పుట:Ammanudi-May-2019.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భాష సంస్కృతి.

డా॥పి. శివరామకృష్ణ (శక్తి) 94414 27977

తలోదారిలో సాహిత్యం-సమాజం-సంఘాలు -సాధికారిత

నూతన ప్రజాస్వామిక విప్లవం, పీడిత జన విముక్తి, రాజ్యాధికారం, సాహిత్యం- సామాజిక స్పృహ, శాస్త్ర విజ్ఞానాల ఆధునికీకరణ అంటూ “ఎవరికి తెలియని ఏవో పాటలు పాదే” బుద్ధిజీవులు తమ పాత్రను నిర్వచించుకోవలసిన అవసరం వచ్చింది.

1. పండిట్స్‌ టైనింగ్‌కు వచ్చిన నాటినుండి రాజమహేంద్రి సాంస్కృతిక వాతావరణంతో నాకు పరిచయం.కానీ జిల్లాలో మన్య ప్రాంతానికి ఉపాధ్యాయుడుగా వెళ్ళిన తరువాత, ఆ గిరిజన పిల్లల మీద మనచదువులు రుద్దటం, నగర వాసులకు ఆ అదోజగత్‌ సహోదరులమీద ఏమి ఆసక్తి లేకపోగా అవాకులు చెవాకులు వాగడం ...వీటినిగూర్చి అలోచిస్తున్నకొద్దీ, ఆ నగర వాతావరణంలో డొల్లతనం అర్ధం కాసాగింది.

2. తెల్లవాళ్ళు ప్రవేశపెట్టిన సార్వత్రిక విద్యకు ఉద్యోగం పరమావధి అయింది. ఆ ఉద్యోగ భద్రత రకరకాల వ్యాపకాలలో మునిగి తేలటానికి భద్రలోకానికి అవకాశమిచ్చింది. పాఠశాల స్థాయి నుండి వక్తృత్వం, వ్యాసరచనలలో తర్ఫీదు, పెరుగుతున్న అక్షరాస్యత, విస్తరిస్తున్న పత్రికారంగం - రచయితలు, సాహిత్యగాళ్ళుగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం కలిగించింది. తొండ ముదిరితే ఊసరవెల్లి అయినట్లు శిష్టసాహిత్యం రసానందం వైపు, నవ్యసాహిత్యం పలా యనం వైపు, ఉద్యమ సాహిత్యం ఉన్మాదం వైవు, సామాజిక స్పృహ పిడి వాదంగా వెర్రితలలు వేస్తూ ఎవరి దుకాణం వారిదిగా గుంపు లను పెంచుకోసాగాయి.

8. వీరేశలింగం సంఘసంస్కరణ గతచరిత్ర అయింది. తెల్ల వాళ్ళు ప్రవేశ పెట్టిన విద్యను,ఉద్యోగాలను ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు తన ఆత్మకథ 'నా జీవితయాత్ర'లో 'ఆ కాలంలో రాజ మహేంద్రవరంలో విద్యాసంస్థల గురించి, విద్యావిధానాన్ని గురించి విపులంగా వ్రాస్తాను. ఉత్తరోత్తరా ఈ విద్యావిధానం మన జాతినెట్లా నిర్వీర్యం చేసిందో తెలుసుకోవాలంటే - ఆనాటి మన జాతీయ విద్యావిధానం, దాన్ని ఇంగ్లిష్‌ వాళ్ళు వచ్చి ధ్వంసం చేసిన విధము, అందువల్ల మనజాతి అవిద్యలో మునిగి పోవడము బాగా అవగాహన చేసు కోవాలి. ఈ నూతన విద్యావిధానానికి దాసుడైన నాబోటి వారి వర్ణన, ఈ విషయంలో మరీ సమంజసంగా ఉంటుందనుకుంటాను. మెకాలే సలహా మీద ఈ దేశంలో ఇంగ్లీష్‌ చదువు స్థాపించడానికి నిర్ణ యించారు. ఆనాటి పాలకుల విద్యాదర్భంఃఆనాదన్న మాటేమిటి, ఈనాటికి అదే. తమ పరిపాలనకు కావలసిన గుమస్తాలను దుబా షిలను తయారు చెయ్యటమే. ఆ జాతీయ విద్యావిధానపు ఆదర్శం జాతీయమైనది, విశాలమైనది. ఈ నూతనవిద్యకు ఆదర్శం నౌకరీ, ధన సంపాదనా, స్వార్ధమూను. ఎప్పుడైతే మిడిల్‌ స్కూళ్ళ చదువు పూర్తిచేసిన వాళ్ళు, మెట్రికులేషన్‌ పాసయిన వాళ్ళుకూడా పెద్ద పెద్ద ఉద్యోగస్తులై అమితంగా ధన సంపాదనలో పడ్డారో, అప్పుడే దేశంలో విద్యాదర్శాలు క్షీణించాయి. జనం ఇంగ్లిష్‌ చదువులకు తియ్య నీటికీ చేపలెక్కినట్లు ఎక్కారు. అప్పట్లో ఈ చదువులలోకి వెళ్లిన వారంతా ఉద్యోగస్తులై ధనార్జన బాగా చేయడం వల్ల దేశస్తుల వ్యామోహం అటు తిరిగింది. అంటూ దుయ్యబట్టిన తీరును గాని,” నీవేమన్నా కరణానివా మునసబువా కనిస్టేపువా, నీకు దడిచేందుకు అంటూ ఉద్యోగుల దాష్టికాన్ని ఎత్తిపొడిచిన చిలకమర్తి లేవదీసిన ప్రశ్నలను చర్చించే వారు కరువయ్యారు. చరిత్ర వేత్త రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం, దామెర్ల ఆర్ట్‌ గాలరీలమీద ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు. నేదునూరి గంగాధరం గారి జానపద సాహిత్యం “మున్నీరు? “మిన్నేరు” అద్దేపల్లివారు (ప్రచురించారుగాని, వాటిని పట్టిం చుకునేవారు లేరు. మధిర సుబ్బన్న దీక్షితులు సంప్రదాయంగా చెప్పు శ్రునే కాశి మజిలీ కధలను ప్రచురించి గడించారు. నవభారత గురు కులం, భూపతిపాలెం పాఠశాలలు విశిష్ట" విద్యాలయాలుగా వెలు గొందుతుండేవి.

