Jump to content

పుట:Ammanudi-May-2019.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా బద్ధకానికి తగిన ఒక కొత్త లిపిని కనిపెట్టి ఆయా భాషల స్థాయిని నా లిపి స్థాయికి తెగ్గొట్టి నా లిపి మీద పని చేస్తున్నాయి గనుక ఈ పనిముట్లు విజయవంతం అయ్యాయి”. అనే భావనలో ఉన్నాడు. అని అనిపిస్తోంది.

భారతీయ భాషల పై జరగాల్సిన పరిశోధనలకు, పని చేయాల్సిన సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వనంత వరకు ఇలాంటి నాణ్యతలేని పరిశోధనలే చలామణి అవుతాయి. భాషల పట్ల శ్రద్ధ ఉండి ఉంటే ప్రభుత్వాలు ఇలాంటి వృథా పనులలో డబ్బులు ఖర్చు చేయవు.

ఏవ్రిల్‌ 27న వచ్చిన హిందూ పత్రిక వార్తలో, సరికొత్త పురోగతిగా ఈ ఐఐటి మద్రాసు భారతి లివి జట్టు వారు తమ లిపిలో ఓసీఆర్‌ పని చేస్తుందన్నారు. తద్వారా తొమ్మిది భాషల్లో ఓసీఆర్‌ పని చేస్తోందని రాసుకున్నారు. అది భాషలను ఉద్ధరించే విధానంగా పలువురు ఈ వార్తను సోషల్‌ మీడియాల్లో పంచుకున్నారు.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మే 2019

10