పుట:Ammanudi December 2018.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
[[దస్త్రం:|458px|page=2]]



"పాఠశాల విద్య మాతృభాషలోనే"

మా పార్టీ మానిఫెస్టోలో ప్రకటిస్తాం - శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ

సామాజిక, సాంస్కృతిక చైతన్య సంస్థ - 'సమైక్య భారతి” నిర్వహణలో వరుసగా పలుపట్టణాలలో 'అమ్మనుడి లోనే విద్య-ప్రజల భాషలోపాలన' అనే అంశంపై జరుగుతున్న సభల్లో భాగంగా-తాడేపల్లి గూడెంలో నవంబరు 17న పెద్ద సభ జరిగింది. బి.వి.ఆర్. కళాకేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి బుద్ధాల వెంకటరామారావుగారు అధ్యక్షత వహించారు.

సి.బి.ఐ లో జాయింట్ డైరెక్టర్గా స్వచ్చందంగా పదవీ విరమణచేసి, ప్రజాసేవా రంగంలోకి అడుగుపెట్టి నేటి తెలుగు సమాజ పరిస్థితులను అధ్యయనం చేస్తూ పర్యటిస్తున్న వి.వి.లక్ష్మీనారాయణగారు త్వరలో కొత్తరాజకీయ పార్టీని స్థాపించనున్న సందర్భంలో - తెలుగు రక్షణ విషయమై జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనడం ఆసక్తి కలిగించింది.

తొలుత - ప్రధాన వక్తగా పాల్గొన్న తెలుగుభాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు డా|| సామల రమేష్ బాబు కీలకోపన్యాసం చేస్తూ ప్రత్యక్ష రాజకీయ పోరాటంలోకి ప్రవేశించబోతున్న లక్ష్మీనారాయణగార్కి అభినందనలు తెలియజేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన రాజకీయరంగ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నామంటూ, అన్నిరంగాలతో పాటు, తెలుగుజాతికి, తెలుగురాష్ట్రాల ఉనికికి సంబంధించిన మౌలిక అంశమైన 'తెలుగుభాషను ప్రశ్నార్థకం చేస్తున్న ప్రభుత్వాల విధానాల్లోని 'కనిపించని కుట్ర'ను గుర్తించాలని విన్నవించారు. ప్రజలభాషలో పాలన, తెలుగు లో విద్యాబోధన అన్న అంశాలపై ఇప్పటివరకూ పాలకవర్గాలు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయని, ఈ విషయం పై లక్ష్మీనారాయణగారు తమ స్పందనను చెప్పాలని కోరారు. తొలినుండీ ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాన్ని వివరంగా తెలియ జేశారు.

తర్వాత ముఖ్యఅతిధి శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ మాతృభాషల్ని రక్షించుకోవలసిన అవసరాన్ని, యునెస్కో ప్రకటనలను వివరించారు. తమిళనాడులో, మహారాష్ట్రలో భాష విషయంలో ప్రజలూ, ప్రభుత్వాలూ కూడా ఎంత పట్టుదలతో వ్యవహరిస్తాయో ఉదాహరణలతో చెప్పారు. మహారాష్ట్రలో కోర్టుల్లో మరాఠీ భాషలో తీర్పులు వెలువడతాయన్నారు. డా||రమేష్ బాబు ప్రసంగంలో ప్రస్తావించిన పలు విషయాలను ప్రస్తావిస్తూ-రాజ్యాంగంలోను, విద్యాహక్కు చట్టంలోను-ప్రాధమిక విద్య మాతృభాషలో ఉండాలని ఉందన్నారు. తమ పార్టీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెడతాము అని సభికుల చప్పట్ల మధ్య ప్రకటించారు. తెలుగుప్రజల్లో భాషాభిమానాన్ని పెంచడానికి తగు నిర్మాణాత్మక కార్యక్రమాన్ని చేపట్టాలని 'సమైక్యభారతి' నేత పి. కన్నయ్యగారికి సూచించారు. ఏ దేశంలో ఎక్కువ చట్టాలుంటాయో, అక్కడ పరిపాలన తక్కువగా ఉంటుంది. అని ఒక పరిశోధన తెలిపింది అని అంటూ, చట్టాలు ఎక్కువ - అమలు తక్కువ' సరికాదని, పటిష్టమైన పరిపాలనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని లక్ష్మీనారాయణగారు అన్నారు. సభలో తెలుగు పండితులు అనుముల వేంకటేశ్వర్లుగారు, స్థానిక ప్రముఖులు శ్రీయుతులు గట్టిం మాణిక్యారావు, పవన్ కుమార్, శ్యాంప్రసాద్ ముఖర్జీ, శ్రీమతి తుమ్మల పద్మజ తదితరులు వక్తలుగా పాల్గొన్నారు.