Jump to content

పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్టేట్ రిసోర్స్ సెంటర్ ఫర్ అడల్ట్ & కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (SRC) ఫోన్లు : 040-27097129, 27090029

సాక్షర భారత్ ఆహ్వానం

  • భారత ప్రభుత్వం 2009 సెప్టెంబరు 8వ తేదీన అంతర్జాతీయ అక్షరాస్యతాదినం సందర్భంగా “సాక్షర భారత్" పథకాన్ని ఆవిష్కరించింది.
  • 2012 నాటికి 15 సంవత్సరములకు పైబడిన మహిళలలో అక్షరాస్యతను పెంచి, అక్షరాస్యతలో స్త్రీ పురుష భేదాలను (కనీసం 10%) ప్రాంతీయ, వర్గాల భేదాలను తగ్గించడం ఈ సాక్షర భారత్ మిషన్ 2012 ప్రధాన ఉద్దేశ్యం.

లక్ష్యాలు :

  • 2010 నాటికి ఆరుకోట్లమంది స్త్రీలకు, ఒకకోటిమంది పురుషులకు ప్రయోజన అక్షరాస్యత అందించడం సాక్షర భారత్ ప్రధాన లక్ష్యం. వీరిలో ఎస్.సి., ఎస్.టి. కులాలకు, ముస్లిం మైనారిటీలకు, ఇతరులకు ప్రత్యేకంగా నిర్దేశితమైన కేటాయింపుల ద్వారా లక్ష్యసాధన జరుగుతుంది.
  • అక్షరాస్యతానంతరం చదువును కొనసాగించి పాఠశాల స్థాయితో సమానమైన స్థాయి గల ప్రాథమిక విద్యను నేర్చుకోవాలనుకునే ఒక కోటీ యాభైలక్షల మందివయోజనులకు విద్యావకాశాలను కల్పించడం మరొక లక్ష్యం.
  • వృత్తి విద్యానైపుణ్యాలను సంపాదించి తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలనుకునే ఒక కోటీ యాభైలక్షలమంది వయోజనులకు వృత్తి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం మరొక లక్ష్యం.

మహిళలకు ప్రాధాన్యత :

  • "సాక్షర భారత్ మిషన్ 2012” కార్యక్రమంలో మహిళలే ప్రధాన లబ్దిదారులు. ఈ కార్యక్రమం మొత్తం మహిళా ప్రాధాన్యతాయుతంగా రూపొందించబడింది. మహిళల అక్షరాస్యతా శాతం 50 కన్నా దిగువన గల 365 జిల్లాలలో ఈ కార్యక్రమం ప్రధానంగా నిర్వహింపబడుతుంది. మనరాష్ట్రంలో ఈ కార్యక్రమం 18 జిల్లాలలో అమలు చేయబడుతుంది.

పంచాయితీరాజ్ సంస్థల ద్వారా, స్వచ్ఛంద కార్యకర్తలచే అమలు :

  • పంచాయితీరాజ్ వ్యవస్థకు చెందిన సంస్థల ద్వారా ముఖ్యంగా గ్రామ పంచాయితీ ద్వారా అమలుచేయడం సాక్షర భారత్ ప్రత్యేకత. సమాజంలోని అన్ని వర్గాలను, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలను, స్వయం సహాయక సంఘాలను ఈ ప్రజా ఉద్యమంలో భాగస్వాములుగా చేసి కార్యక్రమం అమలు జరుపుతారు. సాక్షర భారత్ కార్యక్రమం స్వచ్ఛంద కార్యకర్తల ద్వారా నడుపబడుతుంది. సేవాభావం, పట్టుదల గల స్వచ్ఛంద కార్యకర్తలే సాక్షర భారత్ కార్యక్రమాన్ని నడిపే రథసారథులు.

సాక్షర భారత్ లక్ష్యాలు సాకారమై మనదేశం "సాక్షర భారతం" కావాలంటే మనందరం స్వచ్ఛందంగా ముందుకు రావాలి. మనవంతు సహకారం అందించాలి. అక్షరాస్యతకు కృషిచేస్తే అక్షరం నిలుస్తుంది. మన భాష, మన సంస్కృతి నిలుస్తుంది. మన జాతి గౌరవం పెరుగుతుంది. అందరూ బాగుంటారు.

వాడవాడలా పల్లెపల్లెలా విద్యావంతులు రారండీ ! సాక్షర భారత నిర్మాణానికి నడుంకట్టి అడుగేయండీ !

ఆచార్య డా॥ రమేష్ ఘంటా ఛైర్మన్ తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015 డా॥ పి.వి. సుబ్బారెడ్డి 30