మీరిచ్చిన భూముల్లో ఇక్కడ ఇంగ్లీష్. ఇక్కడ జపనీస్, అక్కడ జర్మన్ యూనివర్సిటీలు కడతాం ఇంచరా!
పాటల్లో తెలంగాణ మాండలికం వర్థిల్లింది. కాని అచ్చు మాధ్యమం, దృశ్య మాధ్యమం మాత్రం అందుకు భిన్నంగా అప్పటి దాకా వచ్చిన ప్రామాణిక భాషనే వినియోగించాయి.
ఇక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అధికార భాషగా ఏ భాషని అంటే, ఏ జిల్లా శైలిని అనుసరించాలి అని అనుకున్నప్పుడు, పైన పత్రికల విషయాన్ని తెలంగాణలో పనిచేస్తున్న ఛానళ్ళు భాష విషయంలో అనుసరించే పద్ధతి మార్గదర్శకంగా ఉంటుంది. అంతే కాదు పరిపాలన భాష స్థిరీకరణ అనేది జరగవలసిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఇప్పటి దాకా జరిగిన ఆంగ్ల పాలన భాషలో ఉన్న పదసంచయాన్ని మొత్తాన్ని అనువాదం చేసుకుని పరిపాలన పదకోశాన్ని తయారు చేసుకోవాలి. భారత ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ విజ్ఞాన సృష్టి చేసే సంస్థ CDAC వారు పాలన భాషా నిఘంటువును తయారు చేశారు. కాని అది పైన చెప్పిన ఉమ్మడి రాష్ట్రంలోని ప్రామాణిక భాషనే ప్రాతిపదికగా చేసుకుని తయారు చేసిన నిఘంటువు. తెలంగాణలో అధికార భాషకోసం ఈ నిఘంటువును యధాతథంగా వాడుకోవడానికి వీలు కాదు కాబట్టి, ప్రత్యేకంగా ఒక అధికారిక పాలన భాషా నిఘంటువును తయారు చేసుకోవాలి. అందుకు ముందే అధికార భాషాశైలిని నిర్ధారించుకోవాలి. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం తొలిగా విధాన నిర్ణయాన్ని తీసుకోవాలి. తెలంగాణలో ఉన్న భాషా వేత్తలతో (సాహిత్యకారులు అంటే కవులు, కథారచయితలు, నవలారచయితలు దీనికి సరికాదు) భాషా ప్రణాళిక చేసే నిపుణులతో ఒక ప్రత్యేక సంఘాన్ని నియమించుకొని తెలంగాణలో ప్రచలితంగా ఎక్కువ వ్యాప్తిలో ఉన్న ఏ శైలిని అధికార భాషకు వినియోగించుకోవాలి అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. తర్వాత పైన చెప్పిన పద్ధతిలో అధికార భాష, పాలన భాషానిఘంటువును తయారు చేసుకోవాలి. ఈ స్థాయిలోనే తెలంగాణ
మరి తెలుక్కో ఫోటెక్కడుంది బాబయా?
కోసం ప్రత్యేకంగా అధికార భాషా సంఘాన్ని నియమించుకోవలసి ఉంటుంది. పైన చెప్పిన ప్రత్యేక సంఘం అధికార భాషా వ్యవస్థ కలిసి ఈ పనిని చేయాలి.
ఇక తెలంగాణలో తెలుగు భాష అమలు గురించి ప్రకటన చేసినా. ఆలోచన చేసినా, మరుక్షణమే ఒక సమస్య ముందుకు వస్తూ ఉంది. అది మైనారిటీ సోదరుల నుండి. తెలుగును అధికారికభాషగా అమలు చేయడం. ఉర్దూ ప్రగతికి అవరోధం అనే వాదనను వెంటనే రాజకీయవాదులు వాదనలోనికి తీసుకు వస్తూంటారు. ఇది చాలా సార్లు జరిగింది. కాని అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఉర్దూలో కూడా ఉండేలా చూసి ఉర్దూ భాషీయులకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా చూడడం అంత కష్టమైన పని కాదు. కాకుంటే చిత్తశుద్ధితో ఆలోచించి ఎక్కడ ఉర్దూ భాషీయులు అధికంగా ఉంటే అక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు రెండు భాషల్లో జరిగేలా చూడడం దీనికి పరిష్కారం. అసలు అధికార భాష అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇంత వరకు దృష్టి సారించనే లేదు. అందుకు ఇదే సరైన సమయం.
విద్యాబోధనలో తెలంగాణ భాషా దృష్టి:
తెలంగాణ విద్యాబోధనలో తెలంగాణ చరిత్ర సంస్కృతి, ఆ ప్రాంతానికి చెందిన వీరులు, సాంస్కృతిక వీరులు, చరిత్ర ప్రసిద్ధులైన వ్యక్తుల చరిత్ర ఉండాలని తెలంగాణ ప్రభుత్వం చాలా ఉత్సుకతతో ఉంది. పాఠ్యపుస్తకాల రూపకల్పనకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం అది పని ప్రారంభించడం కూడా చేసింది. కాని పాఠ్యపుస్తకా లలో భాష ఎలా ఉండాలి అనే విషయంపైన ప్రభుత్వంలోని ప్రధాన బాధ్యులైన వ్యక్తులు ఎవరూ ఇంతవరకు ఒక ప్రకటన చేయలేదు. తెలంగాణ పాఠశాలల్లో తెలుగు బోధన ఏ తరగతి వరకు ఉండాలి. తెలుగు మాధ్యమ బోధన ఏ తరగతి వరకు చేస్తారు అనే విషయంపైన ఇంతవరకు ఏ విధమైన అవగాహన కాని, నిర్ణయం కాని చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంగ్లమాధ్యమ పాఠశాలలవైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటీవల జరిగిన నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల్లో తీసుకున్న నిర్ణయాల పైన, వాటి అమలు పైన, ఏ విధమైన చర్యలు తీసుకునే దిశగా ఆలోచనే చేయడం లేదు. తెలుగు మాధ్యమ బోధన విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు తన వ్యూహాన్ని ఆలోచనను తెలుపలేదు. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 18 లక్షల ప్రభుత్వోద్యోగాలున్నాయి. అందులో ప్రతి సంవత్సరం కనీసం 20 శాతం మంది ఉద్యోగ విరమణ పొందినా సుమారు రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీ అవుతాయి. తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015 |