"ఇతర రాష్ట్రాల్లో తెలుగు - స.వెం. రమేశ్
తెలుగు కనబడదు - తెలుగు తప్ప వినబడదు
నుదుల పేరుతో నాడుల ఏర్పాటు వలన తెన్నాట బాగా చితికిపోయింది తెలుగునేల కాగా, ఎక్కువ మేలు పొందింది కర్నాటక. అవును, తమిళుల కంటే కూడా పెద్ద తావును కన్నడిగిలు చేజిక్కించుకొన్నారు. తెక్కాణాన అంటే విందెమలలకు కింద ఉండే తెలంగాణ, ఆంధ్ర, కేరళ నాడులలో నూటికి ఎనభైమంది ఒకేనుడిని మాటలాడేవాళ్లూ, మిగిలిన అరవైమంది. పలునుడులును నుడివేవారూ ఉన్నారు. అంటే అవి ఒక్కనుడి నాదులు, తమిళనాడు, కర్నాటకలు మట్టుకు అట్లకాదు, అవి పెక్కునుడినాడులు. అందుకే ఆ నాడులలోని తమిళులకూ కన్నడిగులకూ నుడి తగులం తీండ్రించుకొని ఉంటుంది. కన్నడనేలగా పేరుపడిన ఇప్పటి కన్నాటకను కొంచెం లోతులకు పోయి తరచి చూస్తే ఈ నిక్యం తేటతెల్లమవుతుంది.
వేరే నుడుల మందిని అంతా కన్నడిగులుగానే లెక్కవేస్తూ కన్నడగుంపును పెంచుకొంటూ వస్తుంటే కూడా, 2001 నాటికి ఇప్పటి కర్నాటకలోని కన్నడిగుల లెక్క 65 నూర్పాలును దాటలేదు. పడమటి కడలిదరి అంతా తుళు, కొంకణి నుడులవారి తావు. తూరుపునేల అంతా తెలుగుమయం. అయినా ఇప్పటి కర్నాటకలో తుళు, కొంకణి, కొదవ, ఉర్దూ, మరాటి నుడులకు దక్కిన మేవడిలో ఒకవంతు కూడా తెలుగుకు దక్కలేదు. ఇందుకు పలు కారణాలు ఉన్నా పెద్దది మటుకు ఆంధ్రప్రదేశం ఏర్పాటే. మచ్చుకు కోలారు పెప్వంటెంను గురించి ఈ నాలుగు మాటలనూ వినండి.
పాత కోలారు ఇప్పుడు, కోలారు, చిక్కబళ్లాపుర అనే రెండు పెవ్వంటెములు అయింది. ఈ రెండింటినీ కలిపే ఇక్కడ చెబుతున్నాను. కర్నాటక పటంలో చూడండి, చిత్తూరు పెవ్వంటెంకు ఆనుకొని ఆంద్ర కడుపులోకి చొచ్చుకొని వచ్చుంటుంది కోలారు. గౌరీ బిదనూరు, గుడిబండ, బాగేపల్లి, చిన్నబిల్లాపురం, నీడ్లగట్ట, చింతామణి, శ్రీనివాసపురం, కోలారు, ముళబాగలు, బంగారుపేట, మాలూరు అనే 11 వంటెములు ఉన్నాయి ఇందులో.
నుడినాడులు ఏర్పడేటప్పుడు అంటే 1956 తరిలో కోలారు పెవ్వంటెంలో, తెలుగు 54 నూర్పాలు, కన్నడం 21 నూర్పాలు, తమిళం 12 నూర్పాలు, ఉర్దూ 8 నూర్పాలు, మిగిలినవి 5 నూర్పాలు. మొన్నమొన్నటి వరకూ కన్నడం ఇంటినుడిగా మట్టుకే ఉండేది. ఇల్లు దాటినాక కన్నడిగులు కూడా తెలుగునే నుడువుతుండేవాళ్లు. కోలారులో - తెలుగు కనబడదు, తెలుగు తప్ప వినబడదు - అని పెద్దలమాట. ఇప్పుడిప్పుడు అది తిరగబడుతూ ఉంది. తెలుగు మెల్లగా ఇంటినుండి మట్టుకే అయిపోతున్నది.
Gauribidanur కోలారు జిల్లా Bagepalli Gudibanda Chik Ballapur Sidlaghatta Chintamani Srinivasapur Kolar Mulbagal Malur Bangarpet
కోలారు పెన్వంటిపు నానుడి మెలనను చూస్తే వెప్పడ కలుగుతుంది. తెలుగువాడి పట్టనితనానికి సిగ్గేస్తుంది. ఇప్పటివరకూ దొరికిన ఆనులను పట్టి చూస్తే కోలారు పెన్వంటిపు తొలి కవి నంది. తిమ్మన. రాయలవారి పేరోలగంలోని కవి ఈయన. తిమ్మన గురించి ఆంధ్రులకు చెప్పవలసిన పనిలేదు. పారిజాతాపహరణం అనే కావ్యాన్ని రాసినవాడు కదా. తిమ్మన కోలారు జిల్లాలోని 'నంది' అనే ఊర్లో పుట్టినవాడని కారుపల్లి కోదండ రామయ్య గారు ఆరసి చెప్పినారు. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే కోలారు పెవ్వంటెంపు కవుల వరస ఇదీ....
1. ఆనందకవి, చిన్నబళ్లాపురం : 2. వేదాంతసారము మాుమ్మడి తిమ్మబూపాల (1614-1680), సుగుటూరు కుమారార్జునీయం, సౌందరేశ చరితం, రాజేంద్రచోళ చరితం 3. పాలవేకరి కదిరీపతి (1600), తాడిగోళ్లు : శుకసప్తతి 4. కోడూరు వెంకటాచలకవి (17 నూరేడు), కోడూరు : శివరహస్యం 5. బద్దెవీటి రత్తయ్య (17నూ), సుగుటూరు గణితదీపిక 6. యశస్వీ జోగారావు (1667-1770) సుగుటూరు : యక్షగాన చరిత్ర 7. ముల్లకవి, (1975) హోసూరు శ్రీశైల పండితారాధ్య చరితము 8. పిన్నబయలాచార్య (19నూ), సుగుటూరు గోగూచి చరిత్ర 9. కొమర్ల రామచంద్రయ్య (19-20నూ), చింతామణి సుకర్మనీతి చింతామణి 10. తోర్లబయ్యారెడ్డి (19–20నూ), తార్లవారిపల్లి పద్మావతీ శ్రీనివాసం 11. గుమ్మరాజకవి (19-20నూ), చౌడేశ్వరి మహాత్మ్యం, అశృదార, సంగ్రహ రామాయణము, ఆపద్భాందవ శతకం 12. హొసహుడ్యం వెంకటరెడ్డి (1901-1954), హొసహంద్యం: వివేక రత్నమాల, వేదాంత ప్రశ్నరత్నావళి, వేణుగోపాల శతకము | తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015 |