పుట:Ammanudi April-July 2020.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తిరగమోత _

సర్లపల్లె చిదంబరరెడ్డి 9440073636

ప్రజల భాష (మాండలికం) అవసరం ఏమి?!

మొన్న ఒక మిత్రుడు ఫోన్‌ చేసి నేను మీకు ఎప్పుడు ఫోన్‌ చేసినా వ్యావహారిక పదజాలంతోనే మాట్లాడతారు. మీ ఇంటికి కూడా ఒకటి రెండుసార్లు వచ్చాను ఇంట్లో కూడా ఇదే వ్యవహారిక పదాలనే వాడుచున్నట్లు గమనించాను. ఇక మీ రచనల్లో పనిగట్టుకొని అందరూ మరిచిపోయిన స్థానిక పదజాలాన్ని (మాండలికాల్సి) ఎందుకు ఉపయోగిస్తున్నారు?”అని ప్రశ్నించాడు.

నిజమే ఈ పదజాలాన్ని గురించి చాలా వాదాలున్నాయి. ఎవరు దేన్ని అభిమానిస్తే వారు దాన్ని గొప్పదాన్ని చేస్తూ వాదించడం సహజమే. అప్పుడు నేను కూడా నా అభిప్రాయాన్ని చెప్పక తప్పదు. ఒక వేళ నాకు ప్రాథమిక విద్యా స్థాయిలోనే మా ఉండూరి పదజాలం గూర్చి అవగాహన, తెలుగుభాష యొక్క మూలాలను గురించి తెలిసి ఉంటే నేను నివసించే వదజాలంతోనే నిత్యం మాట్లాడుతూ వాటికి గౌరవం పెంచుతూ...చాలవరకూ పదాలు వాడుకను కోల్పోయి కాలగర్భంలో కలిసిపోకుందాను, సరికొత్త పదాలను తయారు చేసిగానీ ఉందేవాడినేమో!!

అయితే అమ్మనుడిని గూర్చిన అవగాహన వచ్చే సమయానికి జరగరాని నష్టమంతా జరిగిపోయింది!! దానిని గురించిన చర్చ అనవసరం.

భాష అన్నది కొన్ని వేల సంవత్సరాల నాడు మనిషి నివసించిన వాతావరణం, శరీరము, నోటి కందరాల నిర్మాణము, తీసుకొనే ఆహారము మొదలైన వాటి అధారంగా స్వరము, ఉచ్చారణ, పదము, మొదలైనవి తయారయి ఆయా గుంపుల భాషగా స్థిరపడినప్పటికీ, కాలానుగుణమైన అవనరాలవల్ల కౌత్త శబ్దాలను తయారు చేసుకొంటూ, ఇతర గుంపుల సంపర్కంవల్ల వాటి పదజాలాన్ని కూడా కలుపుకొౌంటూ నిరంతరం మార్పుకు గురి అవుతూనే ఉంటుంది. ప్రకృతిలో మార్పు అనివార్యం.

మార్చు అనివార్యం అంటూనే వాడుకకు నోచుకోక మరుగున పడిన వాటి గురించి బెంగ ఎందుకు?? అని మీరు అడగవచ్చు.

ప్రపంచంలో అధికారానికీ, వ్యాపారానికీ, బతకనేర్చిన అవకాశ వాదానికీ గుత్తాధిపత్యం ఉండవచ్చునేమోకానీ ఎవరి తల్లిభాషమీద వారికి మమకారమూ, ప్రేమ కొంతలో కొంతయినా ఉండితీరతాయి.

కాలానుగుణమైన మార్పు, వేగము మరికొన్ని కారణాల వల్ల శబ్బాల మూలాలు మారిపోయి ఉన్నాయి. (ఖనిజాల మూలకాలు తెలిసినప్పుడు మాత్రమే వాటిలో ఏవి యే పాళ్లలో కలిపి కొత్తవాటిని సృష్టించవచ్చునో తెలిసేది) వాటి మార్పులు వ్యావహారిక పదాలలో గుర్తుపట్టలేము. అమ్మనుడుల్లో అయితే చాలా కొద్ది మార్పులతో తెలుసుకోగలము. ఆ విధంగా తెలుసుకొన్నప్పుదే కొత్త పదజాలాన్ని తయారు చేయవచ్చు. అలా పదమూలాలు తెలిసినవారు మాత్రమే ఆధునిక కవిత్వం రాయగలరు.

