Jump to content

పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొన్ని ఇతర భాషల ఉదాహరణలను ఇక్కడ చూడవచ్చు. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యకలాపాలను పరిశీలిస్తే. హిందీ సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలను చేసినప్పుడు హిందీ భాషా ప్రాంతాలను అన్నింటిని ఇది పరిశీలనకు తీసుకుంటుంది. హిందీ నవల అంటే అన్ని హిందీ రాష్ట్రాలలో ఉన్న హిందీ నవలలను, హిందీ కవిత అంటే అన్ని రాష్ట్రాలలో ఉన్న హిందీ కవితలను అది గ్రహిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు ఇలాంటి పని ఆచరణ సాధ్యం కాదా? రెండు రాష్ట్రాలు తిరిగి ఆలోచించాలి. పాత పరిస్థితే పునరావృతం అవుతుందనే అనుమానాలకు తావు లేకుండా, అకాడమీ రూపకల్పన సాధ్యం కాదా, ఆలోచించాలి.

బెంగాలీ భాషకు రెండు రాష్ట్రాలు మాత్రమే కాదు ఆ భాష రెండు భిన్న దేశాలలో ఉంది. తూర్పు పాకిస్తాన్ దరిమిలా బంగ్లాదేశ్ గా అవతరించింది. ఇప్పటికీ బెంగాలీ వారిని ఎవరినైనా మన దేశంలో ఇప్పుడు తూర్పు బెంగాల్ అనేది లేదు కదా ఇక మన బెంగాల్ను పశ్చిమ బెంగాల్ అని ఎందుకు అనాలి. బెంగాల్ అని అంటే సరిపోతుంది కదా అని నేను ఒక బెంగాలీ మిత్రుడిని అడిగితే. దానికి అతను అంగీకరించలేదు. బాంగ్లాదేశ్ ప్రత్యేకమైన దేశమే. కాని అక్కడున్నదీ మా బెంగాలీ భాషే. మా దృష్టిలో అది ఇప్పటికీ తూర్పు ప్రాంత బెంగాలీ భాషే. మాది పశ్చిమ బెంగాలీయే కాబట్టి ఆపేరు అలాగే ఉండాలి. అంటే తూర్పు పశ్చిమం వేరుగా ఉన్నా, మా భాష ఒక్కటే అనే బలమైన భావాన్ని వారు ఇంకా గట్టిగా కలిగి ఉన్నారు. అంతే కాదు. ప్రభుత్వం కూడా మన పశ్చిమ బెంగాల్లో జరిగే భాషా విషయం సాహిత్య విషయాల పైన చాలా మక్కువ చూపుతుంది. ఆ దేశంలోని భాషా విషయాల అమలులో పశ్చిమ బెంగాల్ నిర్ణయాలను కూడా ఆచరణలోనికి గ్రహిస్తూ ఉంది. 1960 దశకంలో పశ్చిమ బెంగాల్ చేసిన భాషా సంస్కరణలను, విధానాలను బాంగ్లాదేశ్ కూడా పరిశీలించింది. అమలులోనికి గ్రహించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇప్పటికి కూడా వారికి అత్యంత గౌరవనీయుడైన కవే. ఆయన రచించిన సోనార్ బాంగ్లా అనే పాటనే బాంగ్లాదేశ్ తన జాతీయ గీతంగా గ్రహించింది అంటే, భాష సాహిత్యం విషయంలో రెండు ప్రాంతాలకు మధ్య ఉన్న సయోధ్య ఏ విధమైనదో మనం తెలుసుకోవచ్చు. ఇతర సాహిత్యసంస్థలు కూడా సాహిత్య ప్రక్రియలను గ్రహించినప్పుడు రెండు ప్రాంతాలలోని వాటిని గ్రహిస్తున్నాయి. సదస్సులు గోష్టులలో కూడా రెండు ప్రాంతాల సాహిత్యం భూమిక అవుతూ ఉంది. తెలుగు భాష, తెలుగు సాహిత్యం విషయంలో బెంగాలీ భాషకున్న ఈ రకమైన ఆరోగ్యకరమైన ధోరణులు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా అవసరం.

తెలుగు భాషా వికాసం, తెలుగు సాహిత్య ప్రక్రియలకు ప్రోత్సాహం విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉమ్మడి వ్యూహాలు చేసుకోవచ్చు, అవి కలిసి పనిచేయవచ్చు అని చెప్పడానికి బెంగాలీ భాషకు సంబంధించి పైన చెప్పిన విషయం ప్రోత్సాహకారి అవుతుంది.

రచయితే ద్రావిడ విశ్వవిద్యాలయం (కుప్పం) లో ఆచార్యులు ఫోన్ : 9440493604 E-mail : psubbachary@gmail.com | తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015 కతలగంప 2014 నవంబరు 9న బోధన్ స.వెం. రమేశ్ రచించిన కథల సంపుటి 'కతలగంప' పుస్తకాన్ని విడుదల చేసినప్పటి చిత్రం. (ఎడమ నుండి కుడికి) స.వెం. రమేశ్, శిరంసెట్టి కాంతారావు, ఫాదర్ కెనడి, మధురాంతకం నరేంద్ర, పూదోట శౌరీలు, గాలి ఉదయమేరి, ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు, ఆవిష్కరించిన సామల రమేష్ బాబు శిలువగుడి కతలు 2014 నవంబరు 9న బోధన్లో పూదోట శౌరీలు రచించిన 'శిలువగుడి కతలు' పుస్తకాన్ని విడుదల చేసినప్పటి చిత్రం. (ఎడమ నుండి కుడికి) శిరంసెట్టి కాంతారావు, ఫాదర్ కెనడి, మధురాంతకం నరేంద్ర, ఎం.వి.ఎం.దాసు, ఆవిష్కరించిన గాలి ఉదయమేరి, పూదోట శౌరీలు, సామల రమేష్బాబు, ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు, వేమన వాక్కులు విజయవాడ మైన వాక్కులు కాలి 2015 జనవరి 10 న విజయవాడ పుస్తకమహోత్సవ వేదికపై అంగత వరప్రసాదరావు రచన 'వేమన వాక్కులు' పుస్తకాన్ని విడుదల చేసినప్పటి చిత్రం.(ఎడము నుండి కుడికి) సామల రమేష్ బాబు, గుమ్మా సాంబశివరావు, నాగార్జున విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు కోదాటి వియ్యన్నరావు, రచయిత అంగత వరప్రసాదరావు, జి.వి. పూర్ణచంద్, మొవ్వా శ్రీనివాసరెడ్డి 16