వారసత్వ సంపద - సంకేపల్లి నాగేంద్రశర్మ
కరీంనగర్ జిల్లాలో చారిత్రక గుట్టల విధ్వంసం తెలంగాణా ఆవిర్భావం తర్వాత పెరిగిన గ్రానైట్ మాఫియా ఆగడాలు
తొలి శాతవాహనరాజులకు రాజధానియైన కోటిలింగాల భూగర్భనగరం, వేములవాడ చాళుక్యుల రాజధానియైన వేములవాడ, కాకతీయ రాజుల వైభవం, చారిత్రాత్మకమైన బొమ్మలమ్మగుట్ట, నిజాం రాజుల కాలంలో జిల్లా కేంద్రంగా వెలుగు వెలిగిన ఎలగందుల ఖిల్లా, అడవుల్లో నెలకొన్న పౌరాణేతిహాస రామగిరి ఖిల్లాలు, వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం, కొండగట్టు వంటి దివ్యక్షేత్రాలు, విస్తారమైన గోదావరి పరీవాహక ప్రాంతం కలిగిన కరీంనగర్ జిల్లా రూపురేఖలు మారిపోతున్నాయి. ఈ జిల్లాలోని ప్రకృతి రమణీయమైన కొండలు, గుట్టలు గత పది పన్నెండేళ్ల కింద నుండి జాడాపత్తా లేకుండా పోతున్నాయి. తెలంగాణా నూతన రాష్ట్రా విర్భావం జరిగాక కూడా, అదుపు లోకి రావాల్సిన గ్రానైట్ మాఫియా ఆగడాలు, భిన్నంగా మరింతగా పెరిగిపోయి పలు చారిత్రాత్మకమైన గుట్టల విధ్వంసం కొనసాగుతూనే వుంది. పర్యావరణ పరిరక్షణకు, ప్రస్తుతం వున్న నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాల్సిన అధికార యత్రాంగం అన్ని చట్టాలను, నిబంధనలకు పక్కన బెట్టి గ్రానైట్ మాఫియా ఆగడాలకు వంతపాడుతున్నది. మే 2013లో 17 గుట్టల విధ్వంసానికి అనుమతులిచ్చిన జిల్లా కలెక్టర్ మరిన్ని గుట్టలను గ్రానైట్ అనుమతులివ్వడానికి రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఒక్క కరీంనగర్ జిల్లాలోనే సుమారు ఆరువందల గుట్టలు గ్రానైట్ మాఫియా చేతుల్లో విధ్వంసానికి గురవుతున్నాయని, కరీంనగర్ జిల్లాలోని రైల్వేస్టేషన్లన్నీ ఈ గ్రానైట్ రాళ్ళను మద్రాస్, కాకినాడ, కృష్ణపట్నం వంటి సముద్ర నౌకాశ్రయాల కేంద్రాలకు తరలిస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నాయని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో జడ్పిటీసీలు గుట్టల విధ్యంసం గూర్చి విస్తృతమైన చర్చ లేవదీసినా ఫలితం మాత్రం శూన్యం. ఇంతేకాక ప్రతినిత్యం వందలాది గ్రానైట్ రాళ్ళ ట్రక్కులు యధేచ్చగా తిరుగుతూ, గ్రానైట్ రాళ్లను సముద్ర నౌకా తీరాలకు చేర్చుతున్నాయి. జిల్లాలోని రోడ్లు, వంతెనలన్నీ గ్రానైట్ ట్రక్కుల రవాణావల్ల శిధిలమైపోతున్నాయి. చైనా, మలేషియా, హాంకాంగ్, థాయ్లాండ్, జపాన్ వంటి సుదూర దేశాలకు ఈప్రాంతంలోని రాళ్ళు ఎగుమతి అవుతున్నాయి. రంగుగ్రానైట్ రాళ్ళకు, నల్లరాళ్ళకు విదేశాలలో విపరీతమైన మార్కెటింగ్ పెరిగిపోవడంతో తెలంగాణా ప్రాంతంలోని గుట్టలన్నీ కరిగి పోతున్నాయి. అందులో చారిత్రాత్మకమైన గుట్టలు దెబ్బతింటున్నాయి. రాబోయే కాలంలో తెలంగాణాలో రోడ్లు వేయడానికి, ఇళ్ళు కట్టుకోవడానికి, రైల్వే లైన్లు వేయడానికి కంకర, బండరాళ్ళు దొరికే అవకాశం మృగ్యమైపోతున్నది. నూతనంగా వచ్చిన తెలంగాణా ప్రభుత్వ సారధి కెసిఆర్ గారు, చెరువులు మరమ్మత్తులు, చెరువుల పరిరక్షణ పేరిట కాకతీయ మిషన్, ప్రతి గ్రామానికి మంచినీరు అందించే వాటర్ గ్రిడ్ పథకాలను సుమారు యాభై వేల కోట్ల రూపాయలతో ప్రారంభించారు. ఇందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. కాకతీయులు చెరువులను గుట్టల జాలు ఆధారంగా కట్టిన విషయాన్ని పొట్లపల్లిలోని ఎల్లమ్మ గుట్టు ఎవ్వరు కాదన లేరు. తెలంగాణా ప్రాంతం లోని గుట్టల జాలుతోనే చెరువులు నిండుతాయన్నది కాదనలేని సత్యం. వరంగల్ జిల్లాలోని లక్కవరం, భద్రకాళి, పాకాల, ధర్మసాగరం, రామప్ప చెరువులు గుట్టల మధ్యే నిర్మించబడ్డాయి. తెలంగాణా ప్రాంతంలోని గుట్టలన్నీ ఎడాపెడా మట్టుబెట్టుకుంటూ పోతే, ఈప్రాంతం త్వరలోనే భూకంపాల జోనులోకి చేరిపోగలదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాసం రాస్తున్న సమయంలోనే తెలంగాణా ప్రభుత్వం మైనింగ్ అనుమతుల విధానాన్ని మరింత సులభతరం చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఆయా మండలాల తాసిల్దార్లు, ఆర్డివో, కలెక్టర్లు నిరభ్యంతర సర్టిఫికేట్లు ఇవ్వవచ్చు, తద్వారా గుట్టల విధ్వంసానికి ఈ జీవో ఊతమిస్తుందని పర్యావరణ వేత్తలు విమర్శిస్తున్నారు. హుస్నాబాద్, హుజూరాబాద్ ప్రాంతంలోని గుట్టల హారాలను దోచుకోవడానికి గ్రానైట్ మాఫియా కన్నుపడటంతో పర్యావరణ వేత్తలు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. నెలరోజుల కిందట శంకరపట్నం మండలంలో గుట్టల వద్ద జరిగిన పేలుళ్ళలో ముగ్గురు తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015 35