పుట:Ammanudi-May-2019.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రాజులూ, రాజ్యాలూ లేని, ప్రజలను రక్షించే ప్రభుత్వమంటూ యేదీలేని వాక అరాజక కాలంలో 'గోపల్లె'" నవల ప్రారంభమ వుతుంది. పాళిగాళ్ళ పాలన యింకా కొనసాగుతూనే వుంది. కుంపిణీ వాళ్ళ రాజ్యం యింకా మొదలుగాని కాలం అది. యే గ్రామానికా (గ్రామం చిన్న రాజ్యంగా మారి, తమను తాము దొంగల బారి నుంచీ కాపాడుకోవల్సిన రోజుల్లో గోపల్లె గ్రామ సమీపంలో వాంట రిగా కనబడిన అభాగ్యురాల్ని చెరువులో తొక్కిపట్టి, ఆమె చెవులకున్న కాసిన్ని బంగారు నగలను దోచుకుంటాడో దుర్మార్గుడైన దొంగ. ఆమె ముఖాన్ని కాలితో నీటి అడుగుకు తొక్కుతున్నప్పుడు, వాడి కుడి కాలి బొటన వేలిని నోటితో గట్టిగా కొరికి పట్టుకుంటుందా ఆడ మనిషి, అలా తప్పించుకోలేక ఆవూరి రైతు చేతికి దారికిపోతాదా దొంగ. ఆడమనిషి శవంతో బాటూ, ఆవిడ భర్త, హంతకుడూ ఆ వూర్లో జరిగే పంచాయితీకి హాజరు కావడంతో “గోపల్లె” నవల మొదలవుతుంది.

వంచాయితీని నడిపే కోట కుటుంబాన్నంతా వరిచయం చేశాక, ఆ కుటుంబానికున్న మూల స్థంభం. “జేజి అనుభవాల పాతరనంతా కథకుడు తవ్వడం మొదలు పెడతాడు. 'చెన్నాదేవి అనే తన వేలు విడిచిన తోడబుట్టును రాణిగా చేసుకోవాలన్న తురక దొరనుంచీ తప్పించడం కోసం వొక గుంపు దక్షిణాదికీ పారిపో సాగింది. తురకరాజు సైన్యం వెంబడించ సాగింది. దారిలో యిలాగే తురక దొరల బారిన పడిన స్త్రీల గాధలు వినబడతాయి. (చిత్తూరు జిల్లా గుర్రం కొండ దగ్గర రెడ్దెమ్మ కొండ దగ్గర యిటువంటి కథే ప్రచారంలో వుంది. నవాబు బారి నుంచీ తప్పించుకోవడం కోసం రెడ్దెమ్మ అనే పల్లె పడతి రెండుగా చీలినరాతి లోపలికి దూరి మాయమై పోతుంది. ఆవిడ దేవతై పోయిందని అక్కడ గుడి కట్టారు. పిల్లలు పుట్టని వాళ్ళు అక్కడికెళ్ళి మొక్కు కుంటారు. చిత్తూరుజిల్లాలో రెడ్దెన్ము, రెడ్డెప్ప, రెడ్డిరాణి, యిలా మొక్కుతో పుట్టిన వాళ్ళు పేర్లు పెడతారు. యీ కథ ఆధారంగా ప్రసిద్ధ రచయిత్రి ఆర్‌. వసుంధరాదేవిగారు “శెడ్దెమ్మ గుండు” అనే నవలిక రాశారు)

అలా మైళ్ళకొద్దీ పారిపోయి వచ్చిన వాళ్ళు శ్రీరంగం దాటి వొకచోట ఆగి, అడవిని తీర్చి, వూరుగట్టుకున్నారు. ప్రకృతిలో జీవిస్తూ, దొరికిన చెట్లనుంచీ, దగ్గర వున్న పశు పక్షుల నుంచీ బతకదానికి కావల్సిన వస్తువులనూ, దినుసులనూ సమకూర్చుకోసాగారు. “యీ నిడుపు వేటలో వాళ్ళందరూ ఎలమీ, తనివీ (తృప్తి) పొందినారని చెప్పలేము. కొందరు తాము పుట్టిన తావును తలచి వగచేవారు. వరుసగా చాలా నాళ్ళు నడుస్తూ రావడం వలన ఇది తెలియలేదు. ఇక ఇక్కదే మనకు అని ఎరుక పడిన ఆ తలపు దగ్గర (భూతము) అయి పట్టి పీడించింది కొందరిని” అంటాడు కథకుడు. అతరి నుంచీ పారిపోయివచ్చి, ఆ గ్రామాన్ని చేరుకున్న 'గోవు” పేరుతో ఆ వూరిని “గోపల్లె అని పిలవ సాగారు. మొదట్లో వీళ్ళలాగే తెలుగునాడు నుంచి వచ్చి అక్కడ స్థిరపడిన వాళ్లను కలిసి, వియ్యాలను యేర్చరచు కున్నారు.

