కోలారుమండలము తెలుఁగుసీమ
అన్ని విధముల కచ్చితమైన తెలుగుప్రాంతమగు కోలారు మండలములో విజయనగర చక్రవర్తుల పరిపాలనా కాలమందు, సంస్కృతాంధ్ర భాషలలో కవిత్వము చెప్పగలిగిన వారు పెక్కుమంది యుండివనుటలో నెట్టి యాశ్చర్యమును లేదు. ఈ మందలము, నేడే కాదు, విజయనగర సామ్రాజ్యము వెలసియుండిన కాలమందే కాదు, మౌర్య, శాతవాహన చక్రవర్తులకాలమందు సయితము తెలుగు ప్రాంతముగా నుండెనని, మైసూరు దేశ చరిత్రలు, మరియు మైసూరు జనాభా నివేదికలు మొదలగువానినుండి తెలియుచున్నది. విజయ నగర సామ్రాజ్య కాలమున, కోలారు మండల ప్రాంతమునకును, దాని పరిసర ప్రదేశములకును, 'ములువాయి' రాజ్యము అనిపేరు. ఇచ్చట నొక రాజ ప్రతినిధి నివాసము చేయుచుండెను. 'ములువాయి' అను నగరమును బట్టియే ఆ రాజ్యమునకు 'ములువాయి రాజ్యము' అను పేరు వచ్చినది. ఈ ములువాయి పురమును కన్నడిగులు 'ముళుబాలు' అని పిలుతురు. ఈ పురమునకు 'శతకవాటపురము' అని పేరుండి నటులగూడ తెలియుచున్నది. ఈ శతకవాటపురము లోని, దేవుళ్ళమీద తెలుగుభాషలో వ్రాసిన పాటలు, పద్యములు నేడు కొన్ని లభించియున్నవి.
సాళువ నరసింహరాయలు, ఆ ముళువాయి రాజ్యములో నుండు, 'టేకల్లు' అనుప్రాంతమునకు, కొంతకాలము పాలకుడుగా నుండెను. సుగుటూరు రాజులు, పాలవేకరి వంశపురాజులు మొదలగు వారు కోలారుమండలములోని, వేర్వేరు భాగములను, 14, 15 మరియు 16వ శతాబ్దములలో పాలించుచుండిరి. ఆ రాజులు విద్యాభిమానులు, కవి పండిత పోషకులు; వారిలో కొందరు కవులుగాను, పండితులుగాను నుండిరి. పాలవేకరి కదిరీపతి 'శుకసప్తతి' యనునొక జీవకళగల కావ్యమును వ్రాసెను, కొఱవి గోపరాజు, ఈమండల మందలి దానికి వీరికవ్రాసిన, సుప్రసిద్ధాంధ్ర పండితులు, కవులు, మరియు విమర్శకులునయిన, శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారిట్లు వ్రాసియున్నారు. "ఈ మృదు మధుర కావ్యమును కవిగారు వ్రాతలో సున్నప్పుడే నాకై వెదకుకొనివచ్చి, వినిపించి నన్ను నిర్హేతుక ప్రణయ గౌరవములందు ముంచియుండిరి. ... వీరి గవనిపల్లి కోలారు. జిల్లాలోనున్నది. కాని, కృష్ణా, గోదావరి జిల్లాలలోలేదు సరిగదా, రాయలసీమలోనైన తలదూర్చుకొను భాగ్యము దానికి లేదు.... పూర్వాంధ్రులకు గాని, పశ్చిమాంధ్రులకు గాని, ఈ ప్రక్క, దృష్టి యింకను పాణినట్లు లేదు. మైసూరు రాజ్యము పూర్తిగా కన్నడ సీను యును. భ్రాంతి బైటివారికున్నది. లోపల వారికి కన్నడసీమ కావలయునను, పేరాసయున్నది. వారి యుదాసీనము, వీరి పట్టుదల రెండును జేరి, ఈ మండల మందలి యించుమించు పదునొకండు లక్షల తెలుగువారి, తెలుగుతనము నానాటికి రూపుమాయుచున్నది. ఇట్లుండగా అక్కడి కవులు, కావ్యములు వెలికి వచ్చుట యెట్లు? ఇట్టియిరుకులో గూడ మా మిత్రులు ఇంతటి సరస ప్రబంధము రచించి ప్రకటించు నుత్సాహమునకు గారణము నాటినుండి నేటివరకు నందవరీక నియోగుల నాడులలో వ్యాపించి నాటుకొన్న కవితాశక్తియే కానీ, ఆంధ్రులు కల్పించి యిచ్చిన యవకాశములును, అనుకూలములును గావు.... చక్కని ధారాళశైలిలో, అచ్చముగు తెలుగు పోకడలతో, ఇంతగొప్ప కావ్యమును రచించు నేర్పును, ఓర్పును, ఈకాల మందేర్పడి యుండుట మైసూరు రాజ్యమందలి ఆంధ్రభాగ మందు ఆంధ్ర సాహిత్య మెంత సార్వజనీనముగా నుండెనో, ఎట్టి పరాయణము గలదిగా నుండెనో స్పష్టముగా చాటుచున్నది....” (చూ. చౌడేశ్వరీ మహత్మ్యము. పీఠిక పుటలు. 