Jump to content

పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

13. రాజయోగి వసంతయ్య (20నూరేడు), చిలకలనేర్పు : సుజన మనోరంజని

14. చంద్రశేకరశాస్త్రి (1890) బైనగానిపల్లి : శృంగార స్తోత్రమనే అనురుకాన్ని తెలుగులోకి, మనుచరిత్రను కన్నడంలోకి

15. అప్పాశాస్త్రి (20నూ), బైరగానపల్లి : శంకరాచార్యుల ఆనందలహరిని తెలుగులోకి

16 దేవరకొండ శామబట్టు (1.8నూ), కోటగల్లు: రాగనేశ్వర స్తోత్రము, మైరావణ, నళ చరిత్ర హరికతలు, నృకేసరి శతకము

17. యోగి నారాయణ తాతగారు (1726-1836), కైవారం : 160పైగా తత్త్వ సంకీర్తనలు, తారకబ్రహ్మానంద ద్వయకంద శతరము, విను బాత్మ నారాయణ కవి కంద శతకము, బ్రహ్మాండపురి శతకము, అమరనారేయణ శతకము, నాదబ్రహ్మానంద నారేయణ శతకము, శ్రీకృష్ణ చరిత తత్త్వామృత యోగసారము, కాలజ్ఞానము

పై వరుసలోని చాలామంది గురించి ఆరుద్రగారు 'సమగ్రాంధ్ర సాహిత్యం'లో చెప్పున్నారు. ఒకరిద్దరు తప్ప మిగిలినవారు అందరూ. తెలుగులో రాసినవారే. ఆ ఒకరిద్దరు కూడా తెలుగుతోపాటు కన్నడంలో రాసినవారు తప్ప, అచ్చంగా కన్నడంలోనే కవిత చెప్పలేదు. అయితే అందరు రాసిందీ పద్యకవిత్వమే. 1940 నాటికి ఈ పద్యకవిత్వం ఆగిపోయింది. 19 వ నూరేడు చివరినుంచీ తెలుగు కన్నడ తమిళుడులలో ఇంగ్లీషు చదువుల వలన కొంగొత్త నానుడి మొదలయింది. నవల, కత అనే కొత్తతీరులో రాత మొదలయింది. ఈ కొత్త నానుడి కోలారు సెవ్వంటెంలో 1940 నుంచి కనబడుతున్నది. అప్పటివరకూ మొత్తం తెలుగులోనే వచ్చిన పద్యకవిత్వం ఆగిపోయి, వచనం మొదలయింది. ఆ వచనం కన్నడంలో మొదలయింది.

మొదలుపెట్టినవారు ఇద్దరు, 1. కె.వి. అయ్యర్ 2. మాస్తి వెంకటేశ అయ్యంగార్. ఈ ఇద్దరూ తమిళులే. ఇద్దరూ కతలను రాసినవారు. అయ్యరు పదికిలోపే రాయగా, అయ్యంగారు కొత్త కన్నడ నానుడికి పెద్ద దోవను ఏర్పరచినారు. 'మాస్తి, కన్నడపు ఆస్తి' అని పేరు గడించినారు. వీరద్దరినీ పక్కన పెడితే, 1975 క్కు వెనకనే కన్నడ కతా నవలా కోలారు సీమలో వెలువడినాయి. 1940 కు వెనుక మొదలయిన కొంగొత్త నానుడిలో ఒక్క నూర్పాలు కూడా తెలుగులో రాలేదు. అంతా కన్నడమే. అడపాదడపా అక్కడా ఇక్కడా తమిళకతలూ కవితలూ కూడా వచ్చినాయి వస్తున్నాయి కానీ తెలుగు ఊనేలేదు. ఉన్నట్లుండి తెలుగు ఎందుకు బిలుకు మారిపోయింది? ఇప్పటికీ పదులు వందల పల్లెల్లో కేళికలూ, యక్షగానాలూ, కోలాటలూ, పండిరిబజనలూ అన్నీ తెలుగులోనే నడుస్తున్నాయి. పల్లె నోళ్లల్లో తెలుగు నిలిచే ఉంది. కానీ రాతలో తెలుగు లేనేలేదు. పాతకోలారు పెవ్వంటెం మొత్తంమీద నాలుగయిదు తెలుగుబడులు కూడా లేవు. ఇళ్ల అరుగులమీద అయ్యవార్ల దగ్గర చదువునేర్చుకున్న తరి వరకూ తెలుగు రాత ఉండి, సర్కారుబడుల రాకతో కనుమరుగు అయిపోయింది.

కవిత

మొగలిపూవంటి... తెలుగు మొగలి పువ్వంటి ఘుమఘుమల తెలుగు మమతానుబంధాలు వెల్లువలు తెలుగు ఏనాటి ఈ మాట ఏనాటిపాట ఎల్లలెరుగని భాష ఉల్లమెరిగిన భాష పైరుపచ్చని భాష పరిమళించే భాష పలుకులో తేనియల్ చిలికేటి భాష గోదారి నదులలో కావ్యమై తెలుగు కృష్ణమ్మ ఝరులతో నాట్యమై తెలుగు పెన్న గలగలలలో వయ్యారి తెలుగు తుంగా తరంగాల తడిసి మురిసింది. సంగీత సాహిత్య సర్వాంధ్ర కళలలో కావేరి తీరాన కాంభోజి తెలుగు కర్పూర గంధాలు కోమలీ లాస్యాలు కన్నెవలపులతోట వన్నెచిన్నెల పేట్ మంచిముత్యపు వాన మించు వెన్నెల వాన కులుకు పలు యాసలతొ కలికి మన తెలుగు వరవల అందగించెడి తెలుగు మలుపు మలుపున మింటి కెగసేటి తెలుగు ॥మొ॥ - డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి బరంపురం, ఫోన్: 08093520819

1953లో ఆంధ్రనాడు ఏర్పడి, 1956 లో కర్నాటక ఏర్పా టయినాక తెలుగురాతకు ఇక్కడ దిక్కులేకుండాపోయింది. ఏదో బావుకోవాలని చీల్చుకొని పోయిన ఆంధ్రులు ఇంట్లో తెలుగునే పట్టించుకోలేదు, ఇంక బయట తెలుగును పట్టించుకొంటారా?

కోలారు సీమ నుంచి వస్తున్న కొంగొత్త కన్నడ నానుడిలో ఎక్కవపాలు తెలుగువాళ్లు రాస్తున్నదే. తెలుగుబడులు ఉండుండి, తెలుగును చదువుకొని ఉంటే తెలుగులోనే రాసుండగలిగేవారు. వారిలో ఆ సొరణను తట్టిలేపే తలవర ఒక్కడైనా పుట్టలేదు ఆంధ్రనాడులో, చివరకు చిత్తూరు, అనంతపురం వాళ్లు కూడా 'కోలారులో తెలుగువాళ్లు ఉండారా' అనేంత గొప్ప నిలవరానికి వచ్చింది తెలుగుజాతి.

తమిళనాడులో 'తెలుగువాణి' చేస్తున్నట్లుగా కర్నాటకలో కూడా పెద్ద ఎత్తున తెలుగునేర్పించే పని మొదలయితే తప్ప, తెలుగు ఇక్కడ ఇంక ఎంతోకాలం మనలేదు. (ఈ కవుల సమాచారం ఇచ్చిన స.రఘునాథ్ గారికి మప్పిదాలతో...) 19 తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015