యీ వలసల అనుభవాలనంతా చెప్పాక మళ్లీ కంసాలి భార్యను చంపిన హంతకుడికి సబళము యెక్కించే శిక్షను విధించే దగ్గరికి చేరుతుంది కథ. తమ పంటనంతా మిడతలు నాశనం చేయడంతో, భారతదేశానికి తెల్లవాళ్ళు రావడంతో మొదటి నవల “గోపల్లె” ముగుస్తుంది. కథ చెబుతూనే కీరా ఆనాటి సామాజిక పరిస్థితులనూ, ఆచార వ్యవహారాలను పరిచయం చేస్తారు. కరెంటు, రహదారులూ, యంత్రాలూ లేని వొక ఆదిమ కాలంలో మనుషులు ప్రకృతిలో మమేకమై జీవిస్తూ, పశువులతో జంతువులతో సహజీవనం చేస్తూ, ఆనాటి పితృస్వామిక వ్యవస్థ తాలూకూ విలువల కోసం పరితపిస్తూ జీవించిన వైనమంతా కథలో భాగంగా పాఠకుడ్ని చేరుకుంటుంది. పెళ్లయిన తర్వాతే వక్కాకు వేసుకునే సంప్రదాయమూ, కోడి యీకలతో చెవిని శుభ్రపరుచుకునే పద్దతీ, పెళ్ళాం కడువుతో వున్నప్పుడు మొగుడు గడ్డం పెంచే ఆ భారమూ, తెలుగు నాడుకు దూరమైనా “రామ నామము కలకందా!” అని భజనలు చేసుకునే మనుషులూ, యిలా తమిళ - తెలుగు కలయిక వున్న ప్రాంతాల్లో (ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో) యిప్పటికీ వున్న సంప్రదాయాలనంతా తూత్తుకుడి జిల్లా తెలుగు వాళ్ళల్లోనూ గమనించవచ్చు.

“గోప్రల్లె జనాలు” నవల రెండు భాగాలుగా విభజించబడింది. మొదటి భాగం దాదాపుగా “గోపల్లో నవలకు పొడిగింపుగానే కనబడు తుంది. దేశానికి తెల్లవాడు చాలా మార్పుల్ని తీసుకొచ్చాడు. మట్టి నూనెతో వెలిగే హరికేన్‌లాంతర్లు వచ్చాయి. పిల్లల చదువుల కోసం వూరి పెద్ద వాక అయ్యోరును తీసుకొచ్చి బడిని పెట్టాడు. ఆ అయ్య వారికి పల్లెలోని జనాలు తనతో మాటాడిన అరవమూ, తమతో తాము మాట్లాడుకునే తెలుగూ - రెండూ యిబ్బందినీ, విస్మయాన్నీ కలిగించాయి. గోపల్లెలో చివరగా వో సతీ సహగమనం గూడా జరుగుతుంది. చనిపోయిన భర్తపైన అంతులేని అనురాగంతో, అతడు చనిపోయాక తన అస్తిత్వపు అవసరమే లేదనుకున్న వో భార్యను సతీ సహగమనం చేయించిన పద్దతులు బీభత్సంగానూ, విస్మయం గానూ కనిపిస్తాయి.

యిప్పటికీ రాయలసీమ ప్రాంతంలో వాడుకగా వుందే “దేవ రెద్దు” సంప్రదాయం గోపల్లెలోనూ వాడుకలో వుండేది. మనుషుల్లాగే పశువులు గూదా కొత్త ప్రదేశానికి అంత త్వరగా యిష్టపడవు. అవి గూడా మనుషుల్లాగే వాసనలకూ కట్టుబడి వుంటాయి.

(వ్రతం వుండేవాడు మరుపూటే వొక గంగాళం తిండిని తింటే కన్నతల్లి గూడా “నువ్వు వ్రతం వుందే అందం చాల్లేరా!” అనక తప్పదు. యింటినీ, వూరినీ కాపాడే కుక్కలను దారి మల్లించడం కోసం దొంగలు చిత్రమైన వశీకరణ మార్గాలు వెతుక్కుంటారు. అగి పెట్టె అన్న వస్తువు రాగానే ఆనాటి జనాలు భూమ్యాకాశాలు తలకిందు లైనట్టుగా వాపోతారు. పెద్ద ఇళ్ళలో నిప్పును ఆరిపోకుండా కాపాడు కోవడం, లేనివాళ్ళు వెళ్ళి తెచ్చుకోవడమే గొప్పని వాళ్ళ ప్రగాఢ విశ్వాసం.

“గోపల్లె జనాలు” రెండవ భాగం ఆధునిక కాలానికి తీసుకొ స్తుంది. యేదయినా పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుని తాంబూలాలు మార్చుకునే సమయంలో అమ్మాయి మేనమామ రోకలిని తీసుకెళ్ళి, ప్రధాన వాకిలి ముందు నిలబడి “తురక వాడు వస్తున్నాడు అని మూడుసార్లు చెవ్చడం వొక ఆచారంగా మారిపోయింది. విల్లలు

| తెలుగుజాతి పత్రిక అమ్మనుడి 6 మ్రే209 |