శతాబ్దంలో బీదర్, బిజాపూర్, అహమ్మద్ నగర్, గోల్కొండ వంటి ముస్లిం రాజ్యాలన్నీ ఒక్కటై విజయనగరం మీద దాడి చేసినాయి. విజయనగర సామ్రాజ్యం కూలిపోయింది. అప్పుడు హంపి, బళ్ళారి ప్రాంతాలలోని తెలుగువాళ్లు చాలామంది, కూడబెట్టుకొన్న సంపదను మూటగట్టుకొని, కాలినదకనా ఏనుగులూ గుర్రాల మీదా పాలోమంటూ వలనపోయినారు. పెనుగొండ, చంద్రగిరి, తంజావూరు, మదుర ప్రాంతాలకు ఆ వలస జరిగింది. బళ్ళారి ప్రాంత పల్లెలన్నీ ఇంచుమించుగా నిర్మానుష్యమై పోయినాయి. అప్పుడు ముస్లింరాజుల సైన్యంలో ఉద్యోగం చేస్తుండిన ఉత్తర కర్ణాటక ప్రాంతపు వీరశైవ గ్రామీణులు, వాళ్లు రైతులు కూడా కావడం వలన, ఖాళీ అయిన బళ్ళారి ప్రాంతంలో కుదురుకొన్నారు. బళ్ళారి సేద్యపు భూములు బంగారం దొరికినట్లు దొరికినాయి వాళ్లకు. కుదురు కొన్న వీరశైవ కన్నడిగులు మెల్లమెల్లగా తమ బంధువర్లాన్ని కూడా ఉత్తరం వైపు నుండి రప్పించుకొన్నారు. ఎందుకంటే ఉత్తర కర్నాటక అప్పుడూ ఇప్పుడూ కూడా తీవ్రమైన కరువు ప్రాంతం. అక్కడి గ్రామీణులకు సైన్యంలో ఉద్యోగమే అప్పటికి ఆధారం. వాళ్ల వలసవల్లనే బళ్ళారి ప్రాంతంలో కన్నడం పెరిగింది. బళ్ళారి తావున ఉండిన తెలుగుదనమంతా పారిపోయింది. కొత్తగా కన్నదదనం వచ్చి కుదురుకొనింది.
సు: మీ మాటకు అడ్డుతగులుతున్నందుకు మన్నించండి. తెలుగువాళ్లు అంత పిరికితనంగా పారిపోయారు అంటే నమ్మశక్యంగా లేదు.
జో : నిజమే. నా మాటలు వింటే ఎవరికైనా అట్లే అనిపిస్తుంది. నిశిత పరిశీలనలో మాత్రమే నిజమైన చరిత్ర దొరుకుతుంది. హరిహర, బుక్కరాయల కాలం వరకూ ఉండిన నానుడి ఏమిటంటే పదిమంది హిందూ సైనికులకు ఒక్క ముస్లిం సైనికుడు సాటి అని. అందుకే ప్రౌఢ దేవరాయలు కొందరు ముస్లింలను తన సైన్యంలో చేర్చుకొని, తన హిందూ సైనికులకు కూడా వారిచేత శిక్షణనివ్పించినాడు. ఆయన కాలానికి ౩ :1 అయింది. కృష్ణదేవరాయల కాలానికి హిందూ ముస్లిం సైనికుల పోరాట పటిమ 1: 1 అయింది. అయినా కూడా ముస్లిం సైనికుల క్రౌర్యం హిందూ సైనికులకు లేదు. దానికి కారణం వారి వారి పాలకులే. ముస్లిం పాలకులకు అప్పుడు ఒక యుద్ధనీతి లేదు. యుద్ధ నీతే కాదు, ఏ నీతీ లేదు. ఖిల్టీ, దేవగిరి పాలకుడైన రామచంద్రరావుని చంపేసి, అతని భార్యనూ కూతుర్నీ ఇద్దరినీ పెండ్లి చేసుకొన్నాడు. ఇట్లాంటి ఉదాహరణలు కోకొల్లలు. వాళ్లతో పాటు సైన్యంలో పనిచేస్తుండిన వీర శైవులు కూదా ఈ క్రాౌౌర్యాన్ని ఒంట పట్టించుకొన్నారు. కులం లేదు గోత్రం లేదు, పేదా గొప్పా తేడా లేదు, మనుషులంతా సమానమే అని బోధించిన మహనీయుడు బసవేశ్వరుడు. కానీ తరువాతి కాలంలో ఆయన అనుయాయులు, పరమత ద్వేషాన్నే కాదు, పరభాషా ద్వేషాన్నీ గుండెల నిండుగా నింపుకొన్నారు. కృష్ణదేవరాయలు వైష్టవాన్నీ తెలుగునీ ఆదరించడం వాళ్లకు కంటగింపు అయింది. వీరశైవుల మతభాష కన్నడం. శివుడే దేవుడు, కన్నడమే భాష అనేది వాళ్ల మతం. అట్లాంటి వీరశైవులూ ముస్లింలు కలిసి దాడి చేసినప్పుడు, తమ రాజు యుద్ధరంగంలో కనుమూసినప్పుడు, పారిపోవడమో బలికావడమో రెండే దారులు అప్పుడు బళ్ళారి తెలుగు ప్రజలకు.
