తపాల కార్యాలయం అయిందే తప్ప, భాష అమలు విషయంలో కార్యాలయాలను ఏ మాత్రం కట్టడి చేయలేక పోయింది. అందుకే అధికార భాషగా తెలుగు అమలు ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాల వారీగా ఆయా జిల్లాలలో 12 శాతం నుండి 52 శాతానికి పరిమితం అయింది. సాక్షాత్తు మూల అధికార పీఠం అయిన సచివాలయంలో అధికార భాష అమలు 3 శాతంగా ఉండింది. ఆంగ్లమానస పుత్రులు అక్కడ అధికంగా ఉండడమే దీనికి కారణం. ఇక అమలు చేసే భాషా శైలి ఎలా ఉండాలి. అనే విషయంలో నవ్య ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పటిదాకా ప్రామాణిక భాష పేరుతో వచ్చిన గోదావరి మాండలికాన్ని ప్రమాణ భాషగా, ప్రభుత్వం అంగీకరించిన శైలిలో ఉన్న భాషా శైలిని అది కొనసాగించ వచ్చు. దాన్ని అమలు చేసే వ్యవస్థనే ఆ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసుకోవలసి ఉంది.
తెలంగాణ అధికార భాష దాని అమలు :
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అధికార భాషాసంఘం రెండు రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో అదృశ్యం అయింది. ఈ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఒక శాశ్వత వ్యవస్థని ఏర్పాటు చేసుకోవలసి ఉంది. అది పైన చెప్పిన పద్ధతిలో పూర్తిగా శాశ్వత ప్రాతిపదికన పనిచేసే వ్యవస్థ కావాలి. తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా ఏ చర్యను ఇంతవరకు చేపట్టలేదు. తెలుగును అధికార భాషగా అన్ని స్థాయిల్లో అమలు చేసే దిశగా ప్రభుత్వం ఇంత వరకు ఏ ప్రకటనా చేయలేదు. ఈ దిశగా ఇది తొలి అడుగు ఇంకా వేయవలసి ఉంది.
ఇక ఏ విధమైన భాషని తెలంగాణ రాష్ట్రంలో అధికార భాషగా అమలు చేయాలి అనే విషయంలో చాలా తకరారు ఉంది. ఇప్పటి దాకా ఉమ్మడి రాష్ట్రంలో అమలు అయిన భాషాశైలిని అంగీకరించం అని, తెలంగాణ తెలుగు వేరే అని, తెలంగాణ తెలుగు-ఆంధ్రం ఒకటి కావు అని తెలంగాణ మేధావులు మంత్రులు ఇప్పటికే వాదించి ఉన్నారు. తెలంగాణ తెలుగే అధికార తెలుగుగా అమలు జరగాలి అని వాదించారు.
ఇక తెలంగాణ తెలుగు అనే అనాలి కాని, దీన్ని తెలంగాణ మాండలికం అని అనకూడదు అని కూడా తెలంగాణ మేధావులు వాదిస్తూ వచ్చారు. మేధావుల్లో కొందరైనా తెలంగాణ అంతా ఒకటే తరహా మాండలికం ఉందని భావించారు. ఈ నేపథ్యంలో ఏది తెలంగాణ మాండలికం అనే మౌలికమైన ప్రశ్న వస్తుంది. తెలంగాణలో వేరు వేరు జిల్లాలలో వేరు వేరు మాండలికాలు శైలులు ఉన్నాయి. అయినా ఒక జిల్లాలోని యాస మరొక జిల్లాలో అర్థంకాదనే వాదనే లేదు. కానీ ఇన్ని మాండలికాలలో ఏది ప్రమాణ భాష అవుతుందంటే సమాధానం చెప్పడం అంత తేలిక కాదు. మహబూబ్ నగర్ భాష, అదిలాబాద్ యాస, ఖమ్మం జిల్లా మాండలికం అంతా ఒకేలా ఉండవు. వేటి శైలి వాటికి ఉంది. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల భాష మరొక రకంగా ఉంటుంది. ఏ యాసని అధికార భాషగా అమలు చేయాలి ఇది అంత తేలికగా నిర్ణయించే విషయం కాదు.
తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకంగా పత్రికలు పుట్టాయి. అంతే కాదు, తెలంగాణ కోసం ప్రత్యక్షంగా దృశ్యమాధ్యమాలు అంటే ప్రత్యేకంగా టి.వి ఛానళ్ళు పుట్టాయి. తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఏర్పడిన ఈ పత్రికలు ఛానళ్ళు ఏ భాషని అనుసరించాయి. ఏ శైలిని పాటించాయి
తెలుగు బోధన భాషగా అమలు చేయడంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు చేయవలసిన శ్రమ చేయలేదు. అంతేకాదు తెలుగు మాధ్యమంలో చదువుకుంటే ఉద్యోగాలు రావు అని ప్రజల్లో ఉన్న భ్రమను తొలగించడానికి ప్రత్యక్షమైన చర్యతీసుకొని ఉద్యోగార్థులు సమ్మేలా చేయడంలో, తెలుగు మాధ్యమాన్ని బోధన మాధ్యమంగా కనీసం పాఠశాల స్థాయిలోనైనా అమలు చేయడంలో ఘోరంగా విఫలం అయ్యాయి ఆ ప్రభుత్వాలు, విద్య ప్రైవేటు పరం అవుతూ ఉంటే ఇంటర్ విద్య, పాఠశాల విద్య కార్పొరేట్ రంగంలోనికి పోతూఉంటే ప్రభుత్వ విధానాలు వాటికి అనుకూలంగా ఏర్పడ్డాయే తప్ప, విద్యను ప్రభుత్వ రంగమే ప్రధానంగా అమలుచేసే శక్తిగా ప్రభుత్వం అడుగులు వేయలేదు.
అనే అంశం ఇక్కడ మనకు ప్రధానంగా చర్చనీయాంశం. నమస్తే తెలంగాణ అనే ప్రత్యేక దినపత్రిక అవతరించింది. అలాగే 'టి' న్యూస్ అనే ప్రత్యేకమైన ఛానల్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరికొన్ని ఉమ్మడి రాష్ట్రం కాలంలో ఉన్న పత్రికలు తెలంగాణ కోసం ప్రత్యేక ఎడిషన్లను ఏర్పాటు చేసుకున్నాయి. అలాగే రేడియో స్టేషన్, టి.వి ఛానళ్ళను అధికారిక దూరదర్శన్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఆంధ్ర ఎడిషన్‌కు ఏ భాషని వాడుతున్నాయో తెలంగాణ ఎడిషన్‌కి కూడా అదేభాషని వినియోగి స్తున్నాయి. తెలంగాణ మాండలికాన్ని అంటే ఏ తెలంగాణ జిల్లా యాసని ఈ పత్రికలు వినియోగించలేదు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నమస్తే తెలంగాణ పత్రిక కూడా ఇదే శైలిని అంటే మిగతా ఈనాడు, ఆంధ్రజ్యోతి అనుసరించిన శైలినే అనుసరించింది. శీర్షికలలో తెలంగాణ మాండలిక ధోరణి కనిపించినా, వార్తను అందించడంలో ముప్పాతిక మువ్వీసం ఈ పత్రికలు ఉమ్మడి రాష్ట్రంలోని దిన పత్రికల శైలినే అనుసరించాయి.
ఇక టి. న్యూస్ ఛానల్ కాని, దూరదర్శన్ వారి యాదగిరి ఛానల్ కాని, ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఛానళ్ళు ఏశైలి భాషని ఉపయోగించాయో అదే శైలిని పాటించాయి. టి న్యూస్ మాత్రం ఒక పది నిముషాల వార్తని మాత్రం అచ్చమైన తెలంగాణ భాషలో చెప్పే పద్ధతిని ప్రవేశ పెట్టింది. మిగతా రోజు కార్యక్రమం అంతా పాత ప్రమాణ భాషలోనే సాగుతుంది. దీనికి కారణాలు వెదకడం అంత కష్టమైన పనేం కాదు. తెలంగాణ ప్రాంతంలో వారి కే పత్రిక వస్తున్నా ఇందులో ఇంకా ఉమ్మడి రాష్ట్రానికి చెందిన వారు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. అంతే కాదు. ఒక్క హైదరాబాదులోనే కొన్ని లక్షలమంది ఉన్నారు. వారికి పైన చెప్పిన పత్రికల శైలి భాషే బాగా తెలుస్తుంది, నచ్చుతుంది. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా ప్రాంతాల వారికి ఈ భాషే బాగా అలవాటుగా అర్థం అవుతుంది అని ఈ పత్రికలు భావించడం వల్లనే ఈ శైలి భాషని అచ్చువేశాయి. ఇదే విషయం ఇటు ఛానళ్ళకు కూడా వర్తిస్తుంది. ఉద్యమం తీవ్ర స్థాయిలో సాగినప్పుడు సభలు సమావేశాల్లో, తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015