కూర్చోబెట్టి, మంచి చెడ్డలు చూసి, అప్పుడు “ఓ బ్రాహ్మణా! నాకొచ్చిన కావ్యలన్నీ అక్కడే, అప్పుడే పందేశాను, ఇప్పుడు నాదగ్గర ఏమీ లేదు. నన్ను మన్నించు" అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు.
“నేను అడిగినది ఇవ్వలేదు. కాబట్టి ఈనాటి నుండి ఏడోరోజున నీ తల ఏడు పక్కలుగా పగిలిపోతుంది" అని తిట్టి, వెళ్ళిపోతాడు.
దానితో బావరికి మనేద (దిగులు) పట్టుకుంది. తెగ బాధపడి పోతాడు. తిండి కూడా మానేస్తాడు. బక్కచిక్కిపోతాడు. ఆ విషయం తెలిసిన ఒక వ్యక్తి వచ్చి 'బావరీ! ఆ బ్రాహ్మణుడు కపటి. పచ్చి మోసగాడు. డబ్బు యావ కలవాడు. వాడికి 'తల' గురించి కానీ, 'తల పగలడం' గురించి కానీ ఏమీ తెలియదు,” అంటాడు.
'తల' అంటే ఏమిటో? 'తలపగలడం' అంటే ఏమిటో చెప్పగలరా?” అని అడిగాడు బావరి.
“నాకూ తెలియదు ఈ విషయం తెలిసిన జ్ఞాని, సంబోధిని పొందిన బుద్ధుడు ఒక్కడే! ఆయన ఇప్పుడు శ్రావస్తిలో ఉన్నాడు" అని చెప్తాడు ఆ వ్యక్తి.
‘బుద్ధుడు', 'సంబోధి' అనే మాటలు వినగానే బావరి సంతోష పడతాడు.
ఆయన తన శిష్యుల్ని పిలిచి
"నాయనలారా! ఇలారండి! సంబోధిని (జ్ఞానం) పొందిన ఒక వ్యక్తి శ్రావస్తిలో ఉన్నాడట. మీరు వెళ్ళి ఈ 'తల' గురించి, 'తల పగలడం' గురించి వివరాలు తెలుసుకురండి" అని చెప్పి, ఆ పదహారు మందినీ పంపుతాడు.
అక్కడి నుండి ఆ జటాధారులు (జుట్టు జడలు జడలుగా అట్ట కట్టుకు పోయిన మునులు) ఉత్తరదిక్కుగా బయలుదేరి, పతిట్టానం (ప్రతిష్టానం), ఉజ్జయిని, వెదిన (విదిశా), కోసంబి (కోశాంబి) కపిలవస్తు, కుసినగర, వైసాలి (వైశాలి) మీదుగా మగధరాజధాని దగ్గర ఉన్న పాసాణక చేతియ (పాషాణ చైత్యం) చేరారు. అక్కడ బుద్ధుణ్ణి కలుసుకొని, నమస్కరించి, తమ వివరాలు తెలిపి, 'తల' గురించి, 'తలపగలడం' గురించి అడుగుతారు.
దానికి బుద్ధుడు “తల అంటే అవిద్యే (తెలియని తనమే). శ్రద్ధతో, వీర్యంతో విద్య నేర్వడమే 'తల పగలడం' అని చెప్తాడు. అంటే అవిద్యను వగలగొట్టడమే తలను పగులగొట్టడం అన్నమాట. అంటే.. యజ్ఞయాగాలు చేయడం వల్ల ముక్తిరాదు. జ్ఞానం కలగదు. అవిద్యను తొలగించుకోవడం వల్లే సమ్యక్ జ్ఞానం (సరైన జ్ఞానం, లేదా సరైన తెలివి) కలుగుతుందని దీనర్థం. అలా అ పదహారు మంది బుద్ధుని దగ్గరకు వెళ్లి ఆయన ఉపదేశం విని, ఆయన అనుయాయలుగా మారి పోతారు. అట్లా వెళ్లిన ఆ పదహారు మందిలో పదిహేను మంది అక్కడే ఉండిపోగా, వయస్సులో వారందరికంటే పెద్దవాడైన "సింగియుడు” అనేవాడు తిరిగి వచ్చి, బుద్ధుని బోధనల సారాంశాన్ని బావరికి చెప్తాడు. ఆ బోధనల సారాంశం తెలుసుకున్న బావరి మనేద తగ్గుతుంది. ఆ తర్వాత వారిద్దరూ ఆ గోదావరీ తీర ప్రదేశాల్లో బుద్ధుని బోధనలు వెల్లడిచేస్తూ గడిపారు.