సు: మీరు చెప్తున్న ఉత్తర కర్నాటకలో అప్పుడు కానీ ఇప్పుడు కానీ తెలుగువాళ్లు లేరా?
జో: ఎందుకు లేరు, అవ్చుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. కానీ వాళ్లంతా కన్నడిగులైన తెలుగువాళ్ళు. పాటిల్ గౌడ అనే పట్టాలను పెట్టుకొనన వాళ్లంతా ఒకప్పటి రెధ్గు. వీరశైవం తీసుకున్న రెడ్డు బలిజలు కన్నడిగులైనారు. ఎంత కన్నడిగులైనా వాళ్ల శాఖల పేర్లను గమనిస్తే వాళ్లు తెలుగువాళ్లని తెలిసిపోతుంది. పాకనాటి, మోటాటి, వెలనాటి, మున్నూటి శాఖల రెడ్డు ; కొండవీటి, రాజమహేంద్రి శాఖల బలిజలు కన్నడిగులైనారు. ఇప్పటి ఉత్తర కర్నాటకలో వీళ్ల జనాభా మాత్రమే 40 శాతం వరకూ ఉంటుంది. తెలుగులోలాగా కన్నడంలో 'ట అనే ఉపవిభక్తి లేదు. పాకనాడు = పాకనాట్వి కొండవీడు = కొండవీటి వంటి మార్పులు కన్నడంలో జరగవు. ఉపవిభక్తితో సవా తెలుగుపేర్లను తమ శాఖల్లో నింపుకొన్న కన్నడిగులు వీళ్లు. 16వ శతాబ్దంలో బళ్ళారికి వచ్చింది వీళ్లే మా సొంతవూరైన జోళదరాశిలో, దొడ్డనగౌడ అనే ఆయన ఉండేవారు. నాటకరంగంలో పేరుమోసినవారు. కన్నడిగులు వారి కన్నడ నాటకరంగం గొప్పతనం గురించి మాట్లాడేటప్పుడు, దొడ్డనగౌడగారి పేరు లేకుండా ఉండదు. ఆయన, లింగదీక్ష తీసుకొని వీరశైవులుగా మారిన మోటాటి శాఖకు చెందిన రెడ్డి. ఇటువంటి వారు ఎందరో ఉన్నారు. (ఇంకా ఇంటిస్థాయిలో తెలుగును నిలబెట్టుకొన్న వాళ్లు కూడా నాకు తెలిసి పదిహేను ఇరవై శాతం వరకూ ఉన్నారు.
సు: భాషను వద్దనుకొన్నా కులాన్ని గుర్తుంచుకోవడం వింతగా ఉంది కదండీ!
జో : వింత కాదు దౌర్భాగ్యం. వాళ్లకు వేమన కావాలి. హేమారెడ్డి మల్లమ్మ కావాలి. వేమన పేరుతో సభలు జరుపుతారు. హేమారెడ్డి మల్లమ్మకు పూజలు కొలువులు చేస్తారు. మల్లమ్మపండుగ రోజును ఉత్తర కర్నాటకలో అధికారిక సెలవు రోజుగా ప్రభుత్వం ప్రకటించింది. కన్నడంలో వేమన, మల్లమ్మ పుస్తకాలను అచ్చువేసి, ఊరూరా ఇంటింటా పంచుతారు. ఇదంతా వాళ్ల రెడ్డి ఉనికిని నిలబెట్టుకోడానికి చేస్తున్నారు. మంచిదే, ఉనికికోసం, ఉనికిని నిలజెట్టుకోవడం కోసం పాటువడడం మంచిదే. అయితే మీకు
22
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019