పుట:Ammanudi-May-2019.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తమ ప్రాజెక్టులను చేస్తూనే సేకరిస్తున్నారు. కేంద్రం పక్షాన ఒక ప్రామాణికమైన గ్రంథాలయాన్ని ప్రారంభించడానికి చర్యలు చేపట్టడమైంది. 2018 - 2019 ఆర్థిక నంవత్సరంలో 570 ముఖ్యమైన తెలుగు గ్రంథాలను కొనుగోలు చేయడమైంది. వాటిని భద్రపరచదానికి అవసరమైన 6 అరలను (6 Book Racks) కొనుగోలు చేయడమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్న తాళపత్ర గ్రంధాలయాల్లోని తెలుగు తాళపత్ర గ్రంథాలను డిజిటలైజ్‌ చేసి తెచ్చుకొని కేంద్రం వెబ్‌సైట్‌లో పొందు పర్చాలని నిర్ణయించడమైంది. ఆ మేరకు ఆయా గ్రంథాలయాలకు లేఖలు రాయడం జరిగింది.

ప్రభుత్వ ప్రాచ్య లిఖిత పరిశోధనాలయం - హైదరాబాద్‌లో కార్యశాల:

2019 ఫిబ్రవరి 11 నుండి 17 తేదీ వరకు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రాచ్య లిఖిత పుస్తక భాంఢాగారం మరియు పరిశోధనాలయంలో "శాసనాలు, లిపి, తాళపత్ర గ్రంథాల వరిష్కరణపై కార్యశాల నిర్వహించడమైంది. ఇందులో తెలంగాణలోని పూర్వ 10 జిల్లాలలోని పరిశోధక విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, జూనియర్‌ & డిగ్రీ కళాశాల అధ్యాపకులకు, విశ్వవిద్యాలయాల సహాయాచార్యుల వరకు అవకాశం కల్పించడమైంది. ఆయా అంశాలలో నిష్ణాతులైన వారి చేత ప్రయోగాత్మక శిక్షణ ఇవ్వడమైంది.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్య లిఖిత పరిశోధనాలయం తిరుపతిలో కార్యశాల:

2019 మార్చి 25 నుండి 31 తేదీ వరకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధనాలయంలో 'శాసనాలు, లిపి, తాళపత్ర గ్రంథాల పరిష్కరణపై కార్యశాల నిర్వహించడమైంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని 18 జిల్లాలలోని పరిశోధక విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, జూనియర్‌ & డిగ్రీ కళాశాల అధ్యాపకులకు, విశ్వవిద్యాలయాల సహాయాచార్యుల వరకు అవకాశం కల్పించడమైంది. ఆయా అంశాలలో నిష్ణాతులైన వారిచేత ప్రయోగాత్మక శిక్షణ ఇవ్వడమైంది. ఏడు రోజుల శిక్షణ కార్యక్రమాలన్నింటిని వీడియో రీకార్డింగ్‌ చేయడమైంది.

భవిష్యత్‌ ప్రణాళిక:

ఈ కేంద్రం తెలుగు భాషా సాహిత్యం చరిత్ర, సంస్కృతులకు సంబంధించిన ముఖ్యమైన, విలువైన సమాచారంతో ఒక సంగ్రహాలయాన్ని (మ్యూజియం) ఏర్పాటు చేయాలని భావించడమైంది. త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. ప్రాచీన తెలుగు సాహిత్యం మీద పరిశోధనాత్మక వ్యాసాలను ఆహ్వానించి కేంద్రం పక్షాన 'తెలుగు సిరి 'అనే పేరుతో తైమాసిక పత్రికను (మొదట అంతర్జాలంలో, ఆ తర్వాత ముద్రణ రూపంలో కూడా) తీసుకరావాలని భావించడమైనది. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి సంబంధించిన లోగో నమునా (logo Model) రూపొందించడం జరిగింది.


తెలుగును బోధించడం కాదు : తెలుగులోనే అన్నీ బోధించాలి

16

తెలుగుజాతి పత్రిక అవ్మునుడి * మే 2019