Jump to content

పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చరిత్ర తెలుగమ్మ ఒడిలో బౌద్ధం

బుద్ధుడు పుట్టింది నేపాల్లోని లుంబినీ వనంలో, బౌద్ధం మొలకెత్తింది. బీహార్ లోని బుద్ధగయలో, బౌద్ధం మూడు పూలు అరు కాయలుగా పెంపొందింది మన తెలుగు నేలలో

ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా మన తెలుగునేలపై ఒకప్పుడు బౌద్ధం నడయాడింది. ఆ ఆనవాళ్ళను మన తెలుగు నేల తన పొర పొరలో దాచుకుంది. ఇక్కడి నేలను తవ్వితే మణులు మాణిక్యాలతోపాటు, అంతకంటే కోటిరెట్లు విలువైన చరిత్ర మణులు వెలికివస్తాయి. వేల బౌద్ధస్థూపాలు, ఆరామాలు, విహారాలు, విద్యాలయాలు బైటపడతాయి. అలా బైటపడిన ఒక్కొక్కటి ఒక్కొక్క చరిత్రను మనముందుంచుతుంది. మన గొప్పతనాన్ని చాటుతుంది.

అసలు బౌద్ధానికే కాదు మానవజాతి నాగరకతకు కూడా భరతఖందంలో మన తెలుగు నేల పుట్టిల్లు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదుల చుట్టుప్రక్కల ప్రాంతాలు కోట్ల ఏళ్ళనాటి భూపరిణామ చరిత్రను తెలియజేస్తాయి.

మన తెలుగు నేల అతి పురాతన కాలం నుండే చరిత్రగతిలో ముందు వరసలో ఉండటానికి కారణం భౌగోళికంగా ఆ నేలతీరు. తెలుగునేల తీరే ప్రత్యేకమైంది. నిజానికి మన భరతదేశం భౌగోళికంగా 'ఎడారి' ప్రాంతం కావాలి. కానీ ఉత్తరాన ఉన్న హిమాలయాలు, దక్షిణాన ఉన్న హిందూ మహాసముద్రం వల్ల ఆయా ఋతువుల్లో ఏర్పడిన ఋతుపవనాలు వృధాగా పోకుండా జడివానలు కురిపించి, ఎడారిగా మారాల్సిన నేలను పచ్చదనంతో నింపేశాయి. ఈ ఋతుపవన వానల వల్ల పుట్టిన నదులే కృష్ణ, గోదావరి నదులు, ఇంకా కావేరీ పినాకినీ, తుంగభద్ర లాంటి చిన్నచిన్న నదులు చాలా ఉన్నా ఈ రెండు నదులే పొడవైనవి కాబట్టి, వీటి పరిసరాలన్నీ విశాలంగా విస్తారంగా పంటభూములయ్యాయి. పచ్చదనమే జీవులకు 'జీవం' కాబట్టి, అన్నియుగాల్లో ఈ ప్రాంతంలో జీవుల మనుగడ కొనసాగింది. - అలాగే వ్యవసాయానికి పుట్టిల్లు అయ్యింది. ఈ వ్యవసాయం మనిషిని దేశదిమ్మరిగా తిప్పక, ఒక్క చోటి బ్రతికి నిలకడ బతుకులు ఏర్పాటు చేస్తుంది. మనుషులు ఇలా ఒకే చోట ఎన్నోవేల ఏళ్లుగా కదలకుండా బ్రతికే వీలు ఉంది కాబట్టి, ఈ ప్రాంతం అతిపురాతన కాలం నుండి మన నాగరకతలకు తొలి ఆనవాళ్లుగా నిలిచింది.

నాగరకత అంటేనే, మనిషి జీవించే తీరు. మనిషి జీవనంలో మెలకువలు, భాష, శాస్త్రం, చిత్రలేఖనం, శిల్పకళ, వ్యవసాయం, ఇళ్ళు, రహదారుల నిర్మాణం, చదువు, వేషధారణ ఇవన్నీ నాగరకతను తెలిపేవే. ఈ అన్నింటి విషయంలో మన తెలుగు నేల ఎప్పుడూ వెనక పడి లేదు. వెనక పడ లేదు. చరిత్ర ప్రతి మలుపులో దాని ప్రత్యేకతను అది చాటుకుంటూనే ఉంది.