1,2) తరతరాలనుండి కోలారు మండలములో, తెలుగు భాష 'వేముగల్లు' అను పట్టణమునకు రాజై యుండిన రాజ వంశము వాడైన సర్వజనీనముగా వ్యాపించియున్నదను పదము సత్యమును శ్రీశర్మగారి మల్లరాజు ఆస్థానకవిగా నుండెను. ఈతడు 'సింహాసన ద్వాత్రింశిక' యను తేనెలు గురియునట్టి, యొక చక్కని జాన్యమును వ్రాసెను. ఈతని కవిత్వము, ఇట్టి కావ్యము లాంధ్రమున నరుదనియు, పండితులు, విమర్శకులు, ఏకగ్రీవముగా పొగడి యున్నారు. ఈ మండలములోని 'రెండటి'యను పురమున పెక్కు మంది సంస్కృతాంధ్రపండితులు, కవులు ఉండిరనియు, వారు పెక్కు గ్రంథములు వ్రాసిరనియు తెలియుచున్నది. ఇటులే కోలారు మండలమున ఎందరో కవులుండిరనియు, వారు తెలుగు భాషలో పెక్కు గ్రంథములు వ్రాసిరనియు తెలియుచున్నది. ఇది, ఆనాటి పరిస్థితి. కాని ఈ మండలము, నేడు తెలుగు సీమలో లేక కన్నడదేశమందున్నది. ఇచ్చట తెలుగు భాషకు ఆదరము కాని, ప్రోత్సాహము కాని లేదు. ఇట్టి, అననుకూల పరిస్థితులలో గూడ తెలుగులో చక్కగను, ధారాళముగను కవిత్వము చెప్పగల, మరియు గ్రంథ రచన చేయగలవారు, నేడు సయితమచ్చట ఉన్నా రనుట ప్రశంసనీయమగు విషయము. కొన్ని సంవత్సరములకు ముందు కోలారు జిల్లాలోని గపనిపల్లి వాస్తవ్యులయిన, శ్రీ గుమ్మరాజు శ్రీరామకవిగారు, శ్రీ చౌడేశ్వరీ మహాత్యము అనునొక పద్య కావ్యమును వ్రాసినారు. ఆ గ్రంథము పెక్కుమంది పండితులచే ప్రశంసింపబడినది.
పై వాక్యములు చక్కగా విశద మొనర్చుచున్నవి. ఇక, ఈ విషయమును గురించి యెవ్వరికిని యేలాటి సంశయ ముండనవసరము లేదని నా మనవి. ఈ సుపరిస్థితినిబట్టి చూచిన, తెలుగు భాష, మూడు పూవు లారుకాయలుగా వర్ధిల్లుచుండిన, రాయల పరిపాలనా కాలములో, కోలారు మండలమందు పెక్కుమంది తెలుగు కవులుండిరనియు, వా రా భాషలో సుద్రంథముల వ్రాసిరనియు నిస్సందేహముగా జెప్పవచ్చును. మృదు మధురముగా కవిత లల్లగల నైపుణ్యము కోలారు మండల కవులకు తరతరాలుగ లభ్యమైన, దైవదత్తమైన శక్తియనియు, మరియు నీమండలము ప్రాచీన కాలమునుండియు, ఆంధ్ర కవిశేఖరులకు కాణాచిగా నుండెననియు జెప్పవచ్చును. ఇట్లు తెలుగుభాష, తెలుగు కవిత సర్వత్ర వ్యాపించియుండిన కోలారు మండలము, ముక్కు తిమ్మన కవికిని, ఆతని పూర్వీకులకును, జన్మభూమిగా నుండెనని తలంచుటలో, మరియు విశ్వసించుటలో తప్పేమియు లేదు అది యొప్పే యని గట్టిగా జెప్పవచ్చును.
(అష్టదిగ్గజ కవి సమాజములో రాయల నాశ్రయించిన తొలికవి ఎవరు? గ్రంథంనుండి, రచయిత: కీ.శే. కె.ఎస్. కోదండరామయ్య, ఎం.ఎ.బి.ఓ. ఎల్.బి.టి., మాజీ శాసనసభ్యులు, హోసూరు) 18 | తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015