4 మార్కిస్ట్‌ విమర్శకుడు త్రిపురనేని మధుసూదనరావు మాటల్లో “వెన్నెముక లేని మధ్యతరగతి జీవితం సాహిత్యంలోకి ప్రవేశించింది”. “తెలుగు సాహిత్యాన్ని జానవదసాహిత్యం అని ముద్దుపేరో మొరటు పేరో పెట్టి విస్మరిస్తున్నారు. తెలుగు సాహిత్యం అంటే అనువాద సాహిత్యమే అని బహుళ ప్రచారం చేస్తున్నారు. (సాహిత్యంలో వస్తు శిల్పాలు పెర్సెక్టిన్‌ ప్రచురణ 19.వు 117,109.) ఇలా లిఖిత సాహిత్యాన్నికళలను రుద్దటాన్ని ప్రపంచవ్యాప్తంగా గమ నించే ్లబ్‌ ఆఫ్‌ రోమ్‌' ఈ పోకడలను 'టెక్నో ట్రానిక్‌ ఎత్నోసైద్‌' అంటే జంత్రబలంతో జాతుల సృజనాత్మకతమీద చేసే మారణ కాందగా నిరసించింది.

5. అవ్వాకావాలి, బువ్వాకావాలి అంటూ స్వేచ్చా కావాలి - భద్రతా కావాలంటూ ఊగిసలాడే మధ్యతరగతి పలాయన వాదులను తెన్నేటి సూరి చెంగిజ్‌ ఖాన్‌ నవలలో మన్యం వంటి గోబీ ఎడారులకు పోరాదా అంటూ ఎత్తి పొడిచినా - పాపికొండలలో కొండరెడ్డి తెగను 1943లొ అధ్యయనం చేసిన మానవ శాస్త్రవేత్త హైమెందర్భ్‌ , రెండు గంటల ప్రయాణం దూరంలోజఉన్న గిరిజన ప్రాంతాల గూర్చి ఈ నగర వాసుల అజ్ఞానాన్ని, పిరికితనాన్ని దెప్పిపొడిచినా ఈ భద్ర లోకానికి చీమకుట్టినట్టన్నా ఉండేదికాదు. అటు మన్యం వైపు చూస్తే అడవుల నరికివేత ముమ్మరంగా సాగుతున్న రోజులవి. గిరిజన ప్రాంతంలో రైతుకూలి సంఘాల సాయుధ దళాలు గిరిజనులను వేధించే కింది స్థాయి అధికారులను మందలిస్తూ, కూలి రేట్లు పెంచు తూ కలప సారా వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుంటూ తమపట్టు కోసం ఎత్తుగడలు వేస్తుండేవి. | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి ఆ మే 2019 |