అలాగే... బౌద్ధం విషయంలో కూడా. బౌద్ధం పుట్టింది ఎక్కడైనా.... పెరిగింది ఇక్కడే. అనేక శాఖలుగా విస్తరించిన బౌద్ధంలో ఎన్నో శాఖలు ఇక్కడి నుండి పుట్టినవే. మహాభారతంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. అలాగే బౌద్ధ దర్శనంలో తెలుగు తత్వవేత్తల ముద్ర బలీయంగా ఉంది. - - బొర్రా గోవర్ధన్

బౌద్ధంలోని మహాయాన, వజ్రయాన సంప్రదాయాలు పుట్టింది ఈ నేల మీదే. ఇక్కడ పుట్టిన ఈ బౌద్ధ సంప్రదాయాలే ఈనాడు ప్రపంచ వ్యాపితంగా వర్ధిల్లుతున్నాయి. ఇలాచూస్తే బౌద్ధం జీవగర్ర మన తెలుగు నేల అనడం, అనుకోవడం మెరమెచ్చులు కాదు. ప్రపంచంలో అతి పురాతన అతి పెద్ద విశ్వవిద్యాలయాల్లో రెండింటిని (అమరావతి, నాగార్జున కొండ) ఈనేల మీదే నెలకొల్పారు బౌద్ధులు,

ఒక సమయంలో దేశ విదేశాల నుండి వేలాది మంది ఇక్కడకొచ్చి చదువుకొనేవారు. అలాగే.. శిల్పకళలో కొత్త రీతులు, నిర్మాణ కళలో కొత్త కొత్త వరవడులు బౌద్ధుల ప్రభావం వల్లే ఇక్కడ పుట్టుకొచ్చాయి.

ఇలా.. అన్ని రంగాల్లో బౌద్ధం ఈ నేల మీద వేలాది ఏళ్లుగా వేళ్లూనుకు పోయింది. ఆ వైభవం ఈనాడు ఈ నేల తన ప్రతి అడుగడుగునా తేట తెల్లం చేస్తుంది. ఆ నేలతల్లి గుండె గూడు లోకి కొద్దిగా తొంగిచూద్దాం.

మన తెలుగు నేల మీద బౌద్ధం తీరుతెన్నుల్ని కొద్దిగా చూద్దాం. తొలి ఆనవాళ్ళు :

ఇప్పటికి దాదాపుగా రెండువేల ఐదువందల ఏళ్ళనాడే - అంటే బుద్ధుడు జీవించి ఉన్ననాడే బౌద్ధం ఇక్కడకు చేరింది. బావరి అనే ఒక ముని, అతని శిష్యుల మూలంగా ఈ తెలుగు తీరానికి వచ్చింది.

బుద్ధుని కాలంలో గోదావరి తీరాన అస్సక రాజ్యం ఉండేది. 'అస్సక' అంటే అస్మక, అశ్మక అని. ఇది ఈనాటి నిజామాబాద్ చుట్టు ప్రక్కల ప్రాంతం. ఈ అస్సక రాజ్యంలో ముళక ప్రాంతం ఉంది. ఇది ఈ నాటి బోధన్ (బోధన 7, బుద్ధాన?) ఇక్కడ గోదావరి నది ఒడ్డున బావరి ముని ఆశ్రమం ఉండేది. ఈయన ఉంఛవృత్తి పరిగ ఏరుకోవడం) మీద - అంటే మిగిలిపోయిన, విడిచిపోయిన వాటిని సేకరించుకుంటూ, అలాగే రాలిన పండ్లూ, కాయలూ ఏరుకొని తింటూ జీవిస్తూ ఉండేవాడు. ఆ నది ఒడ్డున ఒక పెద్ద ఊరు ఉంది. ఆ ఊళ్ళో తనకి కానుకగా వచ్చిన డబ్బుతో ఒక యజ్ఞం చేస్తాడు బావరి. ఆ పని పూర్తయాక, తన ఆశ్రమానికి తిరిగి వెళ్తాడు. అప్పుడు ఆయన వెనుకే ఒక బ్రాహ్మణుడు వెళ్ళి 'ఓ ఐదువందల నాణేలు ఇవ్వమని అడుగుతాడు. బావరి అతణ్ణి 21 తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015