ఈ కధ బౌద్ధ సాహిత్యంలోని 'సుత్తనిపాత'లో ఉంది. బౌద్ధ సాహిత్యంలోని అతిపురాతన గ్రంథం ఇది. ఈ 'సుత్త నిపాత' లోని అఖరివర్గం 'పారాయణవర్గం. బావరి 16 మంది శిష్యులు బుద్ధునితో జరిపిన సంభాషణలే ఈ పారాయన వగ్గ (పారాయణ వర్గం). ఈ
పాట
అడుగడుగూ బౌద్ధమే పల్లవి : అడుగడుగు బౌద్ధమే - తెలుగు మాగాణిలో అణువణువు బౌద్ధమే - మన జీవనాడిలో ॥ అడుగడుగు|| చరణం : పలికింది స్వాగతం - బావరీ మునిగణం తొలి బీజమేసింది - అస్సక గణ జనం చూపింది రాదారి · గలగలల గోదారి బౌద్ధమే కిష్ణమ్మ - మారు పేరుగ మారె ॥అడుగడుగు|| చరణం: శరణు గీతిక పాడె కోటిలింగాల పంచశీల శాల - - మన ఘంటసాల చతుర్యసత్యాల - గుంటుపల్లి అష్టాంగపడి - నేలకొండపల్లీ చరణం : బోధి దమ్మం నడిచె - బొజ్జన్నకొండలో జ్ఞాన జ్యోతులు వెలిగె - ఆదుర్రులో శాలిహుండం బోధి - ధ్యాన భాండం భట్టిప్రోలే బుద్ద - ధర్మదీపం ||అడుగడుగు|| ||అడుగడుగు|| చరణం : నాగార్జున కొండ గుండె లోగిలిలో తొట్లకొండ, బావికొండ గుండియలో అమరావతీ నగర - నడివీధిలో నందలూరు, చందవరము ముంగిటిలో సంఘమే వెలసింది - దమ్మమే నడచింది తెలుగమ్మ తనువంత పులకరించింది ॥అడుగడుగు|| చరణం : చైత్యాలు, స్థూపాలు - గుహలు, ఆరామాలు తెలుగు నేలంతటా వెలుగులే నింపాయి ఈ జ్ఞాన కాంతులే - దిగంతాలకు చేరి ధ్యాన జ్యోతిగ మారె-భువిని కాంచీపురి ॥అడుగడుగు|| - బొర్రా గోవర్ధన్ - నగరం, రేపల్లె, ఫోన్: 09390600157 పదహారుమంది కొన్ని ప్రశ్నలు బుద్ధుణ్ణి అడుగుతారు. బుద్ధుడు ఆ ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తాడు. ఈ ప్రశ్నలు - సమాధానాలే ఈ పారాయణ దగ్గలో ఉన్నాయి. ఆ పదహారు మంది పేరున పదహారు విభాగాలు ఉన్నాయి. ఆ పదహారు మంది పేర్లు ఇవి : 1. అజితుడు 2. తిస్సమెత్తెయ్య. 3. పుణ్ణకుడు 4. మెత్తగుడు 5. ధోతకుడు 6. ఉపసివుడు 7. నందుడు 8. హేమకుడు 9. తొదెయ్యుడు 10. కప్పడు 11. జతుకణ్ణి 12. భద్రావుధుడు 13. ఉదయుడు 14. పోసాలుడు 15. మోఘరాజు 16. పింగియుడు.
అంటే... బుద్ధుని కాలంలోనే బావరితో కలిసి మొత్తం పదిహేడు మంది బౌద్ధదీక్ష తీసుకున్నారన్నమాట.
తెలుగు నేల మీద బౌద్ధం వేసిన తొలి అడుగులకు ఆనవాలు ఈ పారాయణ వగ్గ . అందుకే బౌద్ధ ధమ్మ రాదారి.... మన గలగలల గోదారి. (తర్వాత.... వచ్చేసంచికలో...) 22 తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015