Jump to content

పుట:Ammanudi-May-2019.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“ఆంధ్రభాషామ తల్లి హృదయంతరమున
అడుగులను మోపి, ఠీవిగా నడచి నీవె
ఆంగ్ల విద్యాలయమ్ముల కరిగి - నీదు
జీవితమ్మె నైవేద్యమ్ము చేసినావు”

అనాటి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన కవి. ఎంత చక్కటి పద్యమిది. ఈయన రచనలో భావగాంభీర్యం నిండుగా కనిపిస్తుంది. పద సౌశీల్యమూ కనిపిస్తుంది. చివరిగా -

“బ్రతుకగనెంచ 'ఆంధ్రు” డని
పల్కబోకుమ ; పల్కినంత, నీ
యతనము బుగ్గి పాలయి, ప్రయాసమె
నిల్చును మృత్యుదేవి యై ;
సతతము దుఃఖ భోక్తవయి.
శాంతి నెరుంగక, వెర్రివాడవై
వితరణ శీలురన్‌ గనగ వేడియ
కంఠము రుద్ధ మొందంగా”

స్వాతంత్య్రానికి వూర్వం తెల్ల దొరల పాలనలో దేశంతో పాటు, ప్రజలు, భాష ఏ విధంగా దోపిడీకి గురయిందో, బానిసత్వాన్ని అనుభవించిందో ఈ చిరు కావ్యంలో ప్రస్తావించారు కవి. బ్రిటిష్‌ వారి పరిపాలనను, ఆలోచనలను వ్యతిరేకించిన కవులు ఆ తరంలో అనేకమంది కనిపిస్తారు. జంపనగారు కూడా ఆదారిలో నడిచి, వారి ఆలోచనలను నిర్మొహమాటంగా కావ్య రూపంలో పెట్టడం జరిగింది. అటువంటి నిస్వార్థ కవులను మననం చేసుకోవలసిన అవసరం ఉంది.


(29 వ పుట తరువాయి)

జనానికి కావలసిన శిక్షణ ఇచ్చి, అధికారుల ముక్కు నేలకు రాసి అమలుచేయించాలి. సంఘాలు పోటీ పడాలి. చట్టం అమలుకాకపోతే నష్ట పోయేది ప్రజలే. “తిరిగే కాలు, తిట్టే నోరు” అన్నట్లు ఈ మేధావులకు నేర్చుకునే కుదురు, విషయపరిజ్ఞానం శూన్యం. ఈ ధోరణి వల్లే శంకరన్‌ ప్రారంభించిన ఏజెన్సీ ప్రాంతాల భూమిసర్వే, అడవి హక్కుల మార్గ దర్శకాలు, గిరిజన ప్రాంతాలలో పంచాయత్‌ రాజ్‌ గ్రామసభల ఏర్పాటు నిరుపయోగంగా మారాయి. సంఘాలు మేధావులు రచయితలు ఖండన పర్వాన్ని రక్తి కట్టిస్తున్నారు.జనం కూడా పత్రికలో తమప్రకటన చూసుకుని మురిసిపోతున్నారు. 'నేల విడిచి చేసే సాముగరిడిలకన్న నేలను అంటిపెట్టుకుని నీటిలో చేపల లాగా మెలగగల మెలకువతో నిర్వహించుకుని నిభాయించుకోగల సాములకే ఎక్కువ విలువ, మన్నన'(ఏ. బి.కె. ప్రసాద్‌ 'మహత్తర శ్రీకాకుళ పోరాటం” ముందుమాట 2006) అంటూ గత ఉద్యమాలను చూసిన వారి హితవును చెవినపెట్టాలి. నూతన ప్రజాస్వామిక విప్లవం, పీడిత జన విముక్తి, రాజ్యాధికారం, సాహిత్యం - సామాజిక స్పృహ శాస్త్ర విజ్ఞానాల ఆధునికీకరణ అంటూ “ఎవరికి తెలియని ఏవో పాటలు పాడే” బుద్ధిజీవులు తమపాత్రను నిర్వచించుకో వలసిన అవసరం వచ్చింది.

వలస

పిచ్చికా! నువ్యున్నట్టా లేనట్టా జాడలేని నిన్ను లేవనే అనుకొంటున్నది లోకం. అయినా నువ్వున్నావన్న నమ్మిక గుండె చెట్టు కొమ్మ మీద కిచకిచలాడుతుంది ఇప్పటికీ ఏ మూలో చూరు తొర్రలో ఓ చిట్టి గూడు చిట్ట చివరి ఆశతో నిరీక్షిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతోంది మా గోడకు బిగించిన అద్దం నీ కోసం దిగులు పడింది ఎక్కడికెళ్లిపోయావు పిచ్చుకా! జాలిలేని జనం గాజు కళ్లలో నీ కోసం చుక్క కన్నీరు కరువైందన్న నిజం తెలుసుకున్న తర్వాత దయలేని హృదయాల నీడలో తరంగ దైర్ధాల టవర్లకే తప్ప నీ కోసం చిటికెడు ఆశయం లేదన్న నిజం తెలిశాక మా పిల్లలు యిప్పటికీ నిన్ను పుస్తకాల్లోనే చూసుకొంటున్నారు.

గుర్రాల రమణయ్య

9963 921943

శిశువు శారీరక వికాసానికి తల్లిపాలు మానసిక వికాసానికి తల్లి భాష గుండెలోతుల్లోంచి వచ్చేదీ, మనసు విప్పి చెప్పగలిగేది అమ్మనుడిలోనే.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019

45