కాపాడాలని చరిత్రకారులు కోరుతున్నారు. పాపన్న గుట్టపై గీతకార్మిక సంఘాల నాయకులు నెలకొల్పిన పాపన్న విగ్రహాన్ని ఎవ్వరో పేల్చివేయడం పలు అనుమానాలకు దారితీస్తోంది. అంతేకాక గంగాధర మండలంలోని త్రిభాషాశాసనమైన బొమ్మలమ్మగుట్టపైన జైన చక్రేశ్వరి పాదాలను రెండు సార్లు దుండగులు పేల్చి వేశారు. గత నాలుగేళ్ల కిందట ఈ గుట్టను గ్రానైట్ వరం చేయడానికి సర్కార్ అనుమతులివ్వగా చరిత్రకారులు, రచయితలు ఉద్యమించి అడ్డుకున్నారు. అంతేకాక కరీంనగర్ మండలంలోని ఎలగందుల ఖిల్లా గుట్టలను గ్రానైట్ పరం చేయడానికి గుట్టల రాళ్లను సులభంగా రవాణా చేసుకోవడానికి 32కోట్లతో కరీంనగర్ పద్మనగర్ నుండి నాలుగులైన్ల రహదారిని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈరహదారి నిర్మాణమైతే సిరిసిల్ల డివిజన్లో గుట్టనీటికి విధ్వంసంచేసి గురై, సులభంగా రవాణా చేసుకోవడానికి వీలవుతుంది. జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాలలోని గుట్టలన్నీ విధ్వంస రచనలో భాగమవుతున్నాయి. జలపాతం, కవ్వాల్ అభయారణ్యంకు గురికాకుండా ఈ అడవి తెలంగాణా రాష్ట్రం రాకముందు రామప్ప దేవాలయాలు, కుంతల పరిరక్షణకు ఉద్యమించిన తెలంగాణా చరిత్రకారులు, తెలంగాణా నేతలు మళ్లీ తెలంగాణా సహజ వనరుల పరిరక్షణకై తిరిగి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. కరీంనగర్ జిల్లాలోని మానేరు వంతెన, తంగిళ్లపల్లి, రేణిగుంట వంటి పొడవైన వంతెనలు గ్రానైట్ విపరీతమైన రవాణావల్ల స్తంభాలు కుంగి, ధ్వంసమైపోగా, వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు. కోట్ల చెట్ల పెంపకానికి అటవీశాఖామంత్రి జోగురామన్న చర్యలు తీసుకుంటున్నట్లు, అటవీ ఉత్పత్తుల పరిరక్షణకు సాయుధదళాలను పెడతామని అంటున్న కెసిఆర్ సర్కారు, మరోపక్కన వేలాది చెట్లు, జీవజాలాలున్న గుట్టలను మట్టుపెట్టే గ్రానైట్ మాఫియా చర్యల గూర్చి పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. పర్యావరణవేత్తలపై కేసులు పెట్టి రకరకాల ఇబ్బందులకు గురిచేస్తున్న గ్రానైట్ మాఫియా చేతుల్లోనే సర్కారు నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క నల్గొండ జిల్లాలోని రాచకొండ గుట్టలను ఫిల్మ్ సిటీ పేరిట, యాదగిరి గుట్ట ప్రాంతంలోని గుట్టలను దివ్యక్షేత్రం పేరిట మట్టుబెట్టే సన్నాహాలు ఊపందుకున్నాయి. దీని వెనుక రియల్ ఎస్టేట్ల మాయాజాలం వున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరో పది పన్నెండేళ్లయితే తెలంగాణా ప్రాంతంలోని గుట్టలన్నీ మాయం కావడం ఖాయం. రచయిత ఫోన్ : 09441797650 తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015
36