ఒకటి రెండు ఉదాహరణలు గమనిద్దాం. “కాస్త తినూ అనే

మాట ఉన్నది కదా!! “కాసు అంత తిను (కాసు అన్నది ఒకానొకనాడు (ద్రవ్యమానంలో ఆతి చిన్న నాణెం) అంటే కొద్దిగా తిను అని అర్ధం. ఆ కాసు తెలిస్తే వూన,చీమ,నలుసు,చిటికెడు.....వంటివి అర్ధం అవుతాయి. “బాబాయి” అనే మాట కోస్తా ప్రాంతానిది. రాయల సీమలో ఇప్పుడు అందరూ దీన్నే ప్రామాణికంగా వాడుతున్నారు. ఇది ఎలా తయారయ్యింది? “బాబు” అంటే చిన్న లేక చిన్న పిల్లవాడు అని అర్థం. “అయ్య” అంటే నాన్న లేక తండ్రి అని అర్ధం ...ఈ బాబు,అయ్య (చిన్న నాన్న) కలగలిసి బాబాయిగా రూపాంతరం చెందింది. రాయలసీమలోని చిన్నాన్న అప్పప్ప(అప్ప తరువాత అప్ప) సహజవదాలు మాయమయ్యాయి. అలాగే “బస్సు ఆగుద్దాగొలో బస్సు సరే! ఈ ఆగుద్దా అంటే...ఆగుతుందాకి మార్పు. సీమలో అపుడు అన్నది అవుడుగా మారిపోయింది. ఇటువంటి ఉదాహరణలు చాలా చూపవచ్చు.

ఇక మాండలికంలో రాయడం అంటే ఒకరు రాసే పదజాలం ఆ మండలం మొత్తం వాడుక అనికాదు. ఈ పదజాలం వారి వృత్తిని బట్టి, నివసించే చోటునుబట్టి, కులము, మతాన్ని బట్టీ వయస్సును బట్టీ తేడాలు ఉంటాయి. రచయిత మాత్రం అతని పరిధిలో కొన్ని మాత్రమే తీసుకొని కొన్ని సవరించుకొని రచనలు చేస్తాడు.

ఇక పాత్రలకు కాకుండా మొత్తం రచన అంతా మాండలికంలో రాయడాన్ని కొందరు ప్రశ్చిస్తున్నారు. నిజమే. పద్యరచనకు పూనుకొని ఏదో ఒక వృత్తాన్ని భరనభభరవ చందన్సుతో ప్రారంభించారు అనుకౌందాం. ఒక మూనలాగా అదే లయతో పదాలు వచ్చి చేరుచుంటాయి. వృత్తం మార్చాల్సి వస్తే మరలా మూస తయారు చేసుకోవాలికదా!! ఇదే అవస్త ఈ మాండలికంలోనూ!!

ఒక రకమయిన భాషావేశానికిలోనయి మాండలికం చేస్తున్నపుడు రచయితకు నిరాటంకంగా ఆ పదజాలమే అందుబాటుకు వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు వివిధ పాత్రల కోసం వివిధ పదజాలాన్ని వెతకడానికి పోతే ఒక్కోసారి జెచిత్యం దెబ్బతింటుంది. యే పదజాలం యే కేటగిరీదో తెలియక తికమకపదే అవకాశం ఉంది. అందుకే నా వంటి కొందరు మొత్తం కథనాన్ని ఒకే పదజాలంతో చెప్పడానికి యత్నిస్తారనిపిస్తుంది.

ఎవరైనా స్థానిక పదజాలంతో రచనలు చేస్తున్నారంటే తమ భాషా సంపదను వెతికే పనిలో ఉన్నారని అర్ధం. ఇక్కడ కొత్త పాత అనే భావమే వనికిరాదు. భూమిలో ఖనిజాల కోసం వెతకడం అంటే అవి కొత్తవా? పాతవా??

భాషలో స్థానిక పదజాలం ప్రభావం ఎంతగా ఉంటుందో తెలుసుకోవాలంటి మీరు “ఏడు తరాలు” (అలెక్స్‌ హేలీ ఆంగ్లంలో రాసిన “రూట్స్‌” నవలకు తెలుగు పేరు) పుస్తకాన్ని చదవాల్సిందే. కేవలం ఒక మారుమూల కుగ్రామంలోని ఇంట్లో ఉపయోగించే కొన్ని పరికరాల పేర్ల వల్లనే ఏడు తరాల తరువాత ఒక వ్యక్తి తమ జాతి మూలాల్ని కనుగొనడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.