Jump to content

పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నప్పటికీ, అవి తిరిగి సహజ భాషల అభివృద్ధికి దోహదం చేస్తాయి. సహజ భాషలకు సామాన్య ప్రజలు కర్తలయితే కృతక భాషలకు మేధావులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, సాహిత్యవేత్తలు ప్రధాన కారకులు. సహజ, కృతక భాషలు రెండూ సమాజాభివృద్ధికి అవసరమే. రెండు భాషలూ ప్రజల భాషటీ, సహజ, కృతర భాషల్ని అంశీభూతాలుగా ఉన్న వ్యవస్థగా మాత్రమే భాషను అర్ధం చేసుకోవాలి. అంతేగాని, కేవలం వ్యవహారిక భాషమాత్రమే ప్రజలభాషగా అర్థం చేసుకోవడం అశాస్త్రీయం. ఒక భాష అభివృద్ధి చెందడం, సుస్థిరంగా ఉండడం అంటే ఎంతమంది ఈ భాషలో మాట్లాడుతున్నారన్నది ప్రమాణం కాదు. ఒక భాషలోని సహజ భాష, కృతక భాష అంశీభూతాలు ఏ మేరకు తగురీతిలో అభివృద్ధి చెందాయన్నది అసలు విషయం. ఒక భాషలోని ఈ రెండు అంశీభూతాల సంతులిత అభివృద్ధి కుంటుపడితే అది గిడసబారి, జీవ లక్షణం కోల్పోయి ప్రజల సాంస్కృతిక, వైజ్ఞానిక అవసరాలను తీర్చడంలో నిరుపయోగ మవుతుంది. దాంతో క్రమంగా అది పరాయికరణ పొంది, అంతరించే దిశగా ప్రయాణిస్తుంది లేదా అవశేషంగా కొనసాగుతుంది. ఈ పరిస్థితి సదరు భాషాజాతీయుల అస్తిత్వాన్ని అంతర్జానం చేస్తుంది. ఈ నేపథ్యంలో భాషోద్యమకారులు తెలుగు భాష అంతరిస్తుందని ఆందోళన చెందడం సమంజసమే. ఇప్పటికే ఆక్రమం ఆందోళనకరస్థాయి చేరుకుంది. తెలుగు పత్రికల, సాహిత్య పాఠకులసంఖ్య పెరుగుతున్నా మీడియాలో తెలుగుభాష పత్రికల, సాహిత్య పాఠకులసంఖ్య పెరుగుతున్నా మీడియాలో తెలుగుభాష దుస్థితిచూస్తే తెలుగు అంతరించిపోవడానికి అద్దం పడుతుంది.

తెలుగు సాహిత్యంలో ప్రబలంగా కొనసాగుతున్న అస్తిత్వవాద ఉద్యను శ్రేణులు కవిత్వంలోకి, కాల్పనిక సాహిత్యంలోకి అనేక ప్రాంత, వృత్తి కుల మాండలికాలను తీసుకువచ్చి, భాషను సుసంపన్నం చేసారన్న వాడనా ఉంది. అట్టడుగు వృత్తి శ్రేణుల నుంచి కాక, ఉన్నత మధ్యతరగతి ఉద్యోగ శ్రేణుల నుంచి వచ్చిన అస్తిత్వవాద రచయితలు వివిధ మాండలికాల్ని ఇంగ్లీషు భాషా భేషజంతో కలిపిన పదజాలాన్ని వినియోగించారు. తెలుగు భాష పట్ల అభిమానంతో గాని, అభివృద్ధి లక్ష్యంతోగాని రచనలు చేయలేదు. దానికితోడు చాలమంది అస్తిత్వవాద రచయితలకు తెలుగు భాష కంటే ఆంగ్ల భాష పైనే అభిమానం ఎక్కువ. 'ఇంగ్లీషు భాష పులిపాల వంటిది, దాన్ని ఈ దేశంలోని దళితులందరూ స్వీకరించాలి. ఇంగ్లీషు పులిపాలు తాగిన వారిలో నూతన స్ఫూర్తిని, తెలివిని పెంచుతుంది' అని అంబేడ్కర్ 1920 ఫిబ్రవరిలో 'మూకానాయక్' పత్రికలో ఇచ్చిన పిలుపును చాలామంది అస్తిత్వవాదులు స్థల, కాలాలను పరిగణించకుండా బలంగా విశ్వసించి ప్రచారం చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ విద్యా సంస్కరణవేత్త విష్ణు శాస్త్రి చిప్లుంకర్, మహాదేవ్ గోవింద్ రణడే, గోపాలకృష్ణ గోఖలే, బాల గంగాధర్ తిలక్ వంటి జాతీయోద్యమ నాయకులు సైతం ఆంగ్ల భాషను 'పులి పాల'తో పోల్చుతూ, ప్రజలు దాన్ని నేర్చుకోవాలని నొక్కి చెప్పారు. అయితే ఆనాడు జాతీయోద్యమానికి నాయకత్వం వహిస్తున్న గాంధీ బ్రిటిష్ సామ్రాజ్య వాడాన్ని నిరసిస్తూ ఆంగ్ల భాషను 'సాంస్కృతిక సామ్రాజ్యవాదంగా అభివర్ణిస్తూ, బాల్యంలో తొలినాళ్ళలో 'తల్లి భాష'ను నేర్చుకోవడం అంటే బిడ్డకు 'తల్లి పాలు' తాగితే కలిగే ఆరోగ్యంతో పోల్చారు. పోలికలన్నీ కుంటివే... ఏదైనా ఒక లోతైన విషయాన్ని లేదా జ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకూ పోలికలు సాధనాలు మాత్రమే కానీ, వాటికవే జ్ఞానం కాదు. తల్లి పాలు, పులి పాలు (పోత పాలు) అనే పోలికలు కూడా అంతే. శిశువు శారీరక, మానసిక ఆరోగ్యానికి, వికాసానికి తల్లి పాలు అవసరమైనట్లే, ఆ దశలో చుట్టూతా ఉన్న ప్రపంచానికి సంబంధించిన ప్రాథమిక జ్ఞానాన్ని ఏర్పరచుకుంటున్న ప్రాథమిక విద్య దశలో తల్లి భాష అంతే కీలకమైనది. మనిషి తల్లి పాలు అవసరంలేని తర్వాతి దశలో ఎలాగైతే పోతపాలు (పులి పాలు) శారీరక ధృఢత్వానికి సహకరి స్తాయో అలాగే ఇంగ్లీషు తదితర భాషలు వంటబడతాయి. తల్లిపాలు, పులి పాలు వంటి భావనలు రెండూ వివిధ సందర్భాలను బట్టి సరైనవే. అయితే భారతీయ సాంఘిక వ్యవస్థలోని సమస్యలకు "మృదువైన హిందుత్వ దృక్పథంతో పరిష్కారాలను సూచించిన గాంధీకి వ్యతిరేకంగా సమూల సాంఘిక మార్పు కోసం డిమాండ్ చేసిన అంబేడ్కర్ స్థానిక మాతృ భాషల నుడికారాల్లోని వర్ణ తత్వాన్ని ధిక్కరించే క్రమంలో అంగ్ల భాషను ప్రోత్సహించారు. అయితే ఆ తర్వాత తల్లి భాషలో విద్యనభ్య సించడం వల్ల మేధో వికాసం ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా అనేక విద్యావైజ్ఞానిక ఆవిష్కరణలు, అధ్యయనాలు ధృవీకరిస్తున్నాయి. కత్తి పద్మారావు వంటి కొద్ది మంది దళిత మేధావులు మాత్రమే తల్లిభాష అవసరాన్ని శాస్త్రీయంగా గుర్తించారు. అదీ కాక అసంఖ్యాక మధ్యతరగతి, చదువులు తల్లి భాషను దెబ్బ తీయగల శక్తిమంతమైనవి కావు. అందునల్ల బడుగు వర్గాల విద్యార్థులు చదువుతున్న ఆంగ్ల మాధ్యమ పాఠశాల భాషోద్యమకారులు పడుతున్న అవేదన, నివేదనలు అర్ధరహితమైనవి. కేవలం గుండెలు బాదుకునే చర్యలు మాత్రమేనని కొందరు ఆంగ్లభాషా సమర్థకుల వాదన. తెలుగు భాష అంతరించిపోతోందని ప్రచారం చేయడం, అందుకు ఉద్యమించడం అనేది ప్రజల ఆకాంక్షలను పక్కదారి పట్టించి తమ ఆధిపత్య స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు అగ్రవర్ణ మేధావులు, సీమాంధ్ర పాలక మేధావుల కుట్ర అనే ఆరోపణలు ముందు కొచ్చాయి. దానికి తోడు ఉపాధి కోసం ఆంగ్ల మాధ్యమంలో శోచనీయం అనే విమర్శలు వచ్చాయి. భాషోద్యమకారులు, అభిమానులు · తల్లిభాష అవసరాన్ని శాస్త్రీయంగా కాక ప్రధానంగా భావోద్వేగంతో చేసిన విశ్లేషణ విమర్శకుల వాదనను పూర్వపక్షం చేయలేకపోయింది. తల్లిభాషా మాధ్యమ అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో భాషోద్యమం సఫలం కాకపోవడం దురదృష్టకరం. చదవవలసిన అవసరాన్ని భాషోద్యమకారులు గుర్తించకపోవడం

సామాజికాభివృద్ధితో తెలుగు భాషాభివృద్ధి ముడిపడి ఉంటుంది. అందుకు అనుగుణంగా సహజ, కృతక భాషల అభివృద్ధికి దోహదం చేసే భాషా విధానం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా వాడుకలో లేని తెలుగు పదాలను వివిధ భాషా అవసరాలకు వినియోగించే పరభాషా పదాలకు ప్రత్యామ్నాయంగా వినియోగించేం దుకు జరిగే ప్రయత్నాలు, అలాంటి డిమాండు మౌలిక పరిష్కారం కాదు. అదే సమయంలో తెలుగు భాషకు సంబంధించి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక అత్యున్నత వ్యవస్థను ఏర్పరచి, భాషా వ్యవహారాలను పరిష్కరించేందుకు, ఆధునిక అవసరాలకు అనుగుణంగా కొత్త పరిభాషను సూచించేందుకు, మాండలికాలతో సహా తెలుగు పదజాల నిఘంటువును తయారు చేసే ప్రయత్నం కూడా తెలుగు భాషాణాతి భాషాసమస్యను మౌలికంగా పరిష్కరించలేదు. భాషలోని వివిధ మాండలికాల మధ్య అంతర్గత ప్రజాస్వామ్యం పునాదిగా వివిధ ప్రపంచ భాషల నుంచి ఆదాన ప్రదానాలు చేపట్టే విధమైన తెలుగు భాషా విధానం అమలులోకి రావాలి. అందుకు అనుగుణమైన సామాజిక, రాజకీయార్థిక విధానాన్ని అమలు చేసే పాలకులతో కూడిన సామాజిక వ్యవస్థ తప్పనిసరి. కుల, వర్గ, ప్రాంత, లింగ అస్తిత్వాలకు అతీతంగా తెలుగు భాషోద్యమం వికసించాలి. ఇందుకు కేవలం భావోద్వేగం మాత్రమే చాలదు. రచయిత ఫోన్ : 09441829339 26 తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015