Jump to content

పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అడల్ట్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (SPACE)

1-8-4/డి, రవీంద్రనగర్ కాలనీ, 8వ వీధి, హబ్సిగుడా, హైదరాబాదు - 500007, తెలంగాణ రాష్ట్రం. ఫోన్లు : 040-27159911, 27159996

ఆంధ్రమహిళాసభ ప్రోత్సాహంతో స్థాపింపబడిన స్వతంత్ర ప్రతిపత్తి గల రిజిష్టర్డు సొసైటీ - సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అడల్ట్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (స్పేస్) హైదరాబాదులోని రాష్ట్ర వయోజన విద్యావనరుల కేంద్ర నిర్వహణను భారత ప్రభుత్వం 'స్పేస్'కు అప్పగించింది. ఈ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో హైదరాబాదులోని రాష్ట్ర వయోజన విద్యావనరుల కేంద్రాన్ని 'స్పేస్' నిర్వహిస్తున్నది. 'స్పేస్' లక్ష్యాలు అక్షరాస్యతను, నిరంతరవిద్యను పెంపొందించే క్షేత్రస్థాయి కార్యక్రమాలెన్నో కలిగివున్నాయి.

  • అక్షరాస్యత, నిరంతర విద్యకు సంబంధించిన విద్యావనరుల అభివృద్ధి, క్షేత్ర కార్యక్రమాల నిర్వహణ వ్యవస్థల శిక్షణ మొదలైనవి 'స్పేస్' సంస్థ ప్రధాన లక్ష్యాలు.
  • అక్షరాస్యత, నిరంతర విద్యల ఆవశ్యకత ప్రచారం.
  • నాణ్యవంతమైన, సమర్థవంతమైన అక్షరాస్యత, నిరంతర విద్యాకార్యక్రమాల అమలుకు దోహదం

చేయడం.

  • కార్యకర్తలకు శిక్షణను ఇవ్వడం.
  • మారుతున్న సామాజిక అవసరాలకు తగ్గవిధంగా అక్షరాస్యత, నిరంతర విద్యా ఏజెన్సీలు, గ్రూపులతో సమన్వయం, సహకారం.
  • అక్షరాస్యతారంగంలో ఒక సమన్వయ కేంద్రం (నోడల్ ఏజెన్సీ) గా పనిచేయడం.
  • అక్షరాస్యత, నిరంతర విద్యారంగంలో ఒక సలహాకేంద్రంగా వ్యవహరించడం.
  • అక్షరాస్యత, నిరంతర విద్యల రంగంలో 'పరిశోధన-అభివృద్ధి' విషయాల్లో క్రియాశీలపాత్రను

నిర్వహించడం.

డా॥ సామల రమేష్ బాబు అధ్యక్షులు | తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015 ఆచార్య పి. పూర్ణచంద్రరావు కార్యదర్శి 29