Jump to content

పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వేషధారణ కార్లె శిల్పాలతో సరితూగుతోంది. స్త్రీమూర్తుల విషయానికి వస్తే.. నాజూకుతనాన్ని పుచ్చు కున్నాయి. ప్రతి ఒక్కరి తలకట్టూ భిన్నంగా ఉంది. కొందరు కొప్పు కట్టుకొన్నారు. కొందరు అలాగే విడిచిపెట్టారు. మరికొందరు మొఖంపైకి కొప్పువచ్చేలా అలంకరించుకొన్నారు.. కాళ్లు కడియాల సంఖ్య కార్లెతో పోలిస్తే పెరిగిపోయింది. అనాడు కూర్చోవడానికి రకరకాలు ఉన్నట్టుగా ఈ శిల్పాలను చూస్తే తెలుస్తోంది. అలాగే వీరు తమతోపాటు తమ జంతువులను కూడా అలంకరించారు. గుర్రాలను.. ఏనుగులను.. చక్కటి పూసల దండలతో అలంకరించే వారని అమరావతి రాతి ఫలకాలను విశ్లేషిస్తే అర్ధం అవుతోంది.

మన పూర్వీకుల ఇళ్లు ఎలా ఉండేవి? ఆనాటి సమాజం ఎలా ఉండేది? ఈ వివరాలను అమరావతి స్థూపంలో దొరికిన ఈ శిల్పఫలకం అందిస్తోంది. ఈ శిల్పఫలకం కోల్ కత్తా లోని ఇండియన్ మ్యూజియంలో భద్రపరచారు. ఇందులో ఓ భార్యాభర్తా తమకు పుట్టిన కవల పిల్లల్ని గుర్రాల మీద వెళుతుంటే మరికొంత మంది ఏనుగుల మీద ఎక్కి ఎక్కడికో వెళుతున్నారు. ఇవన్నీ జాతక కథల ఆధారంగా రూపొందించిన శిల్పాలే.

అజంతాచిత్రాలు

ఇక అజంతా చిత్రాలలో మన వాళ్ల గురించి తెలుసుకుందాం. అజంతాలోని 9,10 గుహలు తొలినాటివి.. వీటిని శాతవాహనుల కాలంలో తొలిచారు. చిత్రాలను వేశారు, శిల్పాలు చెక్కారు.. ఈ గుహల పూర్ణకుంభాలు కూడా ఇక్కడ కన్పిస్తాయి.. గుహలోపల పెయింటింగ్లు కాలం పెట్టిన పరీక్షలో క్రమంగా ఓడిపోతున్నాయి.. ఇవి గుర్తించడానికి వీలు లేకుండా ఛిద్రమవుతున్నాయి. కానీ ఈ పెయింటింగ్ రెప్లికాలు పొత్తిళ్లలో పొదిగి పట్టుకుని ఉన్నారు. తమ పాపాయిలని వస్త్రాలలో బయట ఉన్న శిల్పాలతో అమరావతి శిల్పాన్ని పోల్చుకోవచ్చు. చుట్టగా, మిగిలిన వస్త్రం చేతుల మధ్యలోంచి కిందకు జారుతోంది. మరో చోట ఓ భార్య తన భర్త భోజనం చేస్తుంటే, ఎదురుగా కూర్చుని విసనకర్ర విసురుతోంది. ఇందులో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆనాటి ఇళ్లు కూడా ఈ శిల్పంలో కన్పిస్తున్నాయి. రెండూ గుడిసెల్లాగానే ఉన్నాయి. గడ్డితో కప్పువేశారు. ఒక కప్పేమో త్రిభుజాకారంలో ఉంటే, మరొకటి అర్ధచంద్రాకారంలో ఉంది. ఓ వ్యాపారి గుర్రం మీద ఎక్కడికో బయల్దేరి వెళుతున్నాడు.

సాంచి ద్వారతోరణం :

మధ్యప్రదేశ్లోని సాంచి స్థూపానికి ద్వారతోరణాలను శాతవాహన శిల్పులే నిర్మించారన్నది చరిత్ర తేల్చిన సత్యం. ఒక్కొక్క ద్వారం 34. అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ద్వారాల మీది శిల్పాలు కూడా ఆనాటి సమాజాన్ని విశదంగా కళ్లముందు ఉంచుతాయి. ఉత్తర ద్వారంలోని ఓ శిల్పఫలకాన్ని పరిశీలిద్దాం. తమ గుడిసె ముందు ఓ భార్యా భర్తా చలిమంట కాచుకుంటున్నారు. ఓ పిల్లాడు గుర్రానికి గడ్డి తినిపిస్తున్నారు. మరో ఇంటి ముందేమో భార్యాభర్తలిద్దరూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓ మహిళేమో నెత్తిమీద పళ్ల గంపను పెట్టుకుని బయల్దేరింది. ఇద్దరు వ్యాపారులు భరణాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. కొంతమంది హైదరాబాద్లోని స్టేట్ మ్యూజియంలో ఉన్నాయి. వీటిని చూసి ఆనాటి మన పూర్వీకులను పోల్చుకోవచ్చు. పురుషులందరూ తలపాగాలు పెట్టుకున్నారు. రాజులు కాకుండా సామాన్య పురుషులు పైన చొక్కాల్లాంటివి ధరించడం విశేషం. వీరు నడుము చుట్టూ కండువాలను కట్టుకున్నారు. రాజులు కంఠాభరణాలను వేసుకున్నారు.

స్త్రీలేమో రకరకాల తలకట్టులు.. నగలు.. కంకణాలు.. కడియాలు.. చక్కటి అలంకరణకు ప్రసిద్ధిచెందిన వారిలో కన్పిస్తున్నారు. రాజులు కూర్చునే ఆసనాలు, రాణులు కూర్చునే ఆసనాల డిజైనింగ్ వేరుగా ఉంది. విసనకర్రల్లో కూడా విభిన్నత కన్పిస్తోంది.

ఇలా ఈ శిల్పాలను.. చిత్రాలను విశ్లేషిస్తే మన పూర్వీకులది వ్యవసాయ ప్రధానమైన సమాజం, వర్తకానికి ప్రాధాన్యం ఇచ్చారు.. కళాకారులకూ కొదవలేదు. అన్ని వృత్తుల వాళ్లూ సామరస్యంగా సహజీవనం సాగిస్తున్నట్టు అర్థమవుతోంది. ఆనాటి మన తాత ముత్తాతల జీవన విధానం గురించి లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. రచయిత ఫోన్ : 09441829339 తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015