నవల
డి.పి. అనూరాధ 9010016555
(జరిగిన కథ)
తెలుగు తల్లి కృపతో సూర్యవర్మ కాలాలకు అతీతంగా ప్రయాణాలు చేస్తుంటాడు. మయన్మార్, థాయిలాండ్ లలో తెలుగు మూలాలున్న జాతీయుల్ని కలుసుకుంటాడు. కాంబోడియాలోని ప్రపంచ ప్రసిద్ధిచెందిన ఆంగ్ కార్ వాట్ ఆలయానికి తెలుగు నేలతో ఉన్న అనుబంధం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఆగ్నేయాసియాలో పేరుగాంచిన అలనాటి చంపా రాజ్య వైభవాన్ని కళ్ళారా చూస్తాడు. వియత్నాంలోని నేటి ఆ రాజ్య శిథిలాల మధ్య నడుస్తూ ఉద్వేగానికి గురవుతాడు. అతడి తదుపరి మణిలీ ఎక్కడ?...
చిమ్మచీకటి..
ఏదో కొండ ఎక్కుతున్నా.. అన్నీ రాతి మెట్లే... నా ముందు కొంత మంది నడుస్తున్నారు... నా వెనకా కొంత మంది.
అందరి చేతుల్లో టార్చ్ లైట్లు... వాటి వెలుగులో ఒక్కో మెట్టూ నెమ్మదిగా ఎక్కుతున్నాం.. అటూ ఇటూ ఏవో మాటలు వినిపిస్తున్నాయి కానీ, ఆ భాషేమిటో సృష్టంగా అర్థం కావట్లేదు. నాకు కాస్త ముందు వెళ్తోన్న వ్యక్తి జారిపడిపోతూ “అమ్మా.” అని అరుస్తూ అక్కడే కూర్చిండిపోయింది. దగ్గరగా వెళ్లి చూస్తే పాతికేళ్ల లోపు యువతి.
“మీరు తెలుగా,,” అని అడిగా..
“మీరూ తెలుగు వారేనా...” ఎదురు ప్రశ్నించింది తలూపుతూ...
కాలు బెణికిందా...”అని ప్రశ్నించా.
“అంతగా కాదు. కానీ నొప్పిగా ఉంది.
“మీది ఏ ఊరు”? అడిగా..
“మాది పశ్చిమబెంగాల్లోని ఖరగ్ పూర్. మా పూర్వీకులది వైజాగ్. మా ముత్తాత బ్రిటీష్ సమయంలో రైల్వే కూలీగా బెంగాల్ వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు” చెప్పుకొచ్చింది.
“మీ తెలుగు ఎంతో స్పష్టంగా ఉంది. మీ అమ్మానాన్నల్ని అభినందించాలి.. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం,,” అని అడిగా.
“మా ఇంట్లో ఇప్పటికీ తెలుగే మాట్లాడతాం... మా ఖరగ్ పూర్ణో తెలుగు వాళ్లు ఎక్కువమందే ఉన్నారు. నాకు మీ విషయం అర్థం కావడం లేదు? ఎక్కడ ఉన్నారో తెలియకుండా ఇక్కడికి ఎలా వచ్చారు? అని ఆశ్చర్యపోయింది.
నా కథంతా కుప్తంగా చెప్పా... తెలుగు తల్లి కృపా కటాక్షం వల్ల ఎక్కడెక్కడ ఎలా తిరుగుతున్నానో వివరించా.
“మీ కథలో నేనూ ఓ భాగమైపోయినందుకు ఎంతో సంతోషంగా ఉంది” అంటూ నమస్మరించింది.
తెల్లవారుతోంది. దట్టమైన పొగమంచు కమ్ముకుంది.
'మనం ఉన్న ఈ ప్రదేశం ఇండోనేషియాలోని జోగ్యకర్త అనే ప్రాంతానికి సమీపంలో ఉన్న బొరొబుదూర్. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రాతి బౌద్ద స్థూపం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇండోనేషియాలో ఫారిన్ టూరిస్టులు ఎక్కువగా వచ్చే ప్రదేశమిది. ఓ కొండనంతా తొలిచి మండలం ఆకారంలో స్థూపంలా మలిచారు. తెలుగు జాతి గొప్పతనానికి సంబంధించి ఈ స్థూపంలో ఎన్నో సాక్షాధారాలు ఉన్నాయి. అందుకే డెన్టినీ మిమ్మల్ని ఇక్కడికి తీసుకు వచ్చింది. సూర్యోదయానికంటే ముందే మనం కొండ పైకి చేరుకోవాలి. వెళదాం పదండి..” అంటూ లేచింది.
కాలు కణుక్కుమన్నట్టుంది.. నొప్పితో అమ్మా అంటూ కూర్చుండిపోయింది.
నన్ను పట్టుకుని నడవండి. చేతిని సాయంగా అందించా..నెమ్మదిగా లేచింది. ఆమె బ్యాక్ ప్యాక్ ను తీసుకుని నా భుజానికి వేసుకున్నా. ఇద్దరమూ కలిసి మెట్లెక్కడం ప్రారంభించాం. నా